E-Paper
Advertisement

ఇథనాల్‌ ఫ్యూయల్ వద్దట.. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!

ఇథనాల్‌ ఫ్యూయల్ వద్దట.. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి!
Advertisement

దేశంలో పెట్రోల్‌ లో ఇథనాల్ మిశ్రమాన్ని క్రమంగా పెంచుతున్న ప్రభుత్వం, భవిష్యత్తులో E20 కంటే ఎక్కువ స్థాయిలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ దిశగా కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే తాజాగా న్యూఢిల్లీలో E85 ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలో పలు ప్రముఖ నగరాల్లో ఈ ఫ్యూయెల్ ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతోంది. అయితే, ఈ నిర్ణయంపై వాహనదారుల్లో పెద్ద ఎత్తున సందేహాలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ పోల్ లో ఇదే విషయం వెల్లడైంది.

ఇథనాల్ ఫ్యూయల్ పై ఆందోళన

తాజాగా ఓ ఆటో వెబ్ సైట్ ఇథనాల్ ఇంధనానికి సంబంధించి సర్వే నిర్వహించింది. 3,450 మందికి పైగా పాల్గొన్న ఈ సర్వేలో, E20 కంటే ఎక్కువ ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ ను ప్రవేశపెట్టడంపై ఎక్కువ మంది వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాహనాల పనితీరు, ఇంజిన్ దీర్ఘకాలిక స్థితి, మైలేజీ తగ్గుదల లాంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

సర్వేలో ఏం తేలిందంటే?

Advertisement

పోల్‌ లో పాల్గొన్న వారిలో 47.5 శాతం మంది తమ వాహనాలకు నష్టం జరిగే అవకాశం ఉందని భావించారు. ఇథనాల్ గాలిలోని తేమను ఆకర్షించే లక్షణం కలిగి ఉండటంతో, ఇంధన వ్యవస్థలోని కొన్ని భాగాలపై దీర్ఘకాలంలో ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాత E10 వాహనాల యజమానులు ఈ విషయంలో ఎక్కువ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక 23 శాతం మంది ఇంధన సామర్థ్యం తగ్గిపోతుందనే కారణంతో ఇథనాల్ మిశ్రమం పెంపును వ్యతిరేకించారు. ఇథనాల్‌ లో పెట్రోల్‌ తో పోలిస్తే శక్తి సాంద్రత తక్కువగా ఉండటంతో, వాహనం మైలేజీ కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే E20 ఇంధనంతో కొన్ని వాహనాల్లో మైలేజీ తగ్గినట్లు పరీక్షల్లో గుర్తించబడింది. దీంతో మిశ్రమం మరింత పెరిగితే వినియోగదారుల ఖర్చు కూడా పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

Advertisement

మరో 15.21 శాతం మంది మాత్రం ఓ కండీషన్ తో సపోర్టు చేశారు. E20 కంటే ఎక్కువ ఇథనాల్ కలిగిన పెట్రోల్ ధర తక్కువగా ఉంటే మాత్రమే తాము దానిని ఉపయోగించేందుకు సిద్ధమని చెప్పారు. ప్రస్తుతం ఇంధన ధరలు అధికంగా ఉండటంతో, ధరల పరంగా ప్రయోజనం ఉంటేనే ఈ మార్పును అంగీకరించగలమని వారు భావిస్తున్నారు.

సపోర్టు చేసిన 11.5 శాతం మంది!

అయితే, కొంతమంది ఇథనాల్ ఫ్యూయల్ కు మద్దతు ఇచ్చారు. సుమారు 11.5 శాతం మంది, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల విదేశీ ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందన్నారు. దేశంలోనే ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌ ను ఎక్కువగా వినియోగించడం వల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో 2.7 శాతం మంది పర్యావరణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం పెరగడం వల్ల వాహనాల నుంచి వెలువడే కొన్ని కాలుష్యకారక ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. మొత్తంగా సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతానికి పైగా ప్రజలు E20 కంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే, ఎక్కువ ఇథనాల్ ఫ్యూయల్ పై ప్రజల్లో పలు సందేహాలు ఉన్నట్లు ఈ పోల్ స్పష్టం చేసింది.

Read Also: బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? EV కొనుగోలుదారులకు లాభమా? నష్టమా?

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×