E-Paper
Advertisement

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!
Advertisement

Home Theater Setup: హాల్లో పెద్ద టీవీ, దద్దరిల్లే సౌండ్ సిస్టమ్, పక్కన వేడివేడి పాప్‌కార్న్.. ఇంట్లోనే సినిమా చూస్తూ ఎంజాయ్ చేసే కిక్కే వేరు. అయితే ఆ అనుభవాన్ని మరింత పెంచడానికి ఖరీదైన గ్యాడ్జెట్లు కొనాల్సిన పనేలేదు. మీ ఇంట్లో కనుక ఒక 3D ప్రింటర్ ఉంటే చాలు.. హోమ్ థియేటర్ లుక్‌ను పూర్తిగా మార్చేయవచ్చు. అదెలాగో ఈ చిన్న ట్రిక్స్ ద్వారా తెలుసుకోండి.

రిమోట్ల గోల వదలాలంటే.. హోల్డర్లు పక్కా:

టీవీ, సౌండ్‌బార్, ఫైర్‌టీవి.. ఇలా ఒకటేమిటి ఇంట్లో రిమోట్ల సంఖ్య ఎక్కువైపోతుంటుంది. సినిమా స్టార్ట్ అయ్యాక ఏ రిమోట్ ఎక్కడ ఉందో వెతికి తలపట్టుకోవడం కామన్. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి 3D ప్రింటర్‌తో ఒక చక్కటి రిమోట్ స్టాండ్ లేదా కేడీ ప్రింట్ చేసుకోండి. టేబుల్ మీద పెట్టుకునేలా లేదా గోడకు తగిలించుకునేలా మీకు నచ్చిన డిజైన్‌లో దీన్ని తయారు చేసుకోవచ్చు.

స్నాక్స్ కోసం స్పెషల్ బౌల్స్:

Advertisement

సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఒకటి నమలడం అలవాటే. పాప్‌కార్న్, చిప్స్ కోసం పదే పదే కిచెన్‌లోకి వెళ్లాల్సిన పనిలేకుండా.. డ్రింక్ హోల్డర్, స్నాక్స్ కంపార్ట్‌మెంట్స్ ఉన్న స్పెషల్ స్నాక్ బౌల్స్‌ను ప్రింట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అంతా కలిసి సినిమా చూసేటప్పుడు ఈ మల్టీపర్పస్ బౌల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి.

Also Read: బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

డిజిటల్ కాలంలోనూ డిస్కుల మానియా:

Advertisement

ఇప్పుడంతా ఓటీటీల హడావుడే అయినా.. చాలామందికి ఒరిజినల్ బ్లూ-రే, డీవీడీలను కలెక్ట్ చేసే హాబీ ఉంటుంది. వాటిని నీట్‌గా సర్దుకోవడానికి అందమైన డిస్క్ ర్యాక్స్, బాక్సులు 3D ప్రింటింగ్‌తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒరిజినల్ కేసులు పోయిన డిస్కులకు ఇవి పర్ఫెక్ట్ ఆప్షన్. దీనివల్ల షెల్ఫ్‌లో ప్లేస్ కూడా చాలా మిగులుతుంది.

ఫేవరెట్ హీరోల ప్రాప్స్‌తో కిరాక్ డెకరేషన్:

మార్వెల్, స్టార్ వార్స్ లేదా హ్యారీ పోటర్.. మీకు ఇష్టమైన సినిమా ఏదైనా సరీగ్గా ఆ ఫీల్ తేవడానికి ఖరీదైన మెమోరాబిలియా కొనాల్సిన అవసరం లేదు. ప్రసిద్ధ సినిమాలకు సంబంధించిన లోగోలు, మినీ ఫిగర్స్, సినిమా ప్రాప్స్‌ను 3D ప్రింట్ చేసి మీ షెల్ఫ్‌లో అమర్చండి. ఇవి మీ హోమ్ థియేటర్‌కు సూపర్ లుక్‌ను ఇస్తాయి.

జర్నీలోనూ సినిమా మజా:

ట్రావెల్ చేసేటప్పుడు మొబైల్ లేదా ట్యాబ్లెట్‌లో సినిమా చూడాలంటే చేతులు నొప్పులు పుట్టడం ఖాయం. అందుకే మీ ఫోన్ సైజుకు సరిపోయేలా ఒక పోర్టబుల్ స్టాండ్, ఇయర్‌బడ్స్ బాక్స్, కేబుల్ క్లిప్స్‌ను ప్రింట్ చేసుకోండి. ప్రింటబుల్స్, థింగివెర్స్‌ వంటి సైట్లలో ఇలాంటి ఉచిత మోడల్స్ బోలెడన్ని దొరుకుతాయి.

Also Read: ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

Tags

Related News

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×