E-Paper
Advertisement

Potato Halwa: బంగాళాదుంపలతో చేసే టేస్టీ హల్వా, తక్కువ పదార్థాలతో ఇంట్లో చేసే రుచికరమైన స్వీట్

Potato Halwa: బంగాళాదుంపలతో చేసే టేస్టీ హల్వా,  తక్కువ పదార్థాలతో ఇంట్లో చేసే రుచికరమైన స్వీట్
Advertisement

సాధారణంగా హల్వా అనగానే క్యారెట్ హల్వా, గోధుమ హల్వా, సూజీ హల్వా గుర్తుకొస్తాయి. కానీ చాలా మందికి తెలియని హల్వా ఒకటుంది. అదే ఆలూ హల్వా. బంగాళాదుంపలతో (ఆలూ) తయారయ్యే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే తక్కువ పదార్థాలతోనే ఈ హల్వాను తయారుచేసుకోవచ్చు. ఈ ఆలూ హల్వాను పండుగల సమయంలో, ప్రత్యేక సందర్భాల్లో లేదా అతిథులు వచ్చినప్పుడు కూడా తయారు చేయవచ్చు.

ఆలూ హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు – రెండు
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
చక్కెర – అయిదు స్పూన్లు
పాలు – పావు కప్పు
జీడిపప్పు తరుగు – ఒక స్పూన్
బాదం తరుగు – ఒక స్పూన్
కిస్ మిస్‌లు – ఒక స్పూన్
యాలకుల పొడి – పావు స్పూన్
కుంకుమపువ్వు – అయిదు రేకలు
కోవా ముద్ద – రెండు స్పూన్లు

Advertisement

Also read: Spinach Fry: పాలకూర నువ్వుల వేపుడు రెసిపీ, తింటే ఎంతో ఆరోగ్యం పైగా రుచికి రుచి

ఆలూ హల్వా రెసిపీ
1. ముందుగా బంగాళాదుంపలను బాగా కడిగి కుక్కర్‌లో ఉడికించాలి. రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది.
2. దుంపలు చల్లారిన తర్వాత పైన పొట్టు తీసి మెత్తగా నలపాలి.
3. ఒక మందపాటి కళాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. అందులో నెయ్యి వేసి కరిగించాలి.
4. నెయ్యి వేడి అయిన తర్వాత బంగాళాదుంప మిశ్రమాన్ని అందులో వేసి చిన్న మంటపై కలుపుతూ వేయించాలి.
5. ఇలా 3 నుంచి 4 నిమిషాలు వేయిస్తే ఆలూ నుంచి వచ్చే పచ్చివాసన పోతుంది. నెయ్యి వాసన ఆలూలోకి బాగా చేరుతుంది.
6. ఇప్పుడు కళఆయిలో పాలు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత చక్కెర వేసి మళ్లీ కలపాలి.
7. చక్కెర వేసిన తర్వాత బంగాళాదుంప మిశ్రమం కొంచెం లూజ్‌గా మారుతుంది. మెల్లగా కలుపుతూ ఉంటే మళ్లీ గట్టిపడుతుంది.
8. మరో చిన్న కళాయి స్టవ ్మీద పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిష్మిష్ వేయించాలి. వీటిని హల్వా మిశ్రమంలో వేసి కలపాలి.
9. చివరిగా యాలకుల పొడి వేసి కలపాలి. మీకు ఇష్టమైతే కుంకుమపువ్వు కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే హల్వాకు మంచి రంగు, వాసన వస్తుంది.
10. ఖోవా వేయాలనుకుంటే అందులో వేసి మరో 2 నిమిషాలు కలిపి ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.

Advertisement

Also read: Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది

ఆలూ హల్వాను వేడి వేడి గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. పైన కొద్దిగా జీడిపప్పు తురుము వేసి గార్నిష్ చేయవచ్చు. ఇది మిగతా హల్వాలాగే చాలా రుచిగా ఉంటుంది.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×