Virender Sehwag On Daren Sammy: వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన వన్డే టీ20 సిరీస్ ల నేపథ్యంలో బీసీసీఐకి అత్యధిక ఆదాయం వచ్చిందని విషం కక్కిన డారెన్ సామీపై (Darren Sammy ) వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag ) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ సిటిజన్ షిప్ (Pakistani citizenship) కలిగిన డారెన్ సామీ లాంటి కుక్కలను ఇండియా నుంచి తరిమికొట్టాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాళ్లను ఇండియాకు మళ్ళీ రానివ్వకుండా బీసీసీఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే బీసీసీఐపై తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా ఉంటారని వ్యాఖ్యానించారు. లేకపోతే ఇండియాపై అంతర్జాతీయ వేదికలలో విషం కక్కే ప్రమాదం ఉందని… అలాంటి కుక్కలను ముందు జాగ్రత్తతో తరిమికొట్టాల్సిందేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో డారిన సామీపై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మధ్య వన్డే టి20 సిరీస్ పూర్తయిన సందర్భంగా బీసీసీఐపై డారెన్ సామీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పర్యటన నేపథ్యంలో బిసిసిఐకి 280 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని బాంబు పేల్చాడు. కానీ ఇందులో ఒక్క రూపాయి కూడా తమకు ఇవ్వలేదని ఆగ్రహించారు. ఐసీసీ అమలు చేస్తున్న రూల్స్ వల్ల తమ క్రికెట్ బోర్డు నష్టపోయిందని వ్యాఖ్యానించారు. తమకు ఆర్థిక సహాయం చేయాల్సిందేనని డారెన్ సామీ కారు కూతలు కూశాడు. అయితే డారెన్ సామీ ఈ కామెంట్స్ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ కు కోపం వచ్చింది. అందుకే పాకిస్తాన్ కుక్కలను తరిమికొట్టాలని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్లను నేపథ్యంలో వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి పాకిస్తాన్ పౌరసత్వం నిజంగానే ఉందా ? అనే చర్చ మొదలైంది. అయితే అతనికి పాకిస్తాన్ గౌరవ పౌరసత్వం అందించింది కానీ, శాశ్వత పౌరసత్వం ఇవ్వలేదు. అతడు ఇప్పటికీ సెయింట్ లూసియా దేశానికి సంబంధించిన పౌరుడుగానే ఉన్నాడు. 2009 సంవత్సరంలో శ్రీలంక జట్టుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఏ ఒక్క క్రికెటర్ ముందుకు రాలేదు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు డారెన్ సామీ సాహసం చేశాడు. అందరినీ ఎంకరేజ్ చేసి, పాకిస్తాన్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. దానికి గుర్తుగా 2020లో సామీకి నిషాన్ ఏ పాకిస్తాన్ అనే గౌరవ పౌరసత్వాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం అందించింది. అయితే, దీని ద్వారా ఓటు హక్కులు, పాకిస్తాన్ లో ఆస్తులు కొనే హక్కులు ఉండవు. ఇది కేవలం గౌరవ సూచిక మాత్రమే.