E-Paper
Advertisement

తెలంగాణపై ‘కమలం పాచిక’.. అగ్రనేతల క్యూ.. బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?

తెలంగాణపై ‘కమలం పాచిక’.. అగ్రనేతల క్యూ.. బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?
Advertisement

BJP Telangana: తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేయడం, రాబోయే ఎన్నికల నాటికి పటిష్ఠమైన రాజకీయ శక్తిగా ఎదగడం లక్ష్యంగా అగ్రనేతల పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే నెలలో తెలంగాణకు వచ్చే అవకాశాలపై చర్చ జరుగుతుండగా.. డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు కూడా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో రాజకీయంగా మరింత పట్టు సాధించాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కీలకమని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో భారీ సమ్మేళనం నిర్వహించే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమిత్ షా వస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బూత్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతోపాటు.. ప్రజల్లోకి వెళ్లాల్సిన రాజకీయ అంశాలపై స్పష్టత ఇచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం.

Advertisement

గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలను విశ్లేషించుకోవడం, పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలకు ఈ సమ్మేళనంలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. కేవలం బహిరంగ సభలకే పరిమితం కాకుండా ప్రతి బూత్‌లో పార్టీకి పటిష్ఠమైన పునాది నిర్మించుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్‌లో ఆయన రాష్ట్రానికి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ పర్యటనకు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాన ఎజెండాగా చేసుకోవడంతోపాటు.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేలా రాజకీయ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని పర్యటన ఖరారైతే రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ప్రచారానికి మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది.

అటు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్ మామునూరు విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. వరంగల్ ప్రాంత ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ విమానాశ్రయ ప్రాజెక్టు ముందుకు సాగుతుండటంతో.. దానిని రాజకీయంగానూ కీలకంగా మలుచుకోవాలని బీజేపీ భావించే అవకాశం ఉంది. మామునూరు విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ, అనుమతులు, నిర్మాణ ప్రక్రియపై ఇటీవలి కాలంలో పురోగతి కనిపించింది. విమానాశ్రయ నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కావడం, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన చర్యలు వేగవంతం కావడం ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెంచాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో శంకుస్థాపన జరిగితే, ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అంశం ప్రాధాన్యం సంతరించుకోనుంది.

Advertisement

విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమంతోపాటు వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచన కూడా బీజేపీ చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ బలాన్ని చాటుకోవడానికి వరంగల్‌ను కీలక వేదికగా ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని పర్యటన ఖరారైతే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమీకరించి, భారీ జనసమీకరణతో సభ నిర్వహించాలనే దిశగా కసరత్తు జరిగే అవకాశముంది. వరంగల్, హనుమకొండతోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి కార్యకర్తలను సమీకరించడం ద్వారా సభను విజయవంతం చేయాలని భావించే అవకాశం ఉంది.

Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode October 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పార్థు బతికే ఉన్నాడా..?  వైజయంతి మాటల్లో నిజమెంత..?  

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీఆర్ఎస్ కూడా తన రాజకీయ పునరుద్ధరణకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్న బీజేపీకి సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, కేంద్ర నాయకత్వం పర్యటనలు కీలకం కానున్నాయి. అగ్రనేతల వరుస పర్యటనలు ఖరారైతే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తన ఉనికిని మరింత బలంగా చాటుకునేందుకు వేదికగా ఈ అవకాశాన్ని మలుచుకోవాలని చూస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.

Also Read: 90 ఏళ్లకోసారి వచ్చే ఫెస్టివల్… పండగకు పిలిచి పాతిపెట్టే ప్లాన్… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్

Tags

Related News

జీహెచ్‌ఎంసీ సమరానికి ‘రక్షణసేన’ సై.. 300 డివిజన్లలో పోటీకి కవిత ప్లాన్!

జగన్ హామీతోనే.. అంబటి ఆ వ్యాఖ్యలు? రివేంజ్ ప్లాన్ సిద్ధం!

అటు చెల్లి.. ఇటు లొల్లి.. జగన్ దారి ఎటు?

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

Big Stories

Advertisement
×