E-Paper
Advertisement

జీహెచ్‌ఎంసీ సమరానికి ‘రక్షణసేన’ సై.. 300 డివిజన్లలో పోటీకి కవిత ప్లాన్!

జీహెచ్‌ఎంసీ సమరానికి ‘రక్షణసేన’ సై.. 300 డివిజన్లలో పోటీకి కవిత ప్లాన్!
Advertisement

Telangana Rakshana Sena: తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ రక్షణసేన.. మహానగర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. మూడు కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 300 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దించి, పట్టణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘రాజధాని రణభేరి’ సభకు శ్రీకారం చుడుతోంది.

గ్రేటర్‌ పరిధిలో పట్టు కోసం..

హైదరాబాద్‌ మహానగరం రాజకీయంగా, ఆర్థికంగా కీలక కేంద్రం కావడంతో ఇక్కడ పట్టు సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి గుర్తింపు పెరుగుతుందని రక్షణసేన నాయకత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీతోపాటు కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లను ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు సమాచారం. మూడు కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్లలో పోటీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను బలోపేతం చేసుకోవడంతోపాటు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, ఐటీ కారిడార్‌, శివారు ప్రాంతాలు, తూర్పు హైదరాబాద్‌ పరిధిలోనూ రాజకీయంగా పట్టు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అన్ని డివిజన్లలో పోటీకి సంబంధించి తుది నిర్ణయం, అభ్యర్థుల ఎంపిక విధానం, ఎన్నికల కార్యాచరణపై త్వరలో రానున్న నోటిఫికేషన్ తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.

సత్తా చాటడమే ధ్యేయం

Advertisement

కొత్త రాజకీయ శక్తిగా ప్రజల్లోకి వెళ్లాలనుకునే పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు కీలక పరీక్షగా నిలుస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిధిలోని కార్పొరేషన్ల ఎన్నికల్లో సాధించే ఫలితాలు పార్టీ భవిష్యత్‌ రాజకీయ ప్రస్థానంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కేవలం అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా, ప్రజా సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకొని ఓటర్లకు చేరువ కావాల్సిన అవసరాన్ని రక్షణసేన నాయకత్వం గుర్తించినట్లు తెలుస్తోంది.తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, ట్రాఫిక్‌, పట్టణ మౌలిక వసతులు, శివారు ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ఆయా సమస్యలపై పార్టీ ఏ విధమైన కార్యాచరణను ప్రకటిస్తుంది? స్థానిక ప్రజల సమస్యలను ఎన్నికల ఎజెండాగా ఎలా మలుచుకుంటుంది? అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయంగా తనను తాను ఎలా నిలబెట్టుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు?

మూడు కార్పొరేషన్ల పరిధిలో 300 డివిజన్లకు అభ్యర్థులను ఎంపిక చేయడం పార్టీకి కీలకమైన అంశం కానుంది. స్థానికంగా ప్రజలతో సంబంధాలు ఉన్నవారు, సమస్యలపై పోరాడినవారు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నవారికి ప్రాధాన్యం ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు అవకాశం కల్పిస్తారా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. డివిజన్‌ స్థాయిలో బలమైన అభ్యర్థులను గుర్తించడం, ప్రచార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, ఓటర్లతో నిరంతర సంబంధాలు కొనసాగించడం వంటి అంశాలపైనే ఎన్నికల ఫలితాలు ఆధారపడనున్నాయి.‘రాజధాని రణభేరి’ వేదికగా కవిత ఈ అంశాలపై పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారా? మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తారా? పోటీ చేసే డివిజన్లపై ప్రాథమిక కసరత్తును ప్రారంభిస్తారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజకీయంగా కీలక అడుగు

Advertisement

మూడు కార్పొరేషన్ల ఎన్నికలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా హైదరాబాద్‌ రాజకీయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని రక్షణసేన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించాలంటే బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం, విశ్వసనీయమైన అభ్యర్థులు, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం అవసరం. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘రాజధాని రణభేరి’ కార్యక్రమం పార్టీ భవిష్యత్‌ ఎన్నికల వ్యూహానికి దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తుందా? మూడు కార్పొరేషన్లలో రక్షణసేన ఎంతవరకు ప్రభావం చూపగలదు? అన్నది చూడాలి.

Also Read: Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలుస్తుందా..? కమల్ లైఫ్ లోకి కొత్త అమ్మాయి.. అసలు ట్విస్ట్ ఇదే..

కవిత ‘రాజధాని రణభేరి’

మరోవైపు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక సభను శుక్రవారం మియాపూర్ నరేన్ గార్డెన్స్ వేదికగా నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటలకు రాజధాని రణభేరి సభ నిర్వహిస్తున్నారు. మూడు కార్పొరేషన్ల నుంచి తరలివచ్చే ముఖ్య నాయకులకు బల్దియా ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర రాజధానిలో సత్తా చాటడమే ధ్యేయంగా కవిత రాజకీయ వ్యూహ రచన చేయనున్నారు. మూడు కార్పొరేషన్లు, 300 డివిజన్ లలో అభ్యర్థులకు బరిలోకి దింపడంతో పాటు.. ఎన్నికల ఎజెండాపై కవిత స్పష్టత ఇచ్చే అవకాశంఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని శ్రేణులకు పిలుపునివ్వబోతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Also Read: తెలంగాణపై ‘కమలం పాచిక’.. అగ్రనేతల క్యూ.. బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?

Tags

Related News

తెలంగాణపై ‘కమలం పాచిక’.. అగ్రనేతల క్యూ.. బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?

జగన్ హామీతోనే.. అంబటి ఆ వ్యాఖ్యలు? రివేంజ్ ప్లాన్ సిద్ధం!

అటు చెల్లి.. ఇటు లొల్లి.. జగన్ దారి ఎటు?

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

Big Stories

Advertisement
×