E-Paper
Advertisement

పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం.. శరీరంపై బుల్లెట్ల వర్షం!

పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం.. శరీరంపై బుల్లెట్ల వర్షం!
Advertisement

Hamza Burhan: పుల్వామా దాడి మాస్టర్ మైండ్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న హమ్జా బుర్హాన్ ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. బుర్హాన్ కారులో ఉండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు నిందితులు.. తుపాకులతో పలుమార్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. కాగా పుల్వామా దాడి అనంతరం 2022లో బుర్హాన్ ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. అప్పటి నుంచి అతడు భారత భద్రతా దళాలు మెస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు.

2022లో బుర్హాన్ ను ఉగ్రవాదిగా అధికారికంగా ప్రకటిస్తూ ఆ ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని ఖర్బత్ పోరాలోని రత్నిపోరాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తిగా అతడ్ని పేర్కొంది. అతడి పూర్తి పేరు అర్జుమంద్ గుల్జార్ దార్ అలియాస్ హమ్జా బుర్హాన్ గా తెలియజేసింది. పాక్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘అల్ బదర్’ అనుబంధ సభ్యుల్లో బుర్హాన్ కూడా ఒకరని తెలియజేసింది.

Advertisement

Also Read: 300 ఏళ్లుగా సూపర్ సక్సెస్.. కేరళ ‘కావి’ ఫ్లోరింగ్‌తో.. ఇల్లు ఎప్పుడూ కూలే!

Advertisement

ఇదిలా ఉంటే 2019 జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా లేత్ పోరా వద్ద జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీ పేలుడు సంభవించింది. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను.. జైషే మెుహమ్మద్ ఉగ్రవాది ఆదీల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో వచ్చి బలంగా ఢీకొట్టాడు. దీంతో భారీ ఎత్తున పేలుళ్లు జరిగి 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు విడిచారు.

Also Read: ఏసీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ WHO ఫార్ములాతో.. 70% కరెంటు బిల్లు ఆదా!

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×