E-Paper
Advertisement

ధర తక్కువ అని పెద్ద గదికి 1 టన్ ఏసీ కొన్నారా? ఏం పర్లేదు.. ఇలా చెయ్యండి!

ధర తక్కువ అని పెద్ద గదికి 1 టన్ ఏసీ కొన్నారా? ఏం పర్లేదు.. ఇలా చెయ్యండి!
Advertisement

Summer Cooling Tips: మనలో చాలామంది చేసే పొరపాటు ఇదే. బడ్జెట్ కలిసి వస్తుందనో లేదా ఆ సమయంలో అవగాహన లేకపోవడం వలనో పెద్ద హాలుకో లేక పెద్ద బెడ్‌రూమ్‌కో తక్కువ కెపాసిటీ ఉన్న 1 టన్ ఏసీని కొనేస్తాం. తీరా ఎండలు ముదిరాక ఏసీ ఆన్ చేస్తే.. గది అస్సలు చల్లబడదు సరికదా, కరెంటు బిల్లు మాత్రం మోత మోగిపోతుంది. అలా అని ఇప్పుడున్న ఏసీని అమ్మేసి కొత్తది కొనడం అంటే మళ్లీ వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. అయితే.. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఇప్పటికే మీ దగ్గర ఉన్న ఆ చిన్న ఏసీతోనే పెద్ద గదిని కూడా సూపర్ కూల్‌గా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

గదిని చిన్నదిగా మార్చేయండిలా:

ఏసీ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు గది మొత్తాన్ని చల్లబరచాలని చూడటం కంటే.. మీకు కావాల్సిన ఏరియా మీద ఫోకస్ పెట్టడం మంచిది. ఒక మందపాటి తెర లేదా స్లైడింగ్ డోర్ ఉపయోగించి గదిని రెండుగా విభజించండి. మీరు నిద్రపోయే మంచం లేదా కూర్చునే సోఫా ఉన్న వైపు మాత్రమే ఏసీ గాలి పడేలా చూసుకోండి. దీనివల్ల ఏసీ తక్కువ స్థలాన్ని త్వరగా చల్లబరుస్తుంది. అలాగే అటాచ్డ్ బాత్‌రూమ్ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచడం మర్చిపోవద్దు.

ఫ్యాన్ వేస్తే చల్లదనం పోతుందా?

Advertisement

చాలామంది ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ ఆపేస్తారు. కానీ అది తప్పు. ఏసీ నుంచి వచ్చే చల్లని గాలి బరువుగా ఉండి కిందనే పేరుకుపోతుంది. ఆ సమయంలో ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో పెడితే.. అది కింద ఉన్న చల్లటి గాలిని పైకి లేపి గది మూలమూలలకి పంపిస్తుంది. దీంతో ఏసీకి ఫ్యాన్ ఒక హెల్పర్ లాగా పనిచేస్తుందన్నమాట.

Also Read: భారత్‌లో Realme 16T 5G లాంచ్ కన్ఫర్మ్.. దీని అత్యాధునిక ఫీచర్లు, బ్యాటరీ పవర్ తెలిస్తే ఎగరేసుకుపోతారు!

ఎండను లోపలికి రానివ్వొద్దు:

Advertisement

ఏసీ కష్టపడి గదిని చల్లబరుస్తుంటే.. కిటికీల గుండా వచ్చే ఎండ దాన్ని మళ్లీ వేడి చేస్తుంది. అందుకే పగటిపూట కిటికీలకు మందపాటి బ్లాక్ అవుట్ తెరలు వేయాలి. ఇంకా వీలైతే కిటికీ అద్దాలకు సన్ కంట్రోల్ ఫిల్మ్ అంటిస్తే సరి. ఎండ తక్కువగా తగిలితే ఏసీ మీద లోడ్ తగ్గి, గది నిమిషాల్లో చల్లబడుతుంది.

గాలి బయటకు వెళ్లకుండా చేయాలి:

గదిలో ఉండే చిన్న సందుల నుంచి చల్లదనం బయటకు పోతే ఏసీ ఎంతసేపు తిరిగినా వేస్టే. ముఖ్యంగా తలుపు కింద ఉండే గ్యాప్ నుంచి చల్లని గాలి బయటకు వెళ్లిపోతుంది. అక్కడ ఒక డోర్ మ్యాట్‌నో లేదా డోర్ డ్రాఫ్ట్ స్టాపర్‌నో పెట్టండి. కిటికీల సందులు కూడా లేకుండా చూసుకుంటే చల్లదనం గదిలోనే లాక్ అయిపోతుంది.

ఏసీని 16 డిగ్రీల్లో పెడుతున్నారా?

ఏసీని 16 డిగ్రీల్లో పెడితే గది త్వరగా చల్లబడదు. అది కేవలం కంప్రెషర్‌ను ఇబ్బంది పెడుతుంది అంతే. ఏసీని ఎప్పుడూ 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచాలి. ఇది మన బాడీకి హాయిగా ఉంటుంది. ఏసీ కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అలాగే ఒక 15 రోజులకోసారి ఏసీ ఫిల్టర్లను తీసి శుభ్రం చేయాలి. దుమ్ము ఉంటే గాలి సరిగ్గా రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

వేడి పుట్టించే గ్యాడ్జెట్స్‌తో జాగ్రత్త:

గదిలో ఉండే పాతకాలపు బల్బులు చాలా వేడిని పుట్టిస్తాయి. వాటి బదులు LED బల్బులు వాడొచ్చు. అలాగే గదిలో ఎవరూ లేనప్పుడు టీవీలు, కంప్యూటర్లను అనవసరంగా ఆన్ చేసి ఉంచొద్దు. అవి కూడా గది ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఈ సింపుల్ ఐడియాలు ఫాలో అయితే, 1 టన్ ఏసీ కూడా పెద్ద గదిని కూల్ కూల్‌గా మార్చేస్తుంది.

Also Read: షాకింగ్ అప్డేట్.. వాట్సప్‌లో ఇక పెయిడ్ సర్వీస్, ఆ 6 ఫీచర్లు వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×