E-Paper
Advertisement

Indore Infosys Techie Killed: పార్కింగ్ ఏరియాలో కారుతో గుద్ది.. మహిళా టెక్కి ప్రాణాలు తీసిన ఉన్మాది!

Indore Infosys Techie Killed: పార్కింగ్ ఏరియాలో కారుతో గుద్ది.. మహిళా టెక్కి ప్రాణాలు తీసిన ఉన్మాది!
Advertisement

Indore Infosys Techie Killed: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో జరిగిన ఒక ఘోర దుర్ఘటనలో 38 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయారు. నివాస సముదాయం పార్కింగ్ ఏరియాలో అద్దె వివాదం కారణంగా ఒక వ్యక్తి తన కారుతో ఉద్దేశపూర్వకంగా తొక్కించడంతో ఈ ఘోరం జరిగింది. ఇన్‌ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్న శంపా పాఠక్ పాండే ఈ దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ ఘోరానికి మూలం ఒక పెెంట్‌హౌస్‌ను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ‘Airbnb’ ద్వారా అద్దెకు ఇవ్వడం. నిందితుడు మోహిత్ చౌదరి తండ్రి కుల్దీప్ చౌదరి తన పెెంట్‌హౌస్‌ను తరచుగా పర్యాటకులకు అద్దెకు ఇచ్చేవారు. అయితే, అర్థరాత్రి వేళల్లో కొత్త వ్యక్తులు రావడం, వారి వల్ల కలిగే ఆటంకాలపై అపార్ట్‌మెంట్ నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నివాసితులు సదరు పెెంట్‌హౌస్‌కు విద్యుత్ సరఫరా క‌ట్ చేశారు. దీనికి ప్రతిగా కుల్దీప్ చౌదరి ఇతర ఫ్లాట్లకు పవర్ కట్ చేశారు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది.

Advertisement

వివాదం ముదరడంతో కుల్దీప్ తన కుమారుడు మోహిత్ చౌదరిని అక్కడికి పిలిపించారు. మోహిత్ తన కారుతో అతివేగంగా వచ్చి పార్కింగ్ ఏరియాలో ఉన్న ప్రజలపైకి దూసుకెళ్లాడు. తొలుత ఒక పనిమనిషిని ఢీకొట్టాడు నిందితుడు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శంపా పాండేపైకి కారును పోనిచ్చాడు. నిందితుడు తనను కూడా చంపడానికి ప్రయత్నించాడని, తను తృటిలో తప్పించుకున్నానని శంపా భర్త సౌరభ్ పాండే పేర్కొన్నారు. కారు వేగానికి అది చివరకు గోడను ఢీకొట్టి ఆగిపోయిందని తెలిపారు.

ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. నిందితుడు మోహిత్ చౌదరితో పాటు అతని తండ్రి కుల్దీప్ చౌదరిని కూడా అరెస్ట్ చేశారు. నివాసితుల ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన పెెంట్‌హౌస్ వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయని గతంలో బిల్డర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా ఉండాల్సిన నివాస ప్రాంతాల్లో ఇటువంటి క్ష‌ణికావేషాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం ఇండోర్ వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Advertisement

Read Also: West Godavari Crime: ఇన్‌స్టా లవ్.. ప్రియుడి కోసం పారిపోయిన వివాహిత, వారిద్దరి జీవితాలు చివరకు

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×