E-Paper
Advertisement

భారత్‌లో Realme 16T 5G లాంచ్ కన్ఫర్మ్.. దీని అత్యాధునిక ఫీచర్లు, బ్యాటరీ పవర్ తెలిస్తే ఎగరేసుకుపోతారు!

భారత్‌లో Realme 16T 5G లాంచ్ కన్ఫర్మ్.. దీని అత్యాధునిక ఫీచర్లు, బ్యాటరీ పవర్ తెలిస్తే ఎగరేసుకుపోతారు!
Advertisement

Realme 16T 5G: టెక్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Realme 16T 5G ఎట్టకేలకు భారత్‌లో విడుదలకు సిద్ధమైంది. మే 22న ఈ ఫోన్‌ ఇండియాలో గ్రాండ్ లాంచ్ కానున్నట్లు రియల్‌మీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. గతేడాది వచ్చిన 15Tలో 7,000mAh బ్యాటరీ చూసి అందరం అబ్బా అనుకున్నాం. కానీ ఈసారి రియల్‌మీ మరో అడుగు ముందుకేసి ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని ప్యాక్ చేసింది. అంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ ఏమాత్రం లావుగా లేకుండా.. చాలా స్లిమ్‌గా (8.8 మిమీ) ఉండటం విశేషం.

72 గంటల బ్యాటరీ బ్యాకప్:

ఈ Realme 16T 5G స్పెషాలిటీ ఏమిటంటే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మూడ్రోజుల పాటు ఛార్జర్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్కువగా గేమ్స్ ఆడేవారికి ఈ ఫోన్ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే.. కంటిన్యూగా 11 గంటల పాటు బీజీఎమ్ఐ ఆడినా బ్యాటరీ సపోర్ట్ ఇస్తుంది. ఇక లుక్స్ పరంగా చూస్తే.. అల్యూమినియం కెమెరా మాడ్యూల్‌తో చాలా క్లాసీగా కనిపిస్తోంది. ఇది ఆరోరా గ్రీన్, స్టార్‌లైట్ రెడ్, స్టార్‌లైట్ బ్లాక్ రంగుల్లో మెరిసిపోనుంది.

ఆండ్రాయిడ్ 16 వెర్షన్:

Advertisement

దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను వాడారు. ఇది మరీ హెవీ గేమింగ్ కోసం కాకపోయినా.. వాట్సప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోలు చూసుకోవడానికి ఎక్కడా ఆగకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. 8GB RAM, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సేపు రావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ కానుంది.

Also Read: ఏసీ బిల్లు తగ్గించే అద్భుత చిట్కా.. మేడ పైకి ఎక్కి ఇదొక్కటి చేయండి చాలు!

ఛార్జింగ్ టెన్షన్ ఉండదు:

Advertisement

భారీ బ్యాటరీని నింపడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇచ్చారు. డిస్‌ప్లే కూడా 6.8 అంగుళాలతో చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో మరో మంచి విషయం ఏంటంటే.. బైపాస్ ఛార్జింగ్. అంటే.. ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతున్నప్పుడు పవర్ నేరుగా బ్యాటరీకి కాకుండా ఫోన్‌కు అందుతుంది. దీనివల్ల గేమ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కదు. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది.

ధర ఎంతంటే?

Realme 16T 5G ధర సుమారు రూ.20,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉండొచ్చని టెక్ నిపుణుల అంచనా. ఈ రేంజ్‌లో మిగతా కంపెనీలు స్పీడ్ మీద ఫోకస్ పెడితే.. రియల్‌మీ మాత్రం మా ఫోన్ వాడితే ఇక ఛార్జింగ్ టెన్షన్ ఉండదు అనే భరోసాతో ఈ మోడల్‌ను లాంచ్ చేసినట్లుంది. మరి ఈ భారీ బ్యాటరీ ఫోన్ టెక్ ప్రియులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Also Read: 50 డిగ్రీల ఎండలోనైనా హాయిగా గుర్రుపెట్టి నిద్రపోవచ్చు.. ఈ Silent Sleep Split ACలు ఉంటే!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×