E-Paper
Advertisement

30 Days Plans 2026: టెలికాం మోసాలకు చెక్.. 28 రోజులు కాకుండా.. పూర్తి నెల వచ్చే ప్లాన్స్ ఇవే!

30 Days Plans 2026: టెలికాం మోసాలకు చెక్.. 28 రోజులు కాకుండా.. పూర్తి నెల వచ్చే ప్లాన్స్ ఇవే!
Advertisement

30 Days Plans 2026: సాధారణంగా టెలికాం కంపెనీలు ఇచ్చే 28 రోజుల ప్లాన్‌ల వల్ల ఏడాదికి మనం 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల వినియోగదారుడు తనకు తెలియకుండానే ఒక నెల అదనపు రీఛార్జ్ ఖర్చును టెలి కంపెనీలకు చెల్లిస్తున్నారు. అయితే ఈ ఇబ్బంది లేకుండా, సరిగ్గా నెల రోజులు (30 రోజులు లేదా క్యాలెండర్ మంత్) వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్‌ల వివరాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) పూర్తి నెలకు అందిస్తున్న ప్లాన్స్, వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రిలయన్స్ జియో (Jio)

జియో తన వినియోగదారుల కోసం 30 రోజుల వ్యాలిడిటీతో ప్రత్యేక ప్లాన్‌లను అందిస్తోంది. రూ.319 ప్లాన్ ను మీరు ఏ తేదీన రీఛార్జ్ చేస్తే వచ్చే నెల అదే తేదీ వరకు ఇది పనిచేస్తుంది. ఇందులో రోజుకు 1.5 GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అలాగే రూ.355 ప్లాన్ కూడా సరిగ్గా 30 రోజుల వ్యాలిడిటీని ఇస్తుంది. ఇందులో మొత్తం 25 GB డేటా (డైలీ లిమిట్ లేదు) అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.

ఎయిర్‌టెల్ (Airtel)

Advertisement

ఎయిర్‌టెల్ కూడా వినియోగదారుల కోసం నెలవారీ ప్లాన్‌లను అందుబాటులో ఉంచింది. రూ.355 ప్లాన్ (30 రోజుల వ్యాలిడిటీ) రీఛార్జ్ చేసుకుంటే 25 GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. రూ.379 ప్లాన్ చేస్తే రోజుకు 2 GB డేటా, అపరిమిత కాల్స్ పొందొచ్చు. అధిక డేటా అవసరం ఉంటే 589 ప్లాన్ ట్రై చేయవచ్చు. ఇందులో 30 రోజుల కాలానికి 50 GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలు ఇస్తారు.

Also Read: BSNL Plans: చౌకైన కొత్త వార్షిక ప్లాన్స్.. ఏడాది పాటు రోజూ 2.5 GB, ఫ్రీ కాల్స్.. ఉచిత సబ్‌స్క్రిప్షన్లు!

వొడాఫోన్ ఐడియా (Vi)

Advertisement

వీఐ కూడా పోటీగా 30 రోజులపాటు పనిచేసే ప్లాన్‌లను అందిస్తోంది. రూ. 345 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 25 GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. రూ.379 ప్లాన్ తో రోజుకు 2GB చొప్పు 30 రోజుల పాటు పొందొచ్చు. అపరిమిత కాల్స్ సౌకర్యం కూడా ఉంటుంది. రూ.218 ప్లాన్ చేసుకుంటే 3GB డేటా, 30 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు.

Also Read: Gas Free Kitchen: గ్యాస్ లేకుండా వంట చేయడం ఎలా? ఇదేమి కష్టం కాదండోయ్.. చాలా ఈజీగా చేసేయోచ్చు!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×