BEML Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. భారత్ ఎర్త్ మూవర్స్ (బీఈఎంల్) నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. స్టార్టింగ్ వేతనమే రూ.35000 ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారత్ ఎర్త్ మూవర్స్ (బీఈఎంఎల్) నుంచి 100 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నవంబర్ 12న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 100
భారత్ ఎర్త్ మూవర్స్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 29 ఏళ్ల వయస్సు మించరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: నవంబర్ 5
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 12
పోస్టులు – వివరాలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్/ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) : 45 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) : 35 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషణ్/ ఇన్ స్ట్రుమెంటేషన్ (ఆర్ 003): 20 పోస్టులు
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మొదటి ఏడాది రూ.35వేల జీతం, రూ.37,500 జీతం, మూడో ఏడాది రూ.40వేల జీతం, రూ.43వేల జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: bemlindia.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. స్టార్టింగ్ వేతనమే రూ.35 వేలు ఉంటుంది.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 100
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 12