E-Paper
Advertisement

AC Mistakes: ఇంట్లో ఏసీ ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే ఏ క్షణమైనా..!

AC Mistakes: ఇంట్లో ఏసీ ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే ఏ క్షణమైనా..!
Advertisement

AC Mistakes: తీవ్రమైన ఎండల నుంచి ఏసీలు ఉపశమనం కల్పిస్తాయి. ప్రస్తుతం చాలా మంది ఏసీలను కొనుగోలు చేస్తూ.. మధ్యాహ్న సమయంలో ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాత్రిళ్లు సైతం ఏసీ ఆన్ చేసుకొని హాయిగా నిద్రిస్తున్నారు. అయితే ఏసీ వాడే సమయంలో సాధారణంగా చేసే 5 పొరపాట్లు.. దాని మన్నికను దెబ్బతీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల అనుకోని ఖర్చులు సంభవించి.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ 5 పొరపాట్లు ఏవి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

టెంపరేచర్ తగ్గించడం

చాలామంది ఇల్లు త్వరగా చల్లబడాలని ఏసీ టెంపరేచర్‌ను 16 – 18 డిగ్రీ వద్ద ఉంచుతారు. అయితే ఏసీని ఎంత తక్కువలో పెట్టినా గదిని ఒకే వేగంతో చల్లబరుస్తుంది. బయట 40 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు.. 16°C కి చేరుకోవడానికి కంప్రెసర్ నిరంతరం కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల కంప్రెసర్ త్వరగా వేడెక్కి మొరాయించే ప్రమాదం ఉంది. కాబట్టి 24°C నుండి 26°C మధ్య ఉష్ణోగ్రతను సెట్ చేయడం బెస్ట్.

జల్లెడ కిటికీలు మూసివేయడం

Advertisement

కొంతమంది వాడకంలో లేని గదులకు ఏసీ గాలి వెళ్లకుండా వెంట్ (గోడకు ఉండే జల్లెడ లాంటి కిటికీలు)లను పూర్తిగా మూసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల డక్ట్ (Duct) వ్యవస్థలో గాలి ఒత్తిడి పెరిగి బ్లోయర్ ఫ్యాన్, ఏసీలోని ఇతర భాగాలపై భారం పడుతుంది. ఇది ఏసీ సామర్థ్యాన్ని తగ్గించి విద్యుత్ బిల్లును పెంచుతుంది. కాబట్టి అన్ని గదుల వెంట్లు తెరిచి ఉంచడం వల్ల గాలి ప్రసరణ సమానంగా జరిగి ఏసీపై ఒత్తిడి తగ్గుతుంది.

ఎయిర్ ఫిల్టర్ల నిర్లక్ష్యం

ఎండాకాలంలో ఏసీలను సహజంగానే ఎక్కువ సమయం రన్నింగ్ లో ఉంచుతారు. దీనివల్ల ఫిల్టర్లలో దుమ్ము త్వరగా చేరుతుంది. దుమ్ము నిండిన ఫిల్టర్ల వల్ల గాలి ప్రవాహం తగ్గి.. ఇండోర్ యూనిట్‌లోని ‘ఎవాపరేటర్ కాయిల్స్’ గడ్డకట్టే (Freeze) అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో కనీసం రెండు వారాలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అవుట్‌డోర్ యూనిట్‌పై కన్నేయండి

Advertisement

సాధారణంగా ఇంటి వెలుపల ఉండే అవుట్ డోర్ యూనిట్.. గదిలోని వేడి గాలిని బయటకు పంపిస్తుంది. ఒకవేళ అవుట్ డోర్ యూనిట్ చుట్టూ చెత్తాచెదారం, మొక్కలు, ఇతర వస్తువులు ఉంటే వేడి సరిగ్గా బయటకు వెళ్లదు. దీనివల్ల కంప్రెసర్ ఓవర్‌హీట్ అయ్యి ఆగిపోయే ప్రమాదముంది. కాబట్టి అవుట్ డోర్ యూనిట్ చుట్టూ కనీసం 2 అడుగుల మేర శుభ్రంగా ఉండేలా చూసుకోండి.

Also Read: Airtel IPL Plans: ఎయిర్‌టెల్ ధమాకా ప్లాన్స్.. ఫ్రీ హాట్‌స్టార్, నాన్ స్టాప్ 5G డేటా.. ఐపీఎల్ లవర్స్‌కు మాస్ జాతరే!

సర్వీసింగ్‌ను వాయిదా

సాధారణంగా చాలా మంది ఏసీ నుంచి వేడి గాలి వచ్చేంత వరకూ సర్వీసింగ్ అన్న ఊసే ఎత్తరు. ఇది ఏమాత్రం సరైనది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏసీల్లో గ్యాస్ లీకేజీలు, చిన్న చిన్న ఎలక్ట్రికల్ సమస్యలు ఉంటే అవి పెద్ద సమస్యలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఎండలో పని చేసే క్రమంలో అవి ఏ క్షణమైనా చెడిపోవచ్చని సూచిస్తున్నారు. కాబట్టి వేసవి ప్రారంభంలో, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు ఒకసారి సర్వీసింగ్ చేయించడం ఉత్తమమని సూచిస్తున్నారు.

Also Read: Crime Training: రూ.2 లక్షలు చెల్లిస్తే.. దొంగతనానికి ట్రైనింగ్ ఇస్తారట.. కోర్సు పూర్తైతే రూ.5 లక్షల జీతం!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×