E-Paper
Advertisement

Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసు కొత్త మలుపు.. ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాను, కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసు కొత్త మలుపు.. ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాను, కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
Advertisement

Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసు మరొక మలుపు తిరిగింది. ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు విచారణకు ఢిల్లీ హైకోర్టుకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జడ్జి స్వరణ కాంత శర్మకు ఆయన ఓ లేఖ రాయడం కలకలం రేగింది.

ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో కీలక మలుపు

Advertisement

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసు విచారణ కోసం సోమవారం ఢిల్లీ హైకోర్టులో మాజీ సీఎం కేజ్రీవాల్ హాజరు కావాల్సివుంది. ఈ నేపథ్యంలో ఆయన, వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ కోర్టుకు హాజరు కావడానికి నిరాకరించారు. ఈ మేరకు న్యాయమూర్తి స్వరణ కాంత శర్మకు లేఖ రాశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు.

హైకోర్టులో న్యాయం జరుగుతుందనే ఆశ తనకు లేదన్నారు. అందుకే గాంధీ సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట దీక్ష చేస్తానని మనసులోని మాట వెల్లడించారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Advertisement

ఆ న్యాయమూర్తి ముందు హాజరుకాను.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

ఈ కేసులో న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తానన్నారు. లైఫ్‌లో గెలుపు ఓటములతో సంబంధం లేని కొన్నిక్షణాలు ఉంటాయని, అలాంటి సమయంలో ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ప్రస్తుతం తాను ఆ దశలో ఉన్నానని, తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. చివరికి సత్యమే గెలిచిందని, న్యాయస్థానం తనను నిర్దోషిగా పేర్కొందన్నారు. సత్య మార్గం ఎప్పుడూ సులభం కాదని మనసులోని మాట బయటపెట్టారు. ఆ కేసు తీర్పు సీబీఐ జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందుకు వచ్చిందని, కేసు విచారణ నిష్పక్షపాతంగా, తటస్థంగా జరుగుతుందనే నమ్మకం లేదన్నారు.

ALSO READ: లాకప్‌లో ఆత్మహత్యలకు చెక్.. ముంబై పోలీసుల కొత్త డ్రెస్ కోడ్!

జడ్జి స్వరణ కాంత శర్మపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, ఆమెపై విశ్వాసం లేదన్నారు. అందుకు కారణాలు కూడా ప్రస్తావించారు. బీజేపీ అనుబంధ కార్యక్రమాలకు ఆమె వెళ్లడమేనని అన్నారు. ఆమె ముందు విచారణకు హాజరు కాలేనని తేల్చి చెప్పారు.

ఢిల్లీ మద్యం కేసులో న్యాయమూర్తి జడ్జి స్వరణ కాంత శర్మ ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కేజ్రీవాల్‌ ఓ పిటిషన్‌ దాఖలు చేశారు కూడా. అయితే ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణకు హాజరుకావడానికి ఆయన ససేమిరా అన్నారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×