BigTV English
Advertisement

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Beautiful Orange Shark:

సముద్ర జలాల్లో ఎన్నో అద్భుతమైన జీవులు ఉంటాయి. వాటిలో మనకు నీటి చుక్కంత మాత్రమే. ఇప్పటి వరకు చాలా మంది గోల్డెన్ షార్క్ ల గురించి చెప్పడమే తప్ప ఎవరూ చూడలేదు. కానీ, తొలిసారి ఈ అరువైన షార్క్ కనిపించి అందరినీ ఆకట్టుకుంది.  టోర్టుగ్యురో నేషనల్ పార్క్ నుంచి 37 మీటర్ల లోతులో ఈ అరుదైన ఆరెజ్ షార్క్ కనుగొనబడింది. సుమారు రెండు మీటర్ల పొడవులో కనిపించింది. ఈ షార్క్ ను చూడటం ఇదే తొలిసారి.


గోల్డెన్ షార్క్ ను గుర్తించిన డైవర్లు

కోస్టారికాకు చెందిన డైవర్లు ఈ గోల్డెన్ నర్స్ షార్క్ ను గుర్తించారు. సాధారణంగా షార్క్ లు బూడిద, గోధుమ రంగులో కనిపిస్తాయి. కానీ, తొలిసారి ప్రకాశవంతమైన పసుపు.. నారింజ రంగుతో కూడిన షార్క్‌ ను కనుగొన్నారు. టోర్టుగ్యురో నేషనల్ పార్క్ నుండి 37 మీటర్ల లోతులో ఒక స్పోర్ట్స్ ఫిషింగ్ యాత్రలో అరుదైన షార్క్ ను గుర్తించారు. ఈ షార్క్ అరుదైన వర్ణాన్ని కలిగి ఉండటంతో శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఈ షార్క్ జాంటిజం అనే అరుదైన పరిస్థితిని కనబరుస్తున్నట్లు గుర్తించారు. ఈ షార్క్ చర్మం, పొలుసులలో బంగారు వర్ణద్రవ్యాలను అధికంగా ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. కొన్ని చేపలలో జాంటిజంను గుర్తించినప్పటికీ, కరేబియన్ షార్క్ లలో దీనిని ఎప్పుడు గుర్తించలేదు. షార్క్ లో ఈ రకమైన పద్దతిని గుర్తించడంలో ఇదే తొలిసారి. అయితే, ఈ షార్క్ మధ్య వయసును దాటి ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!


ఈ షార్క్  తెల్లటి కళ్ళు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇది అల్బినిజం, క్సాంతోసిస్ అరుదైన కలయిక అయిన అల్బినో-క్సాంతోక్రోమిజమ్‌ ను కూడా చూపించిందని పరిశోధకులు వెల్లడించారు. మెలనిన్ లేకపోవడం వల్ల బంగారు వర్ణద్రవ్యాలు మరింత ఎక్కువగా ప్రకాశించేలా చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి రెండు వర్ణద్రవ్యాలు పసుపు, ఆరెంజ్ ఒకేసారి కనిపించి కనువిందు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read Also: జపాన్ Gen Z.. సె*క్స్ చేయరట, పాతికేళ్లు వచ్చినా ఆ అనుభవానికి దూరం, ఎందుకంటే?

కరేబియన్ దీవుల్లో ఎక్కువ 

ఈ ఆరెంజ్ షార్క్‌ లు ఇప్పటికీ కరేబియన్ దీవుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, ఈ ప్రాంతాల్లో ఎక్కువ చేపలు పట్టడం, వాటి నివావాసాల నాశనం కారణంగా చాలా వరకు అంతరిస్తున్నాయి. అసాధారణ రంగులో కనిపించే తాజాగా షార్క్ జాతులలో జన్యు వైవిధ్యాన్ని నొక్కి చెబుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వాటి ఆవాసాల పరిరక్షణకు ఆయా ప్రభుత్వాలకు కఠిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యల మీద ఆధారపడి వీడి మనుగడ కొనసాగుతుందంటున్నారు. ఈ షార్క్ లకు సంబంధించిన అధ్యయనం గురించి తాజాగా మెరైన్ బయోడైవర్శిటీ జర్నల్‌ లో కొద్ది నెలల క్రితం పబ్లిష్ చేశారు.

Read Also: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Related News

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Big Stories

×