Big Stories

Vivo V30e Sale Started: వివో ఫోటోల ఫోన్ సేల్ మొదలైంది.. అదిరిపోయే ఆఫర్లు!

Vivo V30e Sale Started: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివోకు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో వివోకు ఫ్యాన్స్ భారీగానే ఉంటారు. Vivo ఇటీవల భారతీయ వినియోగదారుల కోసం Vivo V30eని విడుదల చేసింది. ఈ డివైజ్ మే 2న భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌లో 5500mAh బ్యాటరీ, 8GB RAM, 50MP కెమెరా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్‌ను కంపెనీ సేల్‌కు తీసుకొచ్చింది. ఈ రోజు నుండి అంటే మే 9 నుండి ఈ ఫోన్‌ను కోనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫీచర్లు, ధర తదితర విషయాలను తెలుసుకోండి.

- Advertisement -

Vivo V30e ధర..

- Advertisement -

Vivo V30e అనేది V30 సిరీస్‌లో మూడవ స్మార్ట్‌ఫోన్. ఇది కెమెరా ఆధారిత స్మార్ట్‌ఫోన్. ఇందులో 2x ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ మోడ్‌ను అందించారు. Vivo V30e ధర రూ. 27,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.27,999గా నిర్ణయించారు. 8GB + 256GB వేరియంట్ ధర రూ.29,999గా ఉంచారు.

Also Read: రూ. 2వేల కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ ఇయర్‌బడ్స్.. బేస్ అదిరిపోద్ది!

Vivo V30e ఆఫర్లు..

Vivo V30e స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDFC, ICICI, SBI క్రెడిట్/ డెబిట్ కార్డ్ పూర్తి స్వైప్ లేదా EMI లావాదేవీలతో ఈ ఫోన్ కొనుగోలు చేయడం ద్వారా మీరు రూ. 3,000 వరకు ఆదా చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, వివో ఈస్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. Vivo V30e సిల్క్ బ్లూ, వెల్వెట్ రెడ్ రంగులలో అందుబాటులో ఉంది.

Vivo V30e స్పెసిఫికేషన్‌లు..

Vivo V30e స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలానే 1300నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. SGS తక్కువ ఫ్లికర్ సర్టిఫికేషన్, SGS తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో ఈ ఫోన్ లభిస్తుంది. ఫోన్‌లో Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ ఉంది. ఇది Adreno 710 GPU, 8GB RAM+ 256GB స్టోరేజ్.

Also Read: రూ.15వేలకే 11000mAh బ్యాటరీ, 64MP కెమెరా స్మార్ట్‌ఫోన్.. త్వరలో లాంచ్!

ఈ ఫోన్‌లో 50MP Sony IMX882 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన Auralight ఫ్లాష్ ఉన్నాయి. ముందు భాగంలో 50MP షూటర్ ఉంది. ఈ మొబైల్‌ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 44W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్-C పోర్ట్‌కు సపోర్ట్ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News