Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) రేపటి నుంచి ప్రారంభం కానుంది. మరికొన్ని గంటల్లోనే షురూ కాబోతున్న ఈ మెగా టోర్నమెంట్ నేపథ్యంలో కావ్య పాప ( kavya maran) మెడకు మరో వివాదం చుట్టుకుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో కావ్య పాపను దేశ ద్రోహి అంటూ విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ( Sunrisers Hyderabad) సంబంధించిన షేర్లను పాకిస్తాన్ కు సంబంధించిన హబీబీ గ్రూప్ ( Pakistan Based Habibi Group) కొనుగోలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప పై విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కావ్య పాపను ఉద్దేశించి మళ్లీ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. దీనికి కారణం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన షేర్ల అమ్మకం. ఈ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన 35% షేర్లను పాకిస్తాన్ మూలాలు ఉన్న హబీబీ గ్రూప్ కొనుగోలు ( Pakistan Based Habibi Group) చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కావ్య మారన్ తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షేర్ల అమ్మకంపై కావ్య పాప నుంచి గాని లేదా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన యాజమాన్యం నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం తెగ ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప ది హండ్రెడ్ లీగ్ లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2.34 కోట్లకు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది కావ్య పాప. దీంతో కావ్య పాపను దేశద్రోహి అంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వివాదం సమస్య పోకముందే ఇప్పుడు పాకిస్తాన్ మూలాలు ఉన్న హబీబి గ్రూప్, సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH Shares) షేర్లను కొనుగోలు చేస్తుందని వార్తలు రావడం మరో కాంట్రవర్సీకి దారితీసింది. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి జూన్ మొదటి వారం వరకు అంటే దాదాపు 60 రోజులపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగనుంది. ఇక ఈ టోర్నమెంట్లో మొట్టమొదటి మ్యాచ్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తారు.
https://www.facebook.com/photo/?fbid=963393526601390&set=a.808612632079481