Ajith Open Up on Rivalry With Vijay: ఇండస్ట్రీలో హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కొక్కొ హీరోకి ఒక్క రకమైన ఫ్యాన్ బెస్ ఉంటుంది. అయితే తమ అభిమాన హీరోలను గురించి కాస్తా నెగిటివ్‌గా మాట్లాడిన, ఇతర హీరో ఫ్యాన్స్ తమ హీరో గురించి గొప్పల పోయిన అక్కడ వార్ మొదలైపోతుంది. సోషల్ మీడియా వాడకం పెరిగాక ఈ ఫ్యాన్‌ని తరచూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హీరో ఫ్యాన్ వార్ అనేది ఇండస్ట్రీలో కామన్‌గా మారిపోయింది. ఇది ఒకప్పుడు తమిళంలోనే ఎక్కువ ఉండేదనే విషయం తెలిసిందే. ఎందుకంటే అక్కడ ప్రజలంత ఒక హీరోని ఇష్టపడితే చాలా దైవంతో సమానంగా చూస్తారు.
ఒకప్పుడు కోలివుడ్‌లో ఈ ఫ్యాన్ ఫార్ ఎక్కువ కనిపించేది. ఆ తర్వాత ఇది టాలీవుడ్‌కి కూడా పాకింది. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోలంత మంచి సన్నిహితులుగా ఉంటారు. బావ, అన్న అంటూ సోదర భావంతో ఉంటారు. కానీ, తమిళంలో ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఒక హీరో మరో హీరోని పొగిడిన సందర్భాలు చాలా అరుదు. అదే సమయంలో ఆయా హీరోల మధ్య మనస్పర్థలు, గొడవలు ఉన్నాయంటూ తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. అలా కోలీవుడ్ అగ్ర హీరోలైన విజయ్, అజిత్ ల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉందనేది ఇండస్ట్రీలో టాక్. తరచూ కోలీవుడ్ వీరిద్దరి రిలేషన్‌పై గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాక్సాఫీసు పోటీ పడినప్పుడు కోలీవుడ్‌లో ఇది ఫుల్ హాట్ టాపిక్ అవుతుంది. అప్పుడే ఈ హీరో ఫ్యాన్స్ మధ్య వార్ మామూలుగా ఉండదు.
మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గొప్పలకు పోతుంటారు. అయితే దీనిపై ఎంత చర్చ, రచ్చ జరిగిన విజయ్ కానీ, అజిత్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఈ రూమర్స్ మరింత బలంగా మారాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు తాజాగా విజయ్‌తో ఉన్న వైరంపై అజిత్ పెదవి విప్పాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయనకు దళపతి విజయ్ కరూర్ తొక్కిసలాటపై ప్రశ్న ఎదురైంది. ఈ ఘటనలో కేవలం విజయ్ మాత్రమే బాధ్యుడు కాదని, అందరూ బాధ్యులే అన్నారు. ఎవరిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయని అన్నారు. దీనికి మనందరం కూడా బాధ్యులమేనని పేర్కొన్నారు.
అలాగే విజయ్‌తో ఉన్న వైరంపై స్పందిస్తూ.. తనకు విజయ్‌తో ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. కొందరు మా ఇద్దరి మధ్య అపోహలు సృష్టించారని అన్నారు. “విజయ్ నాకు సోదరుడిలాంటి వాడు. మా ఇద్దరి మధ్య ఎప్పుడు శత్రుత్వం లేదు. కొందరు కావాలని ఈ వార్తలు సృష్టించారు. అవి నిజమని అభిమానులు ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు. ఇలాంటి సమస్యలు సృష్టించేవారంత మౌనంగా ఉంటే బాగుంటుంది. విజయ్‌కి మంచి జరగాలని కోరుకునేవారిలో నేనే ముందుంటాను. ఎప్పటికీ తను బాగుండాలనే కోరుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. అలాగే గతంలోనూ అజిత్ మేనేజర్ ఈ వార్తలను కొట్టిపారేశారు. వారిద్దరు మంచి స్నేహితులని, అజిత్‌కి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు మొదట శుభాకాంక్షలు చెప్పిన వ్యక్తి విజయ్ అని ఈ వార్తలకు చెక్ పెట్టాడు.