Big Stories

New Smartphone Launch: రూ.15వేలకే 11000mAh బ్యాటరీ, 64MP కెమెరా స్మార్ట్‌ఫోన్.. త్వరలో లాంచ్

Oukitel WP35 Mobile Launching Soon: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. కొత్త కొత్త కంపెనీలు మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయి. కొత్త ఫీచర్లతో ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త చైనీస్ టెక్ Oukitel తన కొత్త  ఫోన్ Oukitel WP35ని విడుదల చేసింది. కంపెనీ ఇందులో 5G కనెక్టివిటీని అందించింది. అంతే కాకుండా ఇందుతో 11000mAh పవర్ బిగ్ బ్యాటరీని ఉంది. Oukitel WP35 6.6-అంగుళాల 2.4K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ డిస్‌ప్లేపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌పై తీసుకొచ్చారు. దీన్ని డైమండ్ ఆకారంలో తీసుకొచ్చారు. దీని ధర, ఫీచర్ల తదితర విషయాలు తెలుసుకోండి.

- Advertisement -

Oukitel WP35 ధర
Oukitel WP35 ధర సుమారు రూ. 15,000గా ఉంటుంది. ఇది AliExpress నుండి కొనుగోలు చేయవచ్చు. మే 13 నుంచి సేల్ ప్రారంభం కానుంది. మే 13 నుండి 17 మధ్య కొనుగోలు చేస్తే ఫోన్‌పై అదనపు తగ్గింపు లభిస్తుందని కూడా లభిస్తుంది. మూడు కలర్ ఆప్షన్స్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అందులో గ్రే, కాఫీ, గ్రీన్ కలర్స్ ఉన్నాయి.

- Advertisement -

Also Read: ఐక్యూ నుంచి మూడు కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు అదుర్స్!

Oukitel WP35 స్పెసిఫికేషన్‌లు
Oukitel WP35 2.4K రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ డైమండ్ ఆకారంలో తీసుకొచ్చారు. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఉంటుంది. ఫోన్‌లో 6nm ప్రాసెసింగ్‌తో  5G MediaTek డైమెన్సిటీ చిప్‌సెట్ ఉంది. ఇందులో అల్ట్రాసేవ్ 3.0+ టెక్నాలజీని ఉపయోగించారు. ఫోన్‌లో 8 GB RAM ఉంది. దీనిని 24 GB వరకు విస్తరించవచ్చు. ఇది 256 GB స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాటరీకి సంబంధించి ఇది 60 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని ఇవ్వగలదని కంపెనీ వెల్లడించింది.

Also Read: పదివేల కన్నా తక్కువ ధరకే బెస్ట్ ఫోన్స్.. ఇటువంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు..!

Oukitel WP35 స్మార్ట్‌ఫోన్‌లో 64MP బ్యాక్ కెమెరా ఉంది. ఇది Sony IMX682 సెన్సార్‌తో కూడిన ఫోన్  ప్రాధమిక లెన్స్. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ నైట్ విజన్ కెమెరా కూడా అందించారు. సెల్ఫీల కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్ IP68, IP69K, MIL-STD-810H ధృవీకరణను పొందింది. ఇది శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఉపయోగించుకునేలా ఈ ఫోన్ రూపొందించామని కంపెనీ వెల్లడించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News