Singeetham Twitter Review: సంగీతం + సింగీతం = ఒక వినూత్న ప్రయోగం. తెలుగు సినిమా అంటే కేవలం ఫైట్లు, డ్యాన్సులు మాత్రమే కాదు… అప్పుడప్పుడు వెండితెరపై మ్యాజిక్ కూడా చేయొచ్చు అని నిరూపించిన సినిమానే ఈ ‘సింగ్ గీతం’. మన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మార్క్ మిస్టరీ, ఫాంటసీ, ఒక మంచి సామాజిక సందేశాన్ని మేళవించి వైజయంతీ మూవీస్ టీం చేసిన ఒక క్రేజీ అటెంప్ట్ ఇది. సినిమాకు ప్రాణం ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్. కేవలం పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు… ఈ సినిమాలో డైలాగులే పాటలుగా సాగే ఒక కొత్త ఫార్మాట్‌ను ట్రై చేశారు. డియస్పి కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ట్విటర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం.
కథ పట్టాలెక్కడానికి కొంచెం సమయం తీసుకున్నప్పటికీ, ఇది నిజంగా ఒక వైవిధ్యమైన ప్రయత్నం. సినిమా ప్రారంభంలో మ్యూజికల్ ఎలిమెంట్స్ బాగానే వర్కవుట్ అయినప్పటికీ, మధ్యభాగంలో కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. కామెడీ అక్కడక్కడా మాత్రమే నవ్విస్తుంది. అయితే, సినిమా అసలు బలం సెకండాఫ్‌లో ఉండే ఎమోషన్స్‌లోనే ఉంది. ఫ్లాష్‌బ్యాక్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండాయి.
Read also-బాలయ్య ‘కింగ్ ఆఫ్ ఖాస్’ OST అవుట్.. ‘న్యూ ఏజ్’ మాస్‌తో ఊచకోత కోస్తున్న NBK111 గ్లింప్స్!
#SingGeetham Unique concept with its ups and downs, but deserves a try!
A genuinely unique attempt that takes time to find its footing. The musical aspect works initially but starts to feel stretched in the middle portions, while the comedy only lands in bits. However, the…
— Venky Reviews (@venkyreviews) June 11, 2026