Best fast charging power bank 2026: ఈ రోజుల్లో మన చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే అస్సలు గడవదు. ఆఫీస్ వర్క్, రీల్స్, గేమింగ్ అంటూ రోజంతా ఫోన్ వాడుతూనే ఉంటాం. అయితే ఎంత పెద్ద బ్యాటరీ ఉన్నా సరే.. అవసరమైన టైమ్‌కి ఛార్జింగ్ అయిపోవడం మన అందరికీ కామన్ ప్రాబ్లమ్. అందుకే.. ఒక పవర్‌ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ జేబులో ఉండటం చాలా అవసరం. టాప్ 5 ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం!
ఆన్‌లైన్ మార్కెట్లో బడ్జెట్ ధరలో మోస్ట్ ట్రస్టెడ్ పవర్ బ్యాంక్ ఏదైనా ఉందంటే అది Mi 3i మోడలే. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో ట్రిపుల్ అవుట్‌పుట్ పోర్ట్స్ ఉండటం వల్ల ఒకేసారి మూడు డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. దీని స్లిమ్ మెటాలిక్ డిజైన్ జేబులో ఈజీగా ఫిట్ అయిపోతుంది.
ధర: ఇది ఆన్‌లైన్‌లో కేవలం రూ.999 లోపే లభిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ వాల్యూ ఫోర్ మనీ కావాలనుకుంటే దీనికంటే మంచి ఆప్షన్ లేదు.
వైర్లతో ఇబ్బంది పడకుండా.. ఫోన్‌ని పవర్ బ్యాంక్ పైన పెట్టగానే ఛార్జ్ అవ్వాలి అనుకునే ట్రెండీ యూత్ కోసం Ambrane ఈ మోడల్ తెచ్చింది. ఇందులో 20W వైర్డ్ (PD) ఛార్జింగ్‌తో పాటు 10W Qi వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ , ఐఫోన్ రెండింటికీ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ట్రావెలింగ్‌లో లేదా బైక్ రైడింగ్‌లో వైర్లెస్ ఫీచర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది.
ధర: ఆన్‌లైన్ ఆఫర్లలో ఇది సుమారుగా రూ.1,799 ధరలో అందుబాటులో ఉంది.
మీరు తరచూ లాంగ్ జర్నీలు చేసేవారైతే.. లేదా మీ ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్ కూడా ఛార్జ్ చేయాలనుకుంటే 20000mAh కెపాసిటీ ఉండాల్సిందే. ఈ పవర్ బ్యాంక్ ఏకంగా 45W టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో మ్యాక్‌బుక్ లేదా అల్ట్రాబుక్ ల్యాప్‌టాప్స్‌ను కూడా ఈజీగా ఛార్జ్ చేయవచ్చు. ఒకసారి దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే మీ ఫోన్‌ని 4 నుంచి 5 సార్లు హ్యాపీగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ధర: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఇది రూ.2,799 ధరలో దొరుకుతుంది.
ప్రీమియం లుక్, అల్ట్రా సేఫ్టీ కోరుకునే వారికి గ్లోబల్ బ్రాండ్ అయిన Anker బెస్ట్ ఛాయిస్. ముఖ్యంగా ఐఫోన్ యూజర్లు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇందులో 20W USB-C పవర్ డెలివరీ (PD) టెక్నాలజీ ఉంది. ఇది ఐఫోన్‌ను కేవలం 30 నిమిషాల్లో 0 నుండి 50% కి ఛార్జ్ చేస్తుంది. దీని మందం కేవలం 13mm మాత్రమే.. అంటే మీ ఐఫోన్ కంటే చాలా స్లిమ్‌గా ఉంటుంది.
ధర: దీని క్వాలిటీకి తగ్గట్లే ధర కాస్త ఎక్కువ. ఆన్‌లైన్‌లో ఇది రూ.2,499 కి లభిస్తుంది.
Also Read: ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? ఈ 5 సేఫ్టీ టిప్స్ తెలియకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పవర్ బ్యాంక్ తెచ్చుకుని, కేబుల్ మర్చిపోయాం అనే టెన్షన్ పడేవాళ్ల కోసం పోర్ట్రోనిక్స్ ఒక క్రేజీ డిజైన్‌తో వచ్చింది. ఇందులో 22.5W మాక్స్ అవుట్‌పుట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులోనే ఇన్‌బిల్ట్ టైప్-సి కేబుల్ వస్తుంది. కాబట్టి మీరు విడిగా కేబుల్స్ మోయాల్సిన అవసరం లేదు. దీని డిజిటల్ డిస్‌ప్లే బ్యాటరీ ఎంత పర్సంటేజ్ ఉందో క్లియర్‌గా చూపిస్తుంది.
ధర: ఆన్‌లైన్‌లో ఇది ఫుల్ డిస్కౌంట్‌తో కేవలం రూ.949 కే దొరుకుతోంది.
పవర్ బ్యాంక్ అనేది ఇప్పుడు లగ్జరీ కాదు, ఒక నిత్యావసరం. మీ బడ్జెట్ రూ.1000 లోపు ఉంటే Mi 3i లేదా Portronics, కాస్త ప్రీమియం లుక్, వైర్లెస్ కావాలంటే Ambrane / Anker, అదే హెవీ యూసేజ్ ఉంటే Mi 20000mAh Pro ని సెలెక్ట్ చేసుకోండి. ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో బ్యాంక్ ఆఫర్స్ వాడితే ఇవి మీకు ఇంకా తక్కువ ధరకే వచ్చే ఛాన్స్ ఉంది. ఆలస్యం చేయకుండా మీ నెక్స్ట్ ట్రిప్ కోసం బెస్ట్ పవర్ బ్యాంక్‌ని ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.