E-Paper
Advertisement

మీ ఇంటికొస్త‌..! మైకిచ్చుకు మాట్లాడ‌తా! ఇంతోటి దానికి ఇంటి దాకా ఎందుకు నాయ‌నా?

మీ ఇంటికొస్త‌..! మైకిచ్చుకు మాట్లాడ‌తా! ఇంతోటి దానికి ఇంటి దాకా ఎందుకు నాయ‌నా?
Advertisement

ర‌ఘునంద‌ర్‌రావు నోటిదూల కాక‌పోతే మ‌రేంటి! క‌విత విమ‌ర్శించారు. ఆ విమ‌ర్శ‌ల‌ను ఖండించాలి. వివ‌ర‌ణ ఇవ్వాలి. త‌న‌కు తాను పెద్ద‌గా ఊహించుకున్న‌ట్టు మాట్లాడుకోవ‌డం .. చూసిన వారికి సంకుచితంగానే అనిపిస్తుంది. సేమ్… అట్ల‌నే చేశాడు ర‌ఘునంద‌న్‌. క‌విత‌పై నోరు జారాడు. బాల‌య్య సినిమాలో డైలాగులా.. నీ ఇంటికొస్తా.. నీ న‌ట్టింటికొస్తా.. రా చూసుకుందాం.. నీ ప్ర‌తాప‌మో.. నా ప్ర‌తాప‌మో..! అన్న లెవ‌ల్లో బిల్డ‌ప్ ఇచ్చాడు. ఎవ‌రిమీద‌న‌యా ఇంత బిల్డ‌ప్పు అంటే.. కవిత మీద. ఓ ఆడ‌బిడ్డ మీద‌. మ‌హిళా నాయ‌కురాలి మీద‌.

ఏమ‌న్నాడు? ఈసారి త‌న పేరు తీసుకున్నా.. విమ‌ర్శించినా ఖ‌త‌మేన‌ట‌..! ఇంటికొచ్చేస్తాడ‌ట‌. వ‌చ్చి ఏం చేస్తాడ‌ట‌? ఇంటి ముందు మైకు ప‌ట్టుకుని ఎడాపెడా తిడ‌తాడ‌ట‌. దీని కోసం ఇంటి దాకా వ‌చ్చుడెందుకు? మ‌ళ్లీ మైకు చేత‌బుచ్చుకుని మాట్లాడుడెందుకు? ఏడుంటే ఆడ‌నే ఓ ప్రెస్‌మీట్ పెట్టుకోవ‌చ్చ క‌దా! హుందాగా వివ‌ర‌ణివ్వు. స‌బ్జెక్టున్నోళ్లెవ‌రైనా హుందాగానే స‌మాధాన‌మిస్తారు.

Advertisement

అదీ ఓ మ‌హిళా నాయ‌కురాలు విమ‌ర్శించిన‌ప్పుడు మ‌రింత విచ‌క్ష‌ణ ప్ర‌ద‌ర్శించాలె ర‌ఘు భాయ్‌! ఓ వైపు సీఎం రేవంతు.. బీజేపీ ఎంపీల‌ను ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా తుక్కు తుక్కు పొట్టు పొట్టు తిడుతున్నాడు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన మీకు మ‌ళ్లీ పుట్ట‌గ‌తులుండ‌య‌ని శ‌పిస్తున్నాడు. ఒక్క‌డంటే ఒక్క‌డు కూడా గెల్వ‌డ‌ని తీర్మానించేస్తున్నాడు. ఈట‌ల రాజేంద‌ర్‌, బండి సంజ‌య్ ఉదంతంలో వ‌ర్గ‌పోరు బ‌జారుకెక్కి కొట్టుకుంటున్నారు. ఇన్ని బాధ‌లు పెట్టుకుని, పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంటే.. దాన్ని కాపాడే ప్ర‌య‌త్న‌మేదీ చేయ‌క‌పోగా.. తీరుబ‌డిగా న‌న్నెవ‌రు తిట్టారు..? ఏమ‌ని తిట్టారు? క‌విత‌నా అయితే ఒంటికాలు మీద లేద్దాం! అని ఆవేశానికి లోన‌యితే ఎట్లా!? కొంచెం కంట్రోల్ ఉండాలెగా బాసూ!

పెద్ద‌వాళ్ల పేర్లు తీసి విమ‌ర్శిస్తే.. పెద్ద‌వాళ్ల‌మైపోతామ‌నే భ్ర‌మ‌లో క‌విత ఉన్నార‌ని కూడా అన్నాడాయ‌న‌. ఇంటికొస్తా! ఇంటి ముందు నిల‌బ‌డ‌తా..! మైకులో నిల‌దీస్తా! ఇలాంటి చీప్ మాట‌లు మాట్లాడే నేత‌ల‌ను పెద్ద నేత‌ల‌నే అంటారా? ఇక్క‌డ ర‌ఘునంద‌ర్‌రావు మాటల్లోనే కాంట్రాస్టు ఉంది. ఆమె ప‌చ్చి బూతులేమీ అన‌లేదే? కుటుంబ స‌భ్యుల ప్ర‌స్తావ‌నేమీ తీయ‌లేదే..? మ‌రెందుకు? రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను .. రాజ‌కీయంగా తిప్పికొడితే స‌రి!

Advertisement

ఇలా ఎంత‌మంది ఇళ్ల‌కు పోత‌వు రోజు! మ‌గ రాజ‌కీయ నాయ‌కులైతే గేటు దుంకి గ‌ల్లా పట్టుకుని కొట్టిన త‌రువాత గానీ వివ‌ర‌ణ ఇచ్చేలా లేవే….! అని కూడా అనుకుంటున్నారు. స‌రే, స‌రే ఒప్పుకుంటాం! మీరు కూడా పెద్ద నాయ‌కులే. కానీ అప్పుడ‌ప్పుడు ఇలా కంట్రోల్ త‌ప్పి ఇలా చిన్న‌గా మాట్లాడి అల్ప‌త్వం చాటుకుంటారంతే! అదే న‌చ్చ‌లేదు భ‌య్యా!

Related News

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!

ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!

దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

Big Stories

Advertisement
×