చూసిరారా అంటే కాల్చొచ్చిడంట! అచ్చం అట్లనే ఉంది కేటీఆర్ చేసిన పని. లేక లేక ఒక్కడినే సభ పెట్టుకుని రా అని కేసీఆర్ పంపిండు. వరంగల్ రైతు సభ పేరుతో. ఇక కేసీఆర్ రాడు.. నేనే అన్నీ.. చివరకు సీఎం సీటు కూడా నాదే.. అనే రేంజ్‌లో ఈ వేదికను వాడుకోవాలని అందరి ఆలోచన. ఆశ. సీనియర్లకు అప్పటికే ఎన్నో అనుమానాలు. కానీ పెద్దసారు చెప్పిన మాట కాదనరాయె. భయం భయంగా అన్నీ ప్లాను చేసుకునే, స్క్రిప్టు రాసుకుని, వెనుక స్క్రీను.. స్క్రీన్ ప్లే అంతా రెడీ అయ్యింది.
ఫామ్‌హౌజ్ నుంచి కేసీఆర్ డైరెక్షన్. హీరో కేటీఆర్. అప్పటి వరకు జరిగిన మీటింగులలో కొంచెం ఓవర్‌గానే మాట్లాడటం అలవాటు. కానీ దీన్ని కేసీఆర్ మీటింగుగా ఊహించుకుంటారు కాబట్టి.. ఆ రేంజ్‌లో జనం ఫీలవ్వాలి… ఇదీ కాన్సెప్ట్. కానీ అలవాటులో పొరపాటులా కేటీఆర్ అగ్గిపెట్టేశాడు. అంత జనం మధ్య ఎప్పుడూ మాట్లాడలేదేమో పాపం.. మరీ ఓవరయ్యాడు. నోటికి అదుపు లేకుండా పోయింది. కంట్రోల్ తప్పాడు. స్పీచు మధ్య మధ్యన తప్పుటడుగులు వేస్తున్నది. తిట్లు దారాళంగా వచ్చేస్తున్నాయి. అరేయ్.. రారా.. హౌలే… కుక్క. అల్పుడు, నీచుడు…. అదేదో సినిమాలో డైలాగులా.. నీచ్, కమీన్, కుత్తే.. ! అని వీరావేశానికి లోనయ్యాడు. ఊర్లళ్లకు రానీయ్యకుర్రి.. కొట్టుర్రి, సంపుర్రి.. అనేకాడికి వచ్చింది పైత్యపు ప్రసంగం. అప్పటికే పక్కనే ఉండి నిఘా వేస్తూ బిక్కు బిక్కు మంటూ అబ్జర్వ్ చేస్తున్న సీనియార్ల గుండె కడుపులోకి జారింది.
అయ్యో… సారొకటి చెబితే.. చిన్నదొరకటి చెయ్యవట్టే.. దొబ్బులు తప్పవా? అని రంగులు మారుతున్న ముఖాలపై బలవంతంగా నవ్వులు పులుముకుని.. భేష్.. భేష్.. శభాష్..కొట్టండిరా చప్పట్లు.. వెయ్యండిరా దండలు.. అని కోరస్ పాడారు. ఇలా కేటీఆర్ సభ ముగిసిందో లేదో.. కాంగ్రెసోళ్లు లైన్ కట్టారు. తిట్ల పురాణం అందుకున్నారు. అరే బోస్ డీకే… నీకు థర్డ్ డిగ్రీ చూపిస్తం.. నీ చెల్లెనే నిన్ను హవ్లా గాడంటుంది.. సిగ్గులేదు.. అని మొదలు పెట్టారు. ఇది ఎక్కడిదాకా పోయిందంటే.. నువ్వు కేసీఆర్‌కే పుట్టావా కేటీఆర్..అయితే మా సవాల్ స్వీకరించు.. మీ ఆఫీసుకొస్తాం… తెలంగాణ భవన్‌కొస్తాం.. మేము చాలు.. సీఎం కాదు.. మేమే మీకు ఎక్కువ…. ఇగ మొదలు పెట్టారు.
నువ్వు తిట్టిన తిట్లే ఇక ఇనసొంపుగా రోజూ నీకు వినిపిస్తాం. ఇదే నా పిలుపు… అని కాంగ్రెస్ నేతలందరికీ నోటి నిండా పనిచెప్పాడు అద్దంకి. ఇదేందీ వ్యా..! ఒక్కటి చెబితే ఒకటి చేస్తరు..? నేనేం చెప్పినా.. మీరేం చేస్కొచ్చిర్రు..! పెద్దసారు చెడామడా ఎడాపెడా అర్సుకుండు సీనియర్లను. నీళ్లు నములుతూ .. బింగి బింగి చూస్తూ.. బిక్కు బిక్కు మంటూ.. అయ్యా..! అప్పటికే మేము.. అన్ని ఒకటికి పదిసార్లు రీహార్సల్స్ చేపిచ్చినమయ్యా..! కానీ రంగస్థలం వేదికనెక్కగానే తనలోని సహజ నటుడు బయటకొచ్చి పాత్రలో జీవించేశాడయ్యా.. స్క్రిప్టులో లేని డైలాగులు.. బూతులు కూడా అవే వాటంతట వచ్చేశాయి..! మంచి ఫామ్‌లో ఉన్నాడు కదా.. అనుకున్నాం… ఇలా ఫామ్‌హౌజ్‌ల తిట్లు వడతం అనుకోలేదయ్యా..!
చెడగొట్టారు కదరా.. చెడబుట్టాడు కదరా.. అన్నట్టుగానే ఉన్నాయి పెద్దాయన చూపులు… హనుమంతుడిని చేయబోతే కోతి అయిందేదబ్బా .. వైరాగ్యం నిండిన డైలాగొకటి చెప్పి.. రెండు కాళ్లూపుతూ దీర్ఘాలోచనలో పడిపోయాడు. బతుకు జీవుడా అని అక్కడ్నుంచి మెల్లగా జారుకున్నారు సీనియర్లు. ఇదీ తెలంగాణలో ఇవాళ్టి రచ్చ రంబోళా రాజకీయం.