E-Paper
Advertisement

మ‌మ‌త మాఛ్‌-బాత్‌పై.. ఇప్పుడు బీజేపీ రియాక్ష‌న్‌! బాగుంది.. రూ.5కే అక్క‌డ చేప‌ల పులుసు భోజ‌నం! ఏమిటీ క‌థ‌..?

మ‌మ‌త మాఛ్‌-బాత్‌పై.. ఇప్పుడు బీజేపీ రియాక్ష‌న్‌! బాగుంది.. రూ.5కే అక్క‌డ చేప‌ల పులుసు భోజ‌నం! ఏమిటీ క‌థ‌..?
Advertisement

ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయాల్లో మ‌మ‌త‌ది ఓ ప్ర‌త్యేక శైలి. ఆమె లోక‌ల్ భావోద్వేగాల‌ను త‌న పార్టీ మైలేజీకి అనుకూలంగా మలుచుకోవ‌డంలో చాలా సార్లు స‌ఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఇరుక‌న పెట్టడం ఒకెత్తైతే.. బెదిరింపు ప్ర‌సంగాలు ఆమెకు అద‌న‌పు మైలేజీని తెచ్చిపెట్టాయ‌ని చెప్పాలి. ఇక లోక‌ల్ ప‌బ్లిక్ ప‌ల్స్ ఎరిగిన నేత‌గా అక్క‌డి ప‌రిస్థితులు, సంస్కృతుల‌పై ఆమెకు ప‌ట్టుంది. అందుకే అవ‌త‌లి పార్టీది అక్క‌డ సంస్కృతిని చెరిపేసే పార్టీగా ముద్ర‌వేసి తృణ‌మూల్ కాంగ్రెస్ మాత్ర‌మే స్థానిక ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోగ‌లుగుతుంద‌నే మెసేజ్ ఇవ్వ‌డంలో ఆమె చాలా సంద‌ర్బాల్లో స‌ఫ‌లీకృతుల‌య్యారు.

తాజాగా మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా ఆమె.. అక్క‌డి సంసృతిలో భాగ‌మైన చేప‌ల కూర‌పై త‌న‌దైన శైలిలో మాట్లాడారు. త‌న ప్ర‌ధాన శ‌త్రువైన బీజేపీని ఇరుకున పెట్టేందుకు.. హిందూత్వ భావ‌జాలం ముసుగులో బ్రాహ్మ‌ణులు రాజ్య‌మేలే పార్టీగా బీజేపీని చిత్రీక‌రించే క్ర‌మంలో ప్ర‌జ‌ల ముందు ఆమె చేప‌ల ఇష్యూను త‌న ప్ర‌చార అస్త్రంగా వాడుకున్నారు. బీజేపీ అధికారంలోకి వ‌స్తే బెంగాల్ ప్ర‌జ‌ల సంస్కృతిలో భాగ‌మైన మాఛ్‌-బాత్ .. అంటే చేప‌ల కూర అన్నాన్ని తిననివ్వ‌ర‌ని ఆమె గ‌ట్టిగా జనంలోకి తీసుకెళ్ల‌గ‌లిగింది. ఈ ప్ర‌మాదాన్ని బీజేపీ అప్పుడే ప‌సిగ‌ట్టింది. ఆ పార్టీ నుంచి సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌చారంలో ఉన్న సువేందు అధికారి బ్రాహ్మ‌ణుడు.

Advertisement

ఇది కూడా మ‌మ‌త ప్ర‌చారానికి బాగా క‌లిసి వ‌చ్చింది. వీళ్లు అధికారంలోకి వ‌స్తే మ‌న‌ల్ని శాఖాహార‌మే తిన‌మంటారు. మ‌న నిత్య జీవితంలో, మ‌న జీవ‌న సంస్కృతిలో భాగ‌మైన చేప‌ల భోజ‌నాన్ని తిన‌నివ్వ‌రు.. అనేది ఆమె ప్ర‌ధాన ప్ర‌చార అస్త్రంగా సువేందుపై సంధించారు. కానీ సువేందు.. దీన్ని ఖండిస్తూ వ‌చ్చారు. మేము అధికారంలోకి వ‌స్తే చేప‌ల భోజనాన్ని అతి త‌క్కువ ధ‌ర‌కే అందిస్తామ‌ని చెబుతూ వ‌చ్చారు. దీనికి ఎంత మంది అక్క‌డ క‌నెక్ట‌య్యారో లేదో తెలియ‌దు. అక్క‌డ బీజేపీ గెల‌వ‌డానికి చాలా కార‌ణాలే ముడి ప‌డి ఉన్నాయి. మ‌మ‌త పాల‌న‌, బీజేపీ ఓట్ల తొల‌గింపు.. హిందూ భావ‌జాలం పెర‌గ‌డం..చాలా ఇష్యూలున్నాయి. ఈ చేప‌ల అన్నం.. ప్ర‌చారాన్ని బెంగాల్ ప్ర‌జ‌లు ప‌ట్టించుకున్న‌ట్టు లేదు.

మ‌మ‌త మాట‌ల‌ను విన‌లేదు. మొత్తానికి అక్క‌డ సీఎంగా సువేందు అధికారి సీఎంగా అయ్యారు. అందురూ అనుకున్న‌ట్టుగానే. కానీ ఈ చేప‌ల భోజ‌నం విష‌యాన్ని మాత్రం ఈ సీఎం బాగా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టున్నాడు సుమండీ! రూ. 5కే చేప‌ల కూర‌తో భోజ‌నం పెట్టే కార్య‌క్ర‌మానికి వ‌డివ‌డిగా శ్రీ‌కారం కూడా చుట్టేసి.. త‌మ‌ది మాట‌ల ప్ర‌భుత్వం కాదు.. చేత‌ల ప్ర‌భుత్వం అని చెప్పేక్ర‌మంలో ఈ విష‌యంలోనైతే స‌క్సెస‌య్యింద‌నే చెప్పాలి.

Advertisement

అదీ సువేందు దీనిపై ఇంత త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని అనుకోలేదెవ్వ‌రు. ముఖ్యంగా ఇది మ‌మ‌త వ‌ర్గానికి షాక్ నిచ్చింద‌నే చెప్పాలి. చేప‌ల కూర‌నే తిన‌నివ్వ‌ర‌ని ప్ర‌చారం చేస్తే.. ఆ సర్కారే ఇప్పుడు కొలువుదీరి.. ఏకంగా ఐదు రూపాయల‌కే చేప‌ల భోజ‌నాన్ని అందిస్తుండ‌టం.. అక్క‌డి రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు తెర తీసింది.

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

Big Stories

Advertisement
×