E-Paper
Advertisement

Car Washing Guide: ఇంట్లోనే కారు వాష్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయండి!

Car Washing Guide: ఇంట్లోనే కారు వాష్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయండి!
Advertisement

Car Washing Tips: కారు శుభ్రంగా ఉండాలంటే తరచుగా వాష్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రతిసారి షోరూమ్ కు తీసుకెళ్లి వాష్ చేయడం కుదరకపోవచ్చు. అందుకే, ఎక్కువగా ఇంటి దగ్గరే వాష్ చేసుకుంటారు. అయితే, కారు వాష్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కారులో ఎలక్ట్రానిక్స్, సెన్సార్లు, సున్నితమైన పెయింట్ ఫినిషింగ్స్ తో నిండి ఉన్నాయి. ఏమాత్రం   అజాగ్రత్తగా వహించినా, కారు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా కారు వాష్ చేసే సమయంలో జరిగే పొరపాట్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ నీళ్లు పడకూడని ప్రదేశాలు

కారు వాష్ చేసే సమయంలో కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్లలో ఇది ఒకటి. నీళ్లు వెళ్లకూడని ప్రదేశంలోకి వెళ్తే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ కార్లలో వైరింగ్, సెన్సార్లు, లైట్లు, పార్కింగ్ సెన్సార్లు, కెమెరాలు బాడీ, ఇంజిన్ బే చుట్టూ ఉంటాయి. ఈ ప్రదేశాల్లో నీళ్లు పడటం వల్ల ఆయా పరికరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

⦿ హైడ్రోలాక్‌ సమస్యలు

Advertisement

ఇంజిన్ ఎయిర్ ఇన్‌ టేక్‌ లోకి  పీళ్లు వెల్లడం వల్ల హైడ్రోలాక్‌కు కారణం అవుతుంది. ఇంజిన్ పనిచేయడం ఆగిపోతుంది. చాలా తక్కువ సందర్భాల్లో ఇలా అయినప్పటికీ, రిపేర్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందుకే గ్రిల్ దగ్గర నేరుగా స్ప్రే చేయడం మంచిది.

⦿ ఫ్యూయెట్ ట్యాంక్ క్యాప్ మూసి ఉంచాలి!

కారు వాష్ చేసే సమయంలో ఫ్యూయెల్ మూత బిగించి ఉండేలా చూసుకోవాలి. ట్యాంక్ క్యాప్ సరిగా పెట్టకపోతే, టాంక్ లోకి వాటర్ వెళ్లి కారు స్టార్ట్ కాదు. అందుకే, కారు వాష్ చేసే సమయంలో ఫ్యూయెల్ ట్యాంక్ క్యాప్ గట్టిగా బిగించి ఉందో? లేదో? చూసుకోవాలి.

⦿ శుభ్రమైన క్లాత్ ఉపయోగించాలి!

Advertisement

కారును వాష్ చేసే సమయంలో శుభ్రమైన క్లాత్ ను ఉపయోగించాలి. అలా చేయడం వల్ల కారు ఎలాంటి డ్యామేజ్ కాదు. సాధారణ డిష్ సోప్, క్లీనర్లు అప్పటికప్పుడు ఎఫెక్టివ్ గా కనిపిస్తాయి. కానీ, అవి పెయింట్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. పెయింట్ మీది మైనపు, రక్షణ పొరలను తొలగిస్తాయి. కాలక్రమేణా, పెయింట్ మెరుపును కోల్పోతుంది. కారును శుభ్రం చేసేందుకు సరైన కార్ షాంపూ వాడాలి.

Read Also: సమ్మర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

⦿ ఎండలో వాష్ చేయకూడదు!

కారును ఎప్పుడు పడితే అప్పుడు కడగకూడదు. అలా చేయడం వల్ల కారు పెయింటింగ్ పోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, కారు మీద గీతలు పడుతాయి. తీవ్రమైన ఎండలో వాష్ చేయడం వల్ల పెయింటింగ్ మరింత త్వరగా ఊడిపోతుంది. అందుకే ఎండ లేని సమయంలో వాష్ చేయడం మంచిది.

Read Also: కారు ఎంత స్పీడ్ లో వెళ్తే పెట్రోల్ సేవ్ అవుతుంది? హైవేలో ఎంత? సిటీలో ఎంత?

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×