E-Paper
Advertisement

అటు చెల్లి.. ఇటు లొల్లి.. జగన్ దారి ఎటు?

అటు చెల్లి.. ఇటు లొల్లి.. జగన్ దారి ఎటు?
Advertisement

ఢిల్లీతో జగన్‌ సంబంధాలు కొంతకాలం సాఫీగానే సాగాయి. కానీ, చంద్రబాబు జోక్యంతో జగన్‌-మోడీ మధ్య గ్యాప్‌ పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. జగన్‌పై ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని కేంద్రానికి చంద్రబాబు సూచించారని, ఆ తర్వాత ఈడీ దూకుడు పెరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో ఇప్పటివరకు మౌనంగా ఉన్న జగన్‌ కూడా స్వరం పెంచారు. సీఈసీ నియామకంలో కేంద్ర నిర్ణయాన్ని సమర్థించడం తమ బ్లండర్‌ మిస్టేక్‌ అని, మోడీని గుడ్డిగా అనుసరించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

మోడిపై ఎదురుదాడితో క్లారిటీ..

ఇప్పటివరకు ఎన్డీయేతో పరోక్ష సాన్నిహిత్యాన్ని కొనసాగించిన జగన్‌.. ఇప్పుడు మోడీపై ఎదురుదాడికి దిగడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. చంద్రబాబు సూచనలతో మోడీ తనపై ఈడీని ఉసిగొల్పారన్న భావనతోనే జగన్‌ వైఖరిలో మార్పు వచ్చిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సీఈసీ నియామకంలో ప్రతిపక్ష నేత, సీజేఐలకు పాత్ర ఉండాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. అధికార పార్టీకే పూర్తి ఆధిపత్యం ఉండే విధానం సరికాదన్నారు. ఓటు చోరీ, ఎన్నికల వ్యవస్థపై జగన్‌ వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి.

ఏ గట్టునుంటాడో..

Advertisement

అయితే, జగన్‌ పూర్తిగా ఏ గట్టున నిలబడతారన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎన్డీయేతో దూరం పెరుగుతున్నా.. ఇండీ కూటమికి కూడా ఆయన అధికారికంగా దగ్గర కాలేదు. ఇటీవల సీపీఐ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించినా జగన్‌ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. షర్మిల కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉండటం, సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. 8 ఛైర్‌పర్సన్లు కూటమి ఏకగ్రీవం! కూలిన దశాబ్దాల నాటి కంచుకోటలు

ఎన్డీయేతో గ్యాప్ పెరిగితే.. ఇండీ కూటమే దిక్కు..

Advertisement

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ జగన్‌ ఒక స్పష్టమైన రాజకీయ వైఖరి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్డీయేతో గ్యాప్‌ మరింత పెరిగి, ఇండీ కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడితే.. స్థానిక రాజకీయాలను పక్కనపెట్టి జాతీయ స్థాయిలో తన ప్రాధాన్యతను పెంచుకునేందుకు ఇండీ కూటమికి దగ్గరయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Tags

Related News

జగన్ హామీతోనే.. అంబటి ఆ వ్యాఖ్యలు? రివేంజ్ ప్లాన్ సిద్ధం!

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉచిత చేపపిల్లల పంపిణీకి కొత్త కష్టాలు.. చనిపోలాల్సిందేనా..?

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

Big Stories

Advertisement
×