E-Paper
Advertisement

గ్రేటర్‌ ఓటరు దూరం దూరం..! 35 శాతమే ఓటర్లుగా నమోదైన వైనం..! 12 లక్షలకు 36,837 మందే ఓటర్లుగా నమోదు..!

గ్రేటర్‌ ఓటరు దూరం దూరం..! 35 శాతమే ఓటర్లుగా నమోదైన వైనం..! 12 లక్షలకు 36,837 మందే ఓటర్లుగా నమోదు..!
Advertisement

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల పట్టభద్రులంతా అనాసక్తిగా ఉన్నారా? ఎంతగా దీనిపై చైతన్యం పెంచినా వారు మాత్రం లైట్‌గానే తీసుకుంటున్నారా? తాజాగా ఓటరు ముసాయిదా జాబితాను చేస్తే అచ్చంగా ఇదే అనిపిస్తోంది. కీలకమైన గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనైతే డోంట్‌కేర్‌ అన్నట్టుగానే ఉన్నారట గ్రాడ్యుయేట్లు.

ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు ఏమాత్రం ఇంట్రెస్టు చూపలేదు. దీంతో దాదాపు 12 లక్షల దాకా ఉన్న అర్హులైన ఓటర్లకు గాను, కేవలం 36, 837 మంది మాత్రమే ఓటరుగా ముందుకొచ్చారంతే. మిగిలిన వారంతా చోద్యం చూస్తున్నట్టుగానే ఉన్నారంటున్నారు. డిసెంబర్‌ 10 వరకు ఓటరుగా నమోదు అవకాశం ఉన్నా.. ఇక పెద్దగా ఈ సంఖ్య పెరిగేలా లేదనేది తేలిపోతున్నది.

Advertisement

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు, నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం నియోజకవర్గానికి వచ్చే ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి. దాదాపు మూడు నెలలుగా పట్టభ్రదులైన అర్హులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించినా.. మొదటి నుంచి దీనిపట్ల గ్రాడ్యుయేట్ల నుంచి పెద్దగా స్పందన కరువవుతూ వస్తోంది. తాజాగా ముసాయిదా జాబితాను చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

రెండు నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు కొత్త ఓటర్లు ఉండే అవకాశం ఉందంటున్నారు. పాత ఓటర్లు 10.37 లక్షల మంది ఓటర్లకు గాను వీరు కూడా ఓటరుగా నమోదు చేసుకుని ఉంటే.. కనీసం 18 లక్షల నుంచి 20 లక్షల మంది ఓటర్లుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాలు కలిసి 11.89 లక్షల మందే ఓటర్లుగా నమోదైనట్టు ముసాయిదా జాబితా ప్రచురించింది ఎన్నికల సంఘం.

Advertisement

గత ఎన్నికలతో పోల్చితే 1.52 లక్షల మంది ఓటర్లు మాత్రమే పెరిగారంతే. ప్రధానంగా పాత వారిని కంటిన్యూ చేయకపోవడం వల్లే ఓటర్ల సంఖ్య బాగా తగ్గిందంటున్నారు. కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చాలా మందికి తెలియక పోవడం, తెలిసినా.. ఆ దరఖాస్తులు నింపే విషయంలో అవగాహన లేకపోవడం కారణాలైతే… మరికొందరైతే మనకెందుకులే అని లైట్‌గా తీసుకున్న బాపతు కేసులు కూడా చాలానే ఉన్నాయంటున్నారు.

గతంలో కూడా ఇలాంటి నిర్లక్ష్య దోరణి గ్రాడ్యుయేట్లలో కనిపించింది. ఈసారి మరీ ఎక్కువైంది తప్పితే .. అది తగ్గలేదనే విషయం ఈసారి తేటతెల్లమైంది. గ్రేటర్ పరిధిలోనైతే ఇది మరీ దారుణంగా ఉంది. అసలు ఎవరూ పెద్దగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై కనీస ఆసక్తి కూడా కనబరచకపోవడం చర్చనీయాంశమవుతోంది.

గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో సిటీలో చాలా మంది విద్యావంతులున్నారు. వీరిలో ఎక్కువగా ఐటీ, ప్రైవేటు ఉద్యోగులున్నారు. వీరంతా ఈ ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదని తేలిపోయింది. పార్టీలు ప్రచారం చేసినా, పనిగట్టుకుని ఎన్‌రోల్‌మెంట్ చేయించినా.. పెద్దగా ఫలితం దక్కలేదు. కానీ అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీటిలో గెలుపు తమ పార్టీలకు అత్యంత ప్రాముఖ్యత కలిగినవిగా చెప్పుకుంటూ వస్తున్నారు.

అయినా, ఎన్‌రోల్‌మెంట్‌పై ఎవరూ పెద్దగా శ్రద్ద పెట్టలేదని, పెట్టినా.. అసలు గ్రాడ్యుయేట్లకే వీటిపై ఆసక్తి కరువైందని తేలిపోయింది. ఎస్‌ఐఆర్‌ పని ఒత్తిడి వల్ల కూడా ఎన్నికల సంఘం దీనిపై పెద్ద సీరియస్‌గా ఫోకస్‌ పెట్టలేదనే ప్రచారమూ ఉంది. మహబూబ్‌నగర్‌- హైదరాబాద్‌- రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓట్లు 5, 68, 105 మంది ఉండగా.. ఇందులో  70 శాతం వరకు గ్రేటర్‌ పరిధిలోనివే కావడం గమనార్హం.

2021 ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలో 5,31,268 ఓట్లు ఉండగా, ఇప్పుడు అదనంగా నమోదు చేసుకున్న ఓటరు జాబితా ప్రకారం 36, 837 మంది ఓటర్లు మాత్రమే పెరిగారు. రాష్ట్రంలో అత్యధిక విద్యావంతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నివసించే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అర్హుల సంఖ్య 12 లక్షలకు పైగా ఉన్నప్పటికీ 30 నుంచి 35 శాతంలోపే ఓటరుగా నమోదు చేసుకోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇది ఏ పార్టీ కొంప ముంచుతుంది? ఎవరిని గెలుపుతీరాలకు చేర్చుతుందో అంచనా వేసుకునే పనిలో పార్టీలున్నాయి. ఫలితాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకు దారి తీస్తుందనే చర్చ విపరీతంగా జరుగుతున్న తరుణంలో ఓటర్ల నమోదు భారీగా తగ్గిపోవడం, గ్రాడ్యుయేట్ల అనాసక్తి ఎలాంటి రాజకీయ సమీకరణలకు తెర తీస్తుందోననే కొత్త చర్చ కూడా మొదలైంది.

Tags

Related News

అమెరికాలో 10 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డు! డెమోక్రాట్ల కొత్త బిల్లులో ఏముంది?

బీఆర్‌ఎస్‌కు గుదిబండలా సీఎంగా కేటీఆర్‌! ఇటీవల తీవ్రంగా ప్రచారం చేస్తున్న పొలిటికల్ సర్కిల్స్‌…!

జెన్సన్ హువాంగ్ రీ-అపాయింట్మెంట్.. ఎన్విడియా బోర్డు నిర్ణయం వెనుక ట్రంప్, మస్క్ పాత్ర ఏంటి?

తెలంగాణలో బీజేపీకి షాకింగ్ న్యూస్.. పార్టీకి ఆ కీలక నేతలు దూరం..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ సంచలన వ్యూహం?

ఇందూరులో ఉన్నది అర్వింద్‌ బీజేపీ! ఇ ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ..! ఎంపీతో ఎమ్మెల్యేల ఎడముఖం పెడముఖం!

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి వర్సెస్ ఎంపీ వార్.. నలుగురు నేతలు సస్పెండ్?

Big Stories

Advertisement
×