E-Paper
Advertisement

Airtel IPL Plans: ఎయిర్‌టెల్ ధమాకా ప్లాన్స్.. ఫ్రీ హాట్‌స్టార్, నాన్ స్టాప్ 5G డేటా.. ఐపీఎల్ లవర్స్‌కు మాస్ జాతరే!

Airtel IPL Plans: ఎయిర్‌టెల్ ధమాకా ప్లాన్స్.. ఫ్రీ హాట్‌స్టార్, నాన్ స్టాప్ 5G డేటా.. ఐపీఎల్ లవర్స్‌కు మాస్ జాతరే!
Advertisement

Airtel IPL Plans: ఐపీఎల్ – 2026 సీజన్ అద్భుతంగా సాగుతున్న తెలిసిందే. సాయంత్రం అయ్యిందంటే క్రికెట్ లవర్స్ టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లోనూ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వస్తుండటంతో ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్ టెల్.. తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ ధమాకా ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా ఉచిత హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ తో పాటు మ్యాచ్ వీక్షించడానికి అవసరైన అధిక డేటాను సైతం అందిస్తోంది. ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తున్న ఐపీఎల్ ప్లాన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

రూ.449 ప్లాన్

ఈ ప్లాన్ ను ఐపీఎల్ 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. రోజుకు 3GB డేటా యూజర్ కు లభిస్తుంది. అలాగే 28 రోజుల పాటు జియో హాట్ స్టార్ ను ఉచితంగా వీక్షించవచ్చు. 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న చోట అపరిమిత డేటాను వాడుకోవచ్చని ఎయిర్ టెల్ వర్గాలు తెలిపాయి.

రూ.549 ప్లాన్

Advertisement

ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. రోజుకు 3GB డేటా, 5G అందుబాటులో ఉన్న చోట అపరిమిత డేటాను యూజర్ వాడుకోవచ్చు. అలాగే 3 నెలలపాటు ఉచిత జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.

రూ.1,029 ప్లాన్

అధిక వ్యాలిడిటీ కోరుకునేవారు దీనిని పరిశీలించవచ్చు. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. రోజుకు 2GB డేటాతో పాటు 3 నెలల పాటు జియో హాట్ స్టార్ ను ఉచితంగా వీక్షించవచ్చు.

Advertisement

Also Read: Crime Training: రూ.2 లక్షలు చెల్లిస్తే.. దొంగతనానికి ట్రైనింగ్ ఇస్తారట.. కోర్సు పూర్తైతే రూ.5 లక్షల జీతం!

రూ.3,999 ప్లాన్

ఏడాది పాటు అందుబాటులో ఉన్న ప్లాన్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో ప్రతీ రోజూ 2.5 GB డేటాను యూజర్ కు అందిస్తుంది. అలాగే ఏడాదిపాటు ఉచిత హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చు.

Also Read: BLDC Fans: తక్కువ బడ్జెట్లో.. అత్యాధునిక బ్రాండెడ్ ఫ్యాన్లు.. ఇంట్లో తుఫాన్లు సృష్టించొచ్చు!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×