E-Paper
Advertisement

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!
Advertisement

Ai+ Nova 2 Power: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వినియోగదారులను అట్రాక్ట్ చేయడానికి కంపెనీలు రోజుకో కొత్త మోడల్‌ను పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు అదే కోవలో ఏఐ+ (Ai+) సంస్థ మరో కొత్త ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా లైవ్‌లోకి వచ్చేసింది. లాంచ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ ఫోన్ గురించిన కీలక వివరాలు మాత్రం ఇప్పటికే బయటకు వచ్చాయి. ముఖ్యంగా రోజంతా ఫోన్ వాడే వారికి ఇది బాగా సెట్ అవుతుందని చెప్పవచ్చు.

ఈ Ai+ Nova 2 Power లుక్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. వెనక వైపు రౌండ్ షేప్‌లో ఉన్న కెమెరా మాడ్యూల్, అందులో రెండు పెద్ద సర్క్యూలర్ రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఫోన్ కింద భాగంలో ఏఐ+ బ్రాండింగ్ ఇచ్చారు. అంతేకాకుండా సైడ్‌లో ఉండే పవర్ బటన్‌కు ఇచ్చిన రెడ్ కలర్ హైలైట్ ఫోన్‌కు ట్రెండీ లుక్ ఇస్తోంది. ఇక కలర్ల విషయానికి వస్తే.. బ్లూ ఫ్యూజన్, బ్లూ గోల్డ్ ఫ్యూజన్, డీప్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్ అనే 5 రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.

Advertisement

Also Read: ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Ai+ Nova 2 Powerలో అసలు హైలైట్ ఏమిటంటే.. దీని బ్యాటరీనే. 7,000mAh కెపాసిటీ ఉన్న భారీ లిథియం-పాలిమర్ బ్యాటరీని ఇస్తున్నారు. దీనికి తోడు 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా ఫోన్‌ను వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Advertisement

ఇక పనితీరు విషయానికి వస్తే.. ఈ Ai+ Nova 2 Power మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌తో పనిచేయనుంది. ఇది కాకుండా కంపెనీ స్వయంగా రూపొందించిన nxtQ OS సాఫ్ట్‌వేర్‌పై ఇది రన్ అవుతుంది. దీనిలో ఏఐ ఫీచర్లు ఏముంటాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మెమరీ పరంగా చూసుకుంటే.. ఇది రెండు వేరియంట్లలో రానుంది. ఒకటి 6GB ర్యామ్‌తో 128GB స్టోరేజ్ కాగా.. మరొకటి 8GB ర్యామ్‌తో 128GB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన Nova 2 5G, Nova 2 Ultra 5G ఫోన్లు మార్కెట్లో మంచి స్పందనను రాబట్టాయి. వాటి ధరలు రూ.8,999 నుండి రూ.17,999 వరకు ఉన్నాయి. ఇప్పుడు రాబోతున్న నోవా 2 పవర్ ధర, కచ్చితమైన లాంచ్ తేదీ వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. మరి ఈ ఫోన్ మన మార్కెట్లో ఏ రేంజ్‌లో హిట్ అవుతుందో వేచి చూడాలి.

Also Read: రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

Tags

Related News

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×