E-Paper
Advertisement

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?
Advertisement

Peddi Movie Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ తర్వాత భారీ అంచనాలతో బుచ్చి బాబు సనా దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగా ప్రచారం కూడా చేశారు నిర్మాతలు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని చరణ్ ఇప్పటికే పలు మార్లు చెప్పుకొచ్చారు. అలాంటి ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల అంచనాలను ఏ విధంగా అందుకుందంటే.. ఈ రివ్యూ లో చూసేద్దాం.

Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ జాతర.. విగ్రహం పెట్టి పూజలు చేసేస్తున్నారు భయ్యా.. ఎక్కడంటే?

కథాంశం

Advertisement

‘పెద్ది’ సినిమా ఒక పీరియాడిక్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా. 1990 నాటి బ్యాక్డ్రాప్ క్రికెట్, రెజ్లింగ్ మరియు పారా ఒలింపిక్ రన్నింగ్  నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.  పీడిత ప్రజల కోసం, తన నైపుణ్యాలతో ఒక క్రీడాకారుడిగా రామ్ చరణ్ తన ఊరికి రైల్వే స్టేషన్ లేకపోవటం దాని  తేవడం కోసం చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశం. ఊరిలో అల్లరి చిల్లరగా తిరుగుతూ, ఒక గ్యాంగ్‌తో కలిసి క్రికెట్ ఆడే రామ్ చరణ్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. అతనికి క్రికెట్ అంటే ప్రాణం, సిక్సర్లు, ఫోర్లతో చిచ్చరపిడుగులా ఆడుతుంటాడు. అయితే ఆ గ్యాంగ్‌తో వచ్చిన విభేదాల వల్ల, ఆ తర్వాత అతను కుస్తీ పోటీలు ఎలా నేర్చుకున్నాడు, కన్నడ రాజకుమార్‌ను ఎలా కలిశాడు అనేది ఆసక్తికరమైన మలుపు. అక్కడి నుండి రన్నింగ్ పోటీల్లో పాల్గొనడం వరకు కథ సాగుతుంది. బోమన్ ఇరానీ నరేషన్ లోనే కథ మొదలవుతుంది.. అసలు జగపతి బాబుకు పెద్దికి ఉన్న సంబంధం ఏమిటి.. జగపతి బాబు చివరకు ఏం అవుతాడు.. ఆ తర్వాత పారా ఒలెంపిక్స్ ఎలా సెలక్ట్ అవుతాడు అన్నది ట్విస్ట్. అసలు ఊరికి రైల్వే స్టేషల్ వచ్చిందా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూాడాల్సిందే.

విశ్లేషణ..

అందరూ అనుకున్నట్లు గానే రామ్ చరణ్ ‘పెద్ది’ పాత్రకు ప్రాణం పోశాడు. తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తోంది అనడంతో సందేహం లేదు. ఇక దర్శకుడు బుచ్చి బాబు సనా ప్రతిభ మొత్తం ఇందులో చూపించారు. పెద్ది చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. హీరోయిన్ విషయాని కొస్తే గ్లామరస్ కోసం తీసుకున్నట్లుగా ఉంటుంది. కొన్ని పాటలకు మాత్రమే హీరోయిన్   పాత్ర పరిమితమవుతుంది. ‘అప్పలసూరి’గా జగపతి బాబుకు ఈ సినిమా గుర్తుండిపోతుంది. కన్నడ రాజ్ కుమార్, బోమన్ ఇరానీ, తదితరులు తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు.

టెక్నికల్‌గా..

Advertisement

ఈ సినిమాకు సంగీతం అందించిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పాటలతో మరో సారి తన మార్కు చూపించారు. ఆర్‌ఆర్ కొంచెం డల్ అనిపించినా.. ‘రయ్ రయ్ రారా’, ‘చికిరి చికిరి’ సాంగ్స్ ఓకే అనిపిస్తాయి. హీరో ఎలివేషన్ లో మ్యూజిక్ కాస్త డల్ అయినట్లు గా కనిపిస్తుంది.  సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఫ్రేమ్ కంపోజింగ్ గురించి చెప్పనవసరంలేదు.. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ‘పెద్ది’ లోకంలోకి తీసుకుపోతుంది.. మరో సారి ర్యాండీ తన పనితనం మొత్తం చూపించారు ఈ సినిమాలో. మొత్తంగా చూసుకుంటే ‘పెద్ది’ని టీం మొత్తం నిలబెట్టింది అని చెప్పవచ్చు. సినిమాలో కొరియోగ్రఫీ, డాన్స్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఇది సినిమాకు ఒక ప్లస్ పాయింట్.

ప్లస్ పాయింట్స్

  • రామ్ చరణ్ వన్ మ్యాన్ షో
  • కెమెరా
  • క్లైమాక్స్
  • రన్నింగ్ సీజీ
  • యాక్షన్స్
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్

  • రెగ్యులర్ కథ కాదు
  • హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ లేని హీరోయిన్
  • ఓవర్ డ్రామాటిక్

బాటమ్ లైన్
గుర్తింపు లేని ఊరికి ఊపిరి పోసి, గమ్యాన్ని చూపే ‘పెద్ది’ పోరాటం!

PEDDI Movie Review and Rating – 3 /5

Read also: పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×