E-Paper
Advertisement

ఓడిన‌ప్పుడే మ‌ళ్లీ టీఆరెస్‌గా మార్చుకోమంటే విన్నారా? ఇప్పుడెందుకు పాకులాట‌!?

ఓడిన‌ప్పుడే మ‌ళ్లీ టీఆరెస్‌గా మార్చుకోమంటే విన్నారా? ఇప్పుడెందుకు పాకులాట‌!?
Advertisement

బాపు ఒక్క‌సారి డిసైడ్ అయితే అంతే.. ఎవ‌రి మాట విన‌డు. తెలంగాణ ప‌దం తీసేసి భార‌త్ చేర్చేసి.. జాతీయ పార్టీగా మార్చేసి.. నేల విడిచి సాము చేసిన‌ట్టు.. గ‌ల్లీ వ‌దిలి ఢిల్లీ రాజ‌కీయాలు చేద్దామనుకున్నాడు. బాపు ఏది చెబితే జ‌నం అది క‌రెక్ట‌ని త‌ల‌లూపాలి. అట్ల‌నే ఊపుతారనుకున్నాడు. కానీ క‌ర్రుకాల్చి వాత పెట్టారు. అయినా మార‌లేదు బాపు. వెన‌క్కి త‌గ్గితే ఇజ్జ‌త్ పోత‌ద‌నుకున్న‌డు. అందుకే అదిప్పుడు జాతీయ పార్టీ కాదు.. ప్రాంతీయ పార్టీ కాదు.. మ‌ధ్య‌లో పార్టీ అన్న‌మాట‌. అంతా ముద్దుగా టీఆరెస్ అని పిలుచుకున్నా ఓకే అన్న‌మాట‌!

కానీ రోజులెప్పుడు ఒక్క‌లా ఉండ‌యి క‌దా! మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డ్డ‌ట్టుగా .. క‌విత బ‌య‌టకొచ్చేసింది. పార్టీ పెట్టింది. ఇక్క‌డ జ‌నం ఏది కోల్పోయ‌మ‌నుకున్నారో.. ఏ విష‌యంలో నిర్ల‌క్ష్య‌మ‌య్యారో.. వాటితోనే ఆమె కొత్త పార్టీకి జీవం పోయాల‌నుకున్న‌ది. అందుకే ఆమె టీఆరెస్ పార్టీ పేరుకే ఎస‌రు పెట్టింది. కింద‌కు నీళ్లొచ్చేదాకా తెల్వ‌దు పాపం.. తండ్రీకొడుకుల‌కు.. క‌విత ఇంత‌పెద్ద ఝ‌ల‌క్ ఇస్తుంద‌ని. అందుకే వ‌ద్దు వ‌ద్దు ప్లీజ్ .. అది మా సెంటిమెంట్‌..మ‌మ్మ‌ల్నింకా టీఆరెస్‌గానే పిలుచుకుంటున్నారు. ఏదో బుద్ది గ‌డ్డి తిని ఇట్ల పేరు మార్చుకున్నం గానీ.. అని జ‌నానికి తెల్వ‌కుండా ఆ ఎన్నిక‌ల క‌మిష‌న్ కాళ్లు మొక్కుడు ఒక్క‌టే త‌క్కువ‌.

Advertisement

మ‌రి అదే మోక‌రిల్లుడు జ‌నం ముందు అప్పుడే మొక‌రిల్లి త‌ప్పు చేసినం.. క్ష‌మించండి.. మీ బంచాన్ కాల్మొక్తా! అంటే స‌గం పాపాలు పోవుక‌దా! తెలంగాణ పేరును పార్టీ పేర్ల‌కెళ్లి తీసేసినం.. త‌ప్పైంది.. ఇగో మ‌ళ్లా పేరు మార్సుకుంటున్న‌మ‌ని చెబితే వాళ్లు చ‌ల్ల‌బడు గ‌దా! అవేమీ చేయ‌లే కానీ ప‌బ్లిక్ మీద‌నే అలిగి ఫామ్‌హౌజ్‌ల పండుకున్న‌డు బాపు! చెరువు మీద అలిగితే ఎవ‌ల‌దెండుత‌ది? పేరు మార్చ‌క‌క‌పోతిరి. బుద్ది మార‌క‌పోయె! అహంకార‌మూ వీడ‌క‌పోతిరి.. తోడ‌బుట్టినదాన్నీ త‌రిమేస్తిరి..! అన్నీ త‌ప్పుల మీద త‌ప్పులేనాయె! చెంప‌లైతే ఏసుకోరు. జ‌న‌మే మిమ్మ‌ల్ని ఓడ‌గొడితిమి అయ్యో అని ఏడ‌వాలె.. త‌ప్పైంద‌ని చెంప‌లేసుకోవాలె!

అంత‌లా మిమ్మ‌ల్ని జ‌నం ఆద‌రిస్తుంటే.. మీకోసం ఎదురుచూస్తుంటే.. మ‌ళ్లా బాపే కావాల‌ని క‌ల‌వ‌రిస్తుంటే.. గా పాత టీఆరెస్ పార్టీ మ‌న‌క‌వ‌స‌ర‌మానే రామ‌న్నా! పోతే పోనీ తియ్‌! మ‌నం ఏం పేరు పెట్టుకున్నా.. స‌రే జ‌నం ఓకే అంట‌రు! చెప్పును నిల‌బెట్టినా ఆడ కేసీఆర్ ముఖం చూసి వాళ్ల‌ను గెలిపిస్త‌రు జ‌నం.. మ‌రి మ‌న‌కెందుకు భ‌యం. సార్ ముఖం చూపిచ్చి క‌దా ఓట్ల‌కు పోతం. మ‌న కారు గుర్తు మ‌న‌కే ఉన్న‌ది క‌దా! అదెవ్వ‌రూ గుంజ‌క‌పోలే క‌దా! ఇంకేం భ‌యం లేదు. మ‌న‌మే మ‌ళ్లా వ‌స్తున్నాం.. పెద్ద‌సారు సీఎం అయి.. వెంట‌నే దిగిపోయి.. నిన్ను సీఎం చేసి.. అదే బీఆరెస్ పార్టీ పేరుతో జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పి… ఢిల్లీల కూసుంట‌డు! అప్పుడు ఈ టీఆరెస్ గీఆరెస్‌.. కాంగ్రెస్ గీంగ్రెస్‌..బీజేపీ గీజేపీ అన్నీ త‌లోమూల పోత‌య్‌.. ! చూడు నువ్వు ఇదే జ‌ర‌గ‌బోతుంది…నిజ్జంగా!

Related News

ఫలించిన రేవంత్‌ దౌత్యం! తుమ్మిడిహెట్టి రీ డిజైన్‌తో జఠిల సమస్యను పరిష్కరించే దిశగా..! కేసీఆర్ చేతులెత్తేసిన చోటే..తాను సాధించే దిశగా అడుగులు..!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు వద్దే వద్దు..! అతన్ని చూసి ఇక్కడ ఓట్లేసే సీన్ లేదు..!?

కూటమిలో కుమ్ములాట.. బరిలోకి దిగేదెవరు? ఇంకా క్లారిటీ ఇవ్వని పెద్దలు!

రాజకీయంగా చర్చకు వస్తున్న తెలుగు రాష్ట్రాలు! కరువు భయభ్రాంతులకు గురవుతున్న తెలంగాణ..! హింసాత్మక ఘటనలతో పరువు రచ్చకెక్కిన ఏపీ!

ఒక ఎమ్మెల్సీ సీటు గెలుపే లక్ష్యం.. నల్లగొండపై ఆశలు వదిలేసిన వైనం.. బన్సల్‌ రీ ఎంట్రీతో బీజేపీలో జోష్‌..!

బీజేపీలో ఎమ్మెల్సీ గుబులు.. ఆశావాహుల్లో టెన్షన్ టెన్షన్.. అధిష్టానం సపోర్ట్ ఎవరికి?

కలిసిపోని వామపక్షాలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భిన్న వ్యూహాలు.. ఎవరి దారి వారిదేనా?

కేటీఆర్‌ నోట మళ్లీ థర్ట్‌ ఫ్రంట్‌ మాట..! నాన్న కోసం నేషనల్‌ రాజకీయాలు ఎదురుచూస్తున్నాయట..! మళ్లీ చక్రంతిప్పనున్నారట!

Big Stories

Advertisement
×