E-Paper
Advertisement

ఫ్రిడ్జ్ తెరవగానే బ్యాడ్ స్మెల్ వస్తోందా? ఈ 5 సింపుల్ ట్రిక్స్‌తో.. చెక్ పెట్టండి!

ఫ్రిడ్జ్ తెరవగానే బ్యాడ్ స్మెల్ వస్తోందా? ఈ 5 సింపుల్ ట్రిక్స్‌తో.. చెక్ పెట్టండి!
Advertisement

Fridge Smell: ప్రస్తుత రోజుల్లో ఫ్రిడ్జ్ అనేది అతి ముఖ్యమైన వస్తువుగా వంటగదిలో మారిపోయింది. కూరగాయలు, పాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలను తాజాగా ఉంచడానికి ఫ్రిడ్జ్ ఎంతగానో తోడ్పాటు అందిస్తోంది. అయితే కొన్నిసార్లు ఫ్రిడ్జ్ తెరవగానే ఒక రకమైన కుళ్లిన వాసన లేదా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఇది ఫ్రిడ్జ్ లోని ఇతర ఆహార పదార్థాలకు కూడా చేరి అవి త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు ఫ్రిడ్జ్ ను సువాసనభరితంగా మార్చే 5 సులువైన చిట్కాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిని పాటిస్తే ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కుళ్లిన పదార్థాల తొలగింపు

ఫ్రిడ్జ్ ను వారానికి ఒకసారి తప్పనిసరిగా టాప్ టూ బాటమ్ చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వారం ప్రారంభంలో పెట్టిన కూరగాయలు కుళ్లిపోయినా.. పాత ఆహార పదార్థాలు బూజు పట్టినా వెంటనే వాటిని డస్ట్‌బిన్‌లో పడేయాలని సూచిస్తున్నారు. అలా చేస్తే ఫ్రిడ్జ్ లోని బ్యాడ్ స్మెల్ తొలగిపోయి.. ఫ్రెష్ గా ఉంటుందని తెలియజేస్తున్నారు.

బేకింగ్ సోడా మ్యాజిక్

Advertisement

ఫ్రిడ్జ్ లో వచ్చే ఎలాంటి దుర్వాసననైనా పీల్చుకోవడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా లేదా వంట సోడా వేసి, దాన్ని ఫ్రిడ్జ్ లోపల ఒక మూలన పెట్టాలని హితవు పలుకుతున్నారు. అలా చేస్తే ఫ్రిడ్జ్ లోని తేమను, బ్యాడ్ స్మెల్‌ను అది లాగేస్తుందని స్పష్టం చేస్తున్నారు.

నిమ్మకాయ రెమెడీ

ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్ షెల్ఫ్ లలో ఉంచితే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. నిమ్మకాయలో ఉండే సిట్రస్ గుణాలు చెడు వాసనను దూరం చేసి, ఫ్రిడ్జ్ తెరవగానే మంచి తాజాదనాన్ని ఇస్తాయని తెలియజేస్తున్నారు. అలాగే కాస్త కాఫీ పొడిని ఒక చిన్న ప్లేట్‌లో వేసి ఫ్రిడ్జ్ లో ఉంచినా మంచి సువాసన వస్తుందని సలహా ఇస్తున్నారు.

ఎయిర్ టైట్ కంటైనర్లు

Advertisement

మిగిలిపోయిన కూరలు, నాన్ వెజ్ పదార్థాలు, ఉల్లిపాయలు లాంటివి ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు ఎల్లప్పుడూ మూత గట్టిగా ఉన్న ఎయిర్ టైట్ బాక్సుల్లోనే పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే వాటి వాసన ఫ్రిడ్జ్ అంతా వ్యాపించి.. పాలు లేదా నీళ్ల బాటిళ్లకు కూడా ఆ వాసన అంటుకుంటుందని పేర్కొంటున్నారు.

Also Read: పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం.. శరీరంపై బుల్లెట్ల వర్షం!

రెగ్యులర్ క్లీనింగ్ ముఖ్యం

కనీసం నెలకు రెండు సార్లు ఫ్రిడ్జ్ లోపలి భాగాలను శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా వెనిగర్ లేదా లిక్విడ్ సోప్ కలిపి మెత్తటి గుడ్డతో షెల్ఫ్‌లను తుడవాలని హితవు పలుకుతున్నారు. అలా చేస్తే షెల్ఫ్ లో పై పడ్డ ఆహార మరకల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: 300 ఏళ్లుగా సూపర్ సక్సెస్.. కేరళ ‘కావి’ ఫ్లోరింగ్‌తో.. ఇల్లు ఎప్పుడూ కూలే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×