E-Paper
Advertisement

iQOO 13 Launch: ఐక్యూ నుంచి రెండు ప్రీమియం ఫోన్లు.. ఫీచర్లు మాత్రం సూపర్బ్..!

iQOO 13 Launch: ఐక్యూ నుంచి రెండు ప్రీమియం ఫోన్లు.. ఫీచర్లు మాత్రం సూపర్బ్..!
Advertisement

iQOO 13 and iQOO 13 Pro Launch: Vivo సబ్‌ బ్రాండ్ iQOOకి టెక్ మార్కెట్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంది. కంపెనీ ఎక్కువగా iQOO నుంచి మిడ్ రేంజ్ ప్రైజ్‌ నుంచి ప్రీయం రేంజ్ వరకు ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలోనే iQOO 13ని తీసుకొచ్చే పనిలో పడింది. ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో అంటే అక్టోబర్- డిసెంబర్ మధ్య మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

కొత్త iQOO 13లో Qualcomm అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Gen 4 SoC అందించనుంది. అయితే కంపెనీ ఇప్పటి వరకు కొన్ని సెలెక్టెడ్ ఫోన్లలో మాత్రమే ఈ ప్రాసెసర్ తీసుకొస్తుంది. ఈ ప్రాసెసర్‌ను అక్టోబర్‌లో ప్రారంభించవచ్చు. సహజంగానే iQOO 13 సిరీస్ ఆ తర్వాత మాత్రమే ఈ ప్రాసెసర్‌ని ప్రారంభిస్తుంది.

Advertisement

Also Read: వివో ఫోటోల ఫోన్ సేల్ మొదలైంది.. అదిరిపోయే ఆఫర్లు!

అయితే ఇటీవల ఈ ఫోన్‌కు సంబంధించి కొంత సమాచారం చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో ఒక పోస్ట్‌లో iQOO 13 సిరీస్ బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యాలను వెల్లడించారు. iQOO 13 స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీతో విడుదలవుతుందని చెప్పారు. ఇది 120 వాట్ల ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో వస్తుంది.

Advertisement

గతంలో వచ్చిన లీక్‌ల గురించి మాట్లాడుతూ.. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 SoCని కలిగి ఉన్నట్లు వెల్లడించారు. iQOO 13 కాకుండా ఈ సిరీస్‌లో ప్రో వేరియంట్ కూడా ఉంటుందని  తెలిపారు. ప్రామాణిక మోడల్ 1.5K రిజల్యూషన్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ప్రో వేరియంట్ 2K రిజల్యూషన్‌తో కర్వ్‌డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ లాంచ్ గురించి టైమ్‌లైన్‌పై ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు. Qualcomm  కొత్త ప్రీమియం SoC ప్రారంభించబడిన అక్టోబర్ 2024 తర్వాత కొత్త స్మార్ట్‌ఫోన్లు తీసుకొచ్చే అవకాశం ఉంది.

Also Read: రూ.15వేలకే 11000mAh బ్యాటరీ, 64MP కెమెరా స్మార్ట్‌ఫోన్.. త్వరలో లాంచ్!

iQOO 12 స్మార్ట్‌ఫోన్‌ల గురించి మాట్లాడితే  iQOO 12 5Gలో ‘Qualcomm Snapdragon 8 Gen 3’ ప్రాసెసర్ ఉంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. iQOO 12 5G డ్యూయల్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలతో పాటు 64-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో వస్తుంది. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్.

Tags

Related News

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×