E-Paper
Advertisement

Washing Machine: వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నారా? ఈ 10 సెకన్ల టెస్ట్ చేయండి.. లేదంటే నష్టపోతారు!

Washing Machine: వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నారా? ఈ 10 సెకన్ల టెస్ట్ చేయండి.. లేదంటే నష్టపోతారు!
Advertisement

Washing Machine: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో వాషింగ్ మిషన్ అందుబాటులో ఉంది. దుస్తులను శుభ్రం చేయడానికి చాలా మంది ఈ వాషర్లను వినియోగిస్తున్నారు. అయితే దీనిని వాడే విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల తమకు తెలియకుండానే కొందరు కొన్ని నష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. అధిక విద్యుత్ భారం, వాషింగ్ మిషన్లలో తరుచూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీని నుంచి తప్పించుకునేందుకు 10 సెకన్ల టెస్టింగ్ చిట్కాలను అనుసరించండి. దీనిని పాటించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

10 సెకన్ల టెస్టింగ్ అంటే ఏంటీ?

దుస్తులను మిషన్‌లో వేసిన అనంతరం వాష్ సైకిల్ స్టార్ట్ చేసే ముందు కొన్ని తనిఖీలు తప్పనిసరి. దీనిని 10 సెకన్ల లోపే ముగించవచ్చు. అందుకే దీనిని 10 సెకన్ల టెస్టింగ్ అని అంటారు. నిపుణులు సూచిస్తున్న టెస్టులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓవర్ లోడింగ్ టెస్టింగ్..

Advertisement

కేవలం 10 సెకన్ల పాటు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. తొలుత మిషన్ లోపలికి చెయి పెట్టి.. డ్రమ్ లోని బట్టలకు డ్రమ్ ఉపరితలానికి మధ్య జానేడు ఖాళీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక గ్యాప్ లేకుండా అధికంగా ఉన్న దుస్తులను తీసివేయాలి. ఒకవేళ అధిక లోడ్ తో వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే.. లోపలి డ్రమ్ సరిగా తిరగలేదు. ఓవర్ లోడ్ కారణంగా మోటార్ పై అధిక భారం పడుతుంది. అదే విధంగా మోటార్ పైనా అధిక ఒత్తిడి పడి.. విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోతుంది. ఫలితంగా అధిక కరెంటు బిల్లు భారీగా పెరిగిపోవచ్చు.

బ్యాలెన్స్ చెక్

కొందరు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేటప్పుడు ఒకే వైపు కుప్పలా వేస్తుంటారు. అది సరైన పద్దతి కాదు. బట్టలు అన్ని వైపులా సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల అన్ని మూలలకు సర్ఫ్ వాటర్ వెళ్లి బట్టలు పరిశుభ్రంగా వాష్ చేయబడతాయి.

సర్ఫ్ తక్కువగా వాడండి

Advertisement

మిషన్ లోని బట్టలకు ఎంత సర్ఫ్ అవసరమో అంతే వేయాలి. పరిమితికి మించి వేయడం వల్ల వాషింగ్ సమయంలో అధికంగా నురుగు వస్తుంది. దీంతో మెషీన్ దాన్ని క్లీన్ చేయడానికి ఎక్కువ సార్లు తిరుగుతుంది (Extra Rinse). దీనివల్ల నీరు, కరెంట్ వేస్ట్ అవుతాయి. సమయం కూడా వృథా అవుతుంది.

డ్రమ్ క్లీనింగ్..

మిషన్ లో బట్టలు వేసే ముందు లోపలి డ్రమ్ శుభ్రంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అతి అపరిశుభ్రంగా ఉందంటే.. అది మీ బట్టల శుభ్రతపై ప్రభావం చూపవచ్చు. నెలకు ఒకసారి వాషింగ్ మిషన్ ను క్లీనింగ్ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సౌండ్ టెస్టింగ్..

వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత కూడా ఒక తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మిషన్ ఆన్ అయిన తర్వాత మెుదటి 10 సెకన్ల పాటు దాని నుంచి వస్తున్న శబ్దాన్ని గమనించండి. సాధారణం కంటే బిన్నంగా ఏదైనా ఉంటే.. లోడింగ్ లో ఏదైనా సమస్య ఉన్నట్లు గుర్తించాలి. వెంటనే మిషన్ ఆపి.. బట్టలు కుప్పగా ఉంటే దానిని సరిచేయాలి.

Also Read: Car Washing Guide: ఇంట్లోనే కారు వాష్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయండి!

దీనివల్ల కలిగే ప్రయోజనాలు

10 సెకన్ల టెస్ట్ చేయడం వల్ల మీకు అనేక లాభాలు కలుగుతాయి. ఓవర్ లోడింగ్ లేకుండా జాగ్రత్త పడటం ద్వారా మిషన్ తక్కువ శ్రమతో తిరిగి.. కరెంట్ బిల్లును ఆదా చేస్తుంది. బట్టలు సరైన పద్దతిలో డ్రమ్ లో వేయడం వల్ల సెన్సార్లు సరైన పరిమాణంలో నీటిని వినియోగించుకుంటాయి. డ్రమ్ బ్యాలెన్స్ పాటించడం ద్వారా వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం మందగించకుండా పనిచేస్తుంది.

Also Read: Mega 158: మెగాస్టార్‌కు కలిసివస్తున్న మ్యాజిక్ నంబర్ ఇదేనా?.. అందుకే రిలీజ్ డేట్..

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×