E-Paper
Advertisement

IPPB IT Executive 2024: ఐపీపీబీలో 54 ఐటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

IPPB IT Executive 2024: ఐపీపీబీలో 54 ఐటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
Advertisement

IPPB IT Executive 2024: ఇండియన్ పోస్టు పేమెంట్స్ బ్యాంకులో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుంది. 54 ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. ఈ మేరకు జీతం, ఖాళీలు, ఉద్యోగాల జాబితా, అడ్మిట్ కార్డుకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్లో పేర్కొంది.

ఐపీపీబీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 54 ఐటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) – 28, ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) – 21, ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) – 05 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు ఉద్యోగ స్థానాలను కూడా ఈ మేరకు ప్రకటించారు. చెన్నై, ఢిల్లీ, ముంబై, కేంద్రాలను నిర్ణయించారు. అయితే దేశ వ్యాప్తంగా పోస్టింగ్ ఎక్కడైనా ఇవ్వొచ్చని అంటున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

జీతభత్యాలు..

ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం జీతం నెలకు రూ. 83,300 చెల్లించనున్నట్లు ఐపీపీబీ పేర్కొంది.

Advertisement

Also Read: Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు.. పూర్తి వివరాలివే..

వయోపరిమితి..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 22 – 45 సంవత్సరాల మధ్య ఉండాలని స్పష్టం చేసింది.

విద్యా అర్హతలు..

బీఎస్సీ, బీఏ, బీటెక్, ఎంఎస్సీ, ఎంకమ్ చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

ఎంపిక విధానం..

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కనీసం 1 నుండి 6 సంవత్సరాల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Internship: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నీతి ఆయోగ్‌లో ఇంటర్న్‌షిప్ ఛాన్స్..

అప్లికేషన్ ఫీజు..

అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ. 750గా నిర్ణయించారను. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 150 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ..

మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×