E-Paper
Advertisement

5 Star vs Inverter AC: మీకూ ఇదే డౌటా.. రెండిట్లో ఏది బెటరో.. పిచ్చక్లారిటీతో తెలుసుకోండి మచ్చా!

5 Star vs Inverter AC: మీకూ ఇదే డౌటా.. రెండిట్లో ఏది బెటరో.. పిచ్చక్లారిటీతో తెలుసుకోండి మచ్చా!
Advertisement

5 Star vs Inverter AC: ఏసీలను వినియోగించే వారిని ప్రధానంగా వెంటాడే సమస్యల్లో విద్యుత్ బిల్లు ఒకటి. ముఖ్యంగా సమ్మర్ లో ఏసీ వాడకం అధికంగా ఉంటుంది కాబట్టి.. పవర్ బిల్లు తడిసి మోపెడు అవుతోందని వినియోగదారులు వాపోతున్నారు. అయితే విద్యుత్ ను ఆదా చేసే ఏసీలు ప్రస్తుతం మార్కెట్లో చాలానే ఉన్నాయి. 5 స్టార్ ఏసీ, ఇన్వర్టర్ ఏసీలు రెండూ విద్యుత్ ను ఆదా చేస్తాయన్న పేరుంది. అయితే రెండింటిలో ఏది సమర్థవంతంగా విద్యుత్ ను పొదుపు చేస్తుందన్న సందేహంలో చాలా మందిలో ఉంది. దీంతో రెండింట్లో ఏది కొనాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసలు 5 స్టార్ ఏసీ, ఇన్వర్టర్ ఏసీకి మధ్య తేడా ఏంటీ? విద్యుత్ పొదుపునకు ఏది బెస్ట్? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అసలు 5 స్టార్ ఏసీ అంటే ఏమిటి?

సాధారణంగా ఏసీల సామర్థ్యాన్ని ‘స్టార్ రేటింగ్’ (BEE Star Rating)తో కొలుస్తుంటారు. ఒక ఏసీకి ఎన్ని ఎక్కువ స్టార్లు ఉంటే అది అంత తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటుందని అర్థం. ప్రస్తుతం మార్కెట్లో 5 స్టార్ ఏసీ.. విద్యుత్ ఆదాకు బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. ఇది 3 స్టార్ లేదా అంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న ఏసీలతో పోలిస్తే చాలా తక్కువ కరెంటును వాడుకుని.. గదిని చాలా త్వరగా చల్లబరుస్తుంది.

మరి ఇన్వర్టర్ ఏసీ అంటే?

Advertisement

సాధారణ (Non-Inverter) ఏసీలలో కంప్రెసర్ కేవలం ‘ఆన్’ లేదా ‘ఆఫ్’ మోడ్‌లో మాత్రమే పనిచేస్తుంది. కానీ ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ వేగం గది ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ ఆగిపోకుండా తక్కువ వేగంతో తిరుగుతూ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. దీనివల్ల కంప్రెసర్ మాటిమాటికీ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది.

ఏది ఎక్కువ విద్యుత్తును ఆదా చేస్తుంది?

విద్యుత్ ఆదా విషయంలో 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ అన్నింటికంటే బెస్ట్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 5-స్టార్ రేటింగ్ ఏసీ.. ప్రాథమిక విద్యుత్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. మరోవైపు ఇన్వర్టర్ టెక్నాలజీ.. ఏసీ కంప్రెసర్ పనితీరును నియంత్రించడం ద్వారా అదనంగా 30-50 శాతం వరకూ కరెంటును ఆదా చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో ఇవి రెండూ కలగలిసిన 5స్టార్ ఇన్వర్టర్ ఏసీలు లభిస్తున్నాయి. దానిని కొనుగోలు చేయడం వల్ల నెలవారీ కరెంటు బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Advertisement

Also Read: ఏసీ, కూలర్ కాంబినేషన్.. ఒక్కసారి రెండూ ఆన్ చేసి చూడండి.. ఆ తర్వాత జరిగేది అస్సలు నమ్మలేరు!

ఫైనల్‌గా ఏది కొంటే బెటర్?

ఒకవేళ మీరు రోజుకు 5-6 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీని ఉపయోగిస్తుంటే.. 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీని కొనుగోలు చేయడం బెస్ట్. దీని ధర మార్కెట్లో కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. కరెంటు బిల్లు రూపంలో ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తుంది. అలాకాకుండా ఏసీతో చాలా తక్కువ అవసరం ఉండి.. రోజుకు 1-2 గంటలు, అతిథులు వచ్చినప్పుడు మాత్రమే వాడతాం అని భావిస్తే.. 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ సరిపోతుంది.

Also Read: Telangana Politics: బీఆర్ఎస్ పార్టీ పాతికేళ్ల ప్రస్థానం.. రానున్న రోజుల్లో అనేక సవాళ్లు

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×