E-Paper
Advertisement

POCO X6 Neo Launch : పోకో నుంచి బడ్జెట్ ఫోన్.. మార్చి 13న లాంచ్!

POCO X6 Neo Launch : పోకో నుంచి బడ్జెట్ ఫోన్.. మార్చి 13న లాంచ్!
Advertisement
POCO X6 Neo Launch
POCO X6 Neo 

POCO X6 Neo Launch : ప్రపంచ మార్కెట్‌లో దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో పోకో ఒకటి. చైనాకు చెందిన ఈ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్‌గా పోకో మోడల్ పరిచయం చేసింది. షావోమీ పోకో పేరుతో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది. పోకో సిరీస్‌లో వచ్చే స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా రెడ్‌మీ మోడల్స్ రీబ్రాండ్ వర్షన్స్ ఉంటాయి.

అయితే తాజాగా Poco X6 Neo పేరుతో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. లాంచ్ తేదీతో పాటు ఫోన్ డిజైన్‌ను POCO India తన అపిషియల్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. గతంలో ఈ పోన్‌కు సంబంధించిన స్పెషికేషన్లపై అనేక లీక్‌లు వచ్చాయి. Poco X6 Neo రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో రీ బ్రాండెడ్ వేరియంట్ అని వెల్లడించింది.

Advertisement

READ MORE : 1000లోపు టాప్ 5 బ్లూటూత్ స్వీకర్లు.. ధర తక్కువ సౌండ్ ఎక్కువ

Poco X6 Neo మార్చి 13న భారత్ లాంచ్ కానుంది. ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉన్నట్లు ధృవీకరించబడింది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని మైక్రోసైట్ రాబోయే హ్యాండ్‌సెట్‌ను బ్లూ కలర్ ఆప్షన్‌లో ట్వీట్ చేసింది. ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్‌తో కనిపిస్తుంది, LED ఫ్లాష్ యూనిట్‌తో పాటు రెండు కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంది.

Advertisement

Poco X6 Neo వెనుక కెమెరా మాడ్యూల్‌పై ఉన్న ప్రింట్ గతంలో సూచించినట్లుగా, ఫోన్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్‌‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ 93.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో డిజైన్ కలిగి ఉంటుంది. ఫ్లాట్ సెంటర్డ్ హోల్-పంచ్ డిస్‌ప్లేతో, దాదాపు అతితక్కువ సైడ్ బెజెల్స్‌‌ను కలిగిఉంది. ఫోన్ 7.69mm మందం ఉంటుంది.

అదే సమయంలో.. Poco X6 నియో నారింజ కలర్‌తో ట్వీట్ చేసింది. ఫోన్ మరో రెండు కలర్స్‌లో అందుబాటులో లభించనుంది. Poco X6 Neo మోడల్ 8GB RAM రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో లాంచ్ అవుతుందని POCO India వెల్లడించింది. దీని ధర కూడా రూ. 18,000గా నిర్ధారించింది. ఫోన్ OLED డిస్‌ప్లే, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో రానుంది.

READ MORE : ఐక్యూ నుంచి న్యూ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ లీక్!

Poco X6 Neo రెడ్‌మి నోట్ 13ఆర్ ప్రో రీ బ్రాండెడ్ వెర్షన్ అయితే.. అది MediaTek Dimensity 6080 SoC, 6.67-అంగుళాల 120Hz ఫుల్-HD+ OLED స్క్రీన్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీతో రావచ్చు.

Tags

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×