E-Paper
Advertisement

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!
Advertisement

Phone Water Eject: అనుకోకుండా చేతిలో ఉన్న ఐఫోన్ జారి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయినా లేదంటే వర్షంలో తడిచినా వెంటనే ఫోన్ బయటకు తీసి తుడిచేస్తాం. కానీ అసలు టెన్షన్ అప్పుడే మొదలవుతుంది. స్పీకర్ నుంచి వచ్చే సౌండ్ ఒక్కసారిగా మారుతుంది. వాల్యూమ్ పెంచినా పెద్దగా మార్పు కనిపించదు. అప్పుడు స్పీకర్‌లో నీళ్లు చిక్కుకున్నాయని అర్థమవుతుంది. దీని కోసం సర్వీస్ సెంటర్‌కు పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఐఫోన్‌లోనే ఉపయోగించగల ఓ చిన్న షార్ట్‌కట్‌తో స్పీకర్‌లో దగ్గర చేరిన నీటిని బయటకు పంపే ప్రయత్నం చేయొచ్చు.

వాటర్ ఎజెక్ట్ ఎలా పనిచేస్తుంది?

వాటర్ ఎజెక్ట్ షార్ట్‌కట్ రన్ చేస్తే ఐఫోన్ ఒక ప్రత్యేకమైన లో-ఫ్రీక్వెన్సీ సౌండ్‌ను ప్లే చేస్తుంది. ఆ సౌండ్ వల్ల స్పీకర్‌లో వైబ్రేషన్ ఏర్పడి, రంధ్రాల్లో చిక్కుకున్న నీటి బిందువులను బయటకు నెట్టడంలో సహాయపడుతుంది. ఇది యాపిల్ వాచ్‌లోని వాటర్ ఎజెక్ట్ ఫీచర్‌ను పోలి ఉంటుంది. అయితే ఇది స్పీకర్ దగ్గరి నీటిని మాత్రమే తొలగించడానికి ఉపయోగపడుతుంది.

షార్ట్‌కట్‌ను ఎలా యాడ్ చేయాలి?

Advertisement

ఈ ఆప్షన్ ఐఫోన్‌లో ముందుగానే కనిపించదు. నమ్మకమైన సోర్స్ నుంచి వాటర్ ఎజెక్ట్ షార్ట్‌కట్‌ను తీసుకుని Shortcuts యాప్‌లో యాడ్ చేసుకోవాలి. Add Shortcutపై ట్యాప్ చేస్తే అది సేవ్ అవుతుంది. తెలియని లింకుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

Also Read: బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

నీటిని ఎలా బయటకు పంపాలి?

Advertisement

Shortcuts యాప్‌లో వాటర్ ఎజెక్ట్‌ను రన్ చేసి.. సౌండ్ ప్లే అయ్యే సమయంలో ఐఫోన్ స్పీకర్ కింది వైపు ఉండేలా పట్టుకోవాలి. సౌండ్ పూర్తయిన తర్వాత పాట లేదా వీడియో ప్లే చేసి స్పీకర్‌ను చెక్ చేయండి. సౌండ్ క్లియర్‌గా వస్తే నీరు బయటకు వచ్చినట్టే.

ఇలా మాత్రం చేయొద్దు:

హెయిర్ డ్రైయర్, హీటర్‌తో ఫోన్‌ను వేడి చేయకూడదు. కంప్రెస్డ్ ఎయిర్ కూడా వాడకూడదు. బియ్యంలో పెట్టడం కూడా సరైన పద్ధతి కాదు. ఇలా చేయడానికి బదులుగా గాలి బాగా తగిలే పొడి ప్రదేశంలో ఫోన్‌ను ఉంచడం మంచిది.

సర్వీస్ సెంటర్‌కు ఎప్పుడు వెళ్లాలి?

వాటర్ ఎజెక్ట్ కేవలం స్పీకర్ దగ్గరి చిన్న నీటి బిందువులకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఫోన్ పదేపదే ఆఫ్ అవడం,
ఛార్జింగ్ కాకపోవడం, డిస్‌ప్లేలో సమస్యలు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా యాపిల్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం మంచిది.

Also Read: Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

Tags

Related News

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×