బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Advertisement

స్విచ్ బోర్డులు వేడెక్కుతున్నాయా? షార్ట్ సర్క్యూట్ ప్రమాద సంకేతాలు ఇవే!

స్విచ్ బోర్డులు వేడెక్కుతున్నాయా? షార్ట్ సర్క్యూట్ ప్రమాద సంకేతాలు ఇవే!

Short circuit warning signs: నిత్యజీవితంలో కరెంట్ చాలా ముఖ్యం. టీవీ, ఫ్రిజ్, ఏసీ, గీజర్.. ఇలా ప్రతిదానికీ కరెంట్ కావాల్సిందే. అయితే.. ప్రాణాలు ఇచ్చే ఈ కరెంటే ఒక్కోసారి ప్రాణాలు తీసే పెద్ద విపత్తుగా మారుతుంది. దానికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్. చాలా ఇళ్లలో కాలిపోయే హోమ్ అప్లయన్సెస్ లేదా పెద్ద పెద్ద అగ్నిప్రమాదాల వెనక ఈ షార్ట్ సర్క్యూట్ హస్తమే ఉంటుంది. అయితే.. ఈ ప్రమాదం ఒక్కసారిగా రాదు.. రాబోయే ముందు మనకు కొన్ని చిన్న చిన్న క్లూస్ ఇస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి డేంజర్ పొంచి ఉందో లేదో ముందే పసిగట్టే సిగ్నల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఉందని చెప్పే 5 సంకేతాలు:

1. స్విచ్ బోర్డుల నుంచి వచ్చే వాసన:
మీరు ఎప్పుడైనా స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్లినప్పుడు ప్లాస్టిక్ లేదా వైర్లు కాలుతున్నట్టు బ్యాడ్ స్మెల్ వచ్చిందా? అయితే దాన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. వైర్ల లోపల విపరీతమైన హీట్ జనరేట్ అయ్యి, ప్లాస్టిక్ కరుగుతోందని దానికి అర్థం. ఇది షార్ట్ సర్క్యూట్‌కు మొదటి, అత్యంత ప్రమాదకరమైన సంకేతం.

2. లైట్లు పదే పదే మినుకుమినుకుమనడం:
ఇంట్లో లైట్లు అప్పుడప్పుడు డిమ్ అవ్వడం లేదా పదే పదే బ్లింక్ అవుతుంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని అర్థం. వైరింగ్ లూజ్ అయినా లేదా లోపల ఒక వైరు ఇంకో వైరుకు టచ్ అవుతున్నా ఇలా జరుగుతుంది. ఇది హోమ్ అప్లయన్సెస్‌ను పూర్తిగా పాడు చేస్తుంది.

3. ఎంసీబీ తరచూ ట్రిప్ అవ్వడం:
మీ ఇంట్లోని మెయిన్ బోర్డులో ఉండే MCB (Miniature Circuit Breaker) పదే పదే కిందకి పడిపోతోందా? అయితే మీ ఇంట్లో ఎలక్ట్రికల్ లోడ్ ఎక్కువైందని లేదా ఎక్కడో ఒకచోట వైర్లు షార్ట్ అవుతున్నాయని అర్థం. ఎంసీబీ పదే పదే పడిపోవడం అనేది మీ ఇల్లు పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పుకుంటోందని చెప్పే హెచ్చరిక.

4. స్విచ్‌లు లేదా ప్లగ్ పాయింట్లు నల్లగా మారడం:
ప్లగ్ పాయింట్ల చుట్టూ లేదా స్విచ్‌ల వద్ద నల్లటి మచ్చలు కనిపించినా.. లేదా ప్లగ్ పెడుతున్నప్పుడు చిన్నగా స్పార్క్స్ (నిప్పురవ్వలు) వస్తున్నా వెంటనే అలర్ట్ అవ్వాలి. లోపల కనెక్షన్లు లూజ్ అవ్వడం వల్లే ఇలాంటి స్పార్క్స్ వస్తాయి. ఇవి ఏ క్షణంలోనైనా పెద్ద మంటలుగా మారే ఛాన్స్ ఉంది.

5. స్విచ్ బోర్డులు వేడెక్కడం:
నార్మల్‌గా స్విచ్‌లు ముట్టుకుంటే చల్లగా ఉండాలి. కానీ.. ఇంట్లో ఏదైనా స్విచ్ లేదా సాకెట్ బోర్డు వేడిగా అనిపిస్తే.. లోపల కరెంట్ ఫ్లో సరిగ్గా లేదని, రెసిస్టెన్స్ ఎక్కువై హీట్ జనరేట్ అవుతోందని అర్థం.

ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
క్వాలిటీ వైరింగ్: ఎప్పుడైనా సరే ఇంట్లో ఐఎస్‌ఐ (ISI) మార్క్ ఉన్న బ్రాండెడ్ కాపర్ వైర్లను మాత్రమే వాడండి.

ఓవర్‌లోడ్ వద్దు: ఒకే సాకెట్ బోర్డులో మల్టీ-ప్లగ్స్ పెట్టి ఏసీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి హై-లోడ్ వస్తువులను ఒకేసారి రన్ చేయకండి.

ఎలక్ట్రీషియన్ వెరిఫికేషన్: కనీసం ఐదు లేదా పదేళ్లకు ఒకసారి మీ ఇంటి మొత్తం వైరింగ్‌ను ఒక మంచి ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్‌తో చెక్ చేయించడం చాలా మంచిది.

 

Related News

Wi-Fi లేకుండానే వాడేసుకోవచ్చా? శాంసంగ్ సరికొత్త 5G రగ్గడ్ ట్యాబ్ ప్రత్యేకతలివే!

ఫొటో తీశాక కూడా బ్యాక్‌గ్రౌండ్‌ మార్చేయొచ్చు.. Apple Intelligence సరికొత్త మ్యాజిక్ అదే మరి!

గంటలు గడుస్తున్నా ఫోన్ ఛార్జ్ అవ్వట్లేదా? ఈ చిన్న ట్రిక్‌తో.. రాకెట్‌లా దూసుకెళ్తుంది!

Smart Gadgets: ఇల్లు మీది.. పని వాటిది.. మీ శ్రమను తగ్గించే 5 స్మార్ట్ గ్యాడ్జెట్స్!

మీ ఇల్లు సేఫ్‌గా.. ఉండాలంటే ఈ పనులు మానేయండి!

రోడ్డు పక్కన దొరికే లోకల్ ఛార్జర్లు వాడుతున్నారా? మీ ఫోన్ పాడవడం గ్యారంటీ

Samsung Galaxy A27లో బిగ్ ట్విస్ట్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 50MP కెమెరాతో సాలిడ్ అప్‌గ్రేడ్స్!

×