OTT Movie : రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఛత్తీస్‌గఢ్ జంగిల్ టౌన్ చండ్‌లో సెట్ అయిన ఈ సిరీస్ సీరియల్ కిల్లర్ మిస్టరీ, కుల వివక్ష థీమ్స్‌ను డీప్‌గా టచ్ చేస్తుంది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ‘పాతాళ్ లోక్’ లాంటి వైబ్ ని ఇస్తుంది. ట్రైబల్ కల్చర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ని ఒక్కసారి చూడటం మొదలు పెడితే ఆపడం కష్టమే. అందులోనూ కిల్లర్ హత్యలు చేసి తలను తెసుకెళ్తూ, మోండాన్ని వదిలేస్తుంటాడు. ఇన్వెస్టిగేషన్ కూడా ఇంటెన్స్ గా ఉంటుంది. ఈ సిరీస్ కుల వివక్ష మీద ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్‌తో ఎండ్ అవుతుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.
‘Janaawar – The Beast Within’ 2025లో వచ్చిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. శచింద్ర వాట్స్ దర్శకత్వంలో భువన్ అరోరా (ఎస్ఐ హేమంత్ కుమార్) మెయిన్ లీడ్ లో నటించారు. ఇది 2025 సెప్టెంబర్ 26 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది హిందీ వర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తం 7 ఎపిసోడ్స్ ఒకే సారి రిలీజ్ అయ్యాయి. ఐయండిబిలో 7.0/10 రేటింగ్ ని పొందింది.
ఛత్తీస్ గఢ్‌లోని జంగిల్ టౌన్ చండ్‌లో ఎస్ఐ హేమంత్ కుమార్ ఒక మిస్సింగ్ పర్సన్ కేస్ తీసుకుంటాడు. టౌన్ లో ఒక వ్యక్తి డిసప్పియర్ అయ్యాడు. ఆ తర్వాత హెడ్‌లెస్ బాడీ దొరుకుతుంది. ఇది సీరియల్ కిల్లర్ పనిగా తెలుస్తుంది. ఆ తరువాత కూడా కిల్లర్ వరుస హత్యలు చేస్తూ తల లేని మోండాన్ని వదిలి వెళ్తుంటాడు. ఇన్వెస్టిగేషన్లో ఈ కేసు చుట్టూ గోల్డ్ దొంగతనం, ఎంఎల్ఏ బ్రదర్ మర్డర్ కనెక్ట్ అవుతాయి. మరోవైపు హేమంత్ తన ట్రైబల్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ దయానంద్ నుంచి తీవ్ర కుల వివక్ష, హ్యూమిలియేషన్ ఎదుర్కొంటాడు. అతడ్ని జంగిల్ వాడు అని అవమానిస్తారు.
Read Also : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?
హేమంత్ ఏఎస్ఐ బల్వంత్, జర్నలిస్ట్ గరిమా సహాయంతో ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తాడు. టౌన్ లో ట్రైబల్ రిచ్యువల్స్, పాలిటికల్ కుట్రలు బయటపడతాయి. కిల్లర్ విక్టిమ్స్‌ని బ్రూటల్‌గా కిల్ చేసి హెడ్ తీసేస్తుంటాడు. సీరియల్ కిల్లర్ మోటివ్ కుల హింస, రివెంజ్, అడవిలో జరిగే అన్యాయాలతో లింక్ అవుతుంది. ఫైనల్ ఎపిసోడ్స్‌లో కిల్లర్ ఎవరో ఒక షాకింగ్ ట్విస్ట్ తో రివీల్ అవుతుంది. అసలు కిల్లర్ ఎవరు ? ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అడవిలో రిచ్యువల్స్ ఎందుకు చేస్తున్నారు ? హేమంత్ కిల్లర్ ని ఎలా కనిపెడతాడు ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.