Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ మెుదటి సంవత్సరం చదువుతున్న వినీశ్ అనే విద్యార్థి, ప్రేమ వ్యవహార కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
మహాబూబాబాద్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన వినీశ్, క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ సమీపంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఒక్కసారిగా తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడంతో బాధితుడు హాహాకారాలు చేయడం చూసిన స్థానికులు, తోటి విర్యార్ధులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తీవ్రంగా గాయపడిన వినీశ్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వైద్యుల సమాచారం ప్రకారం.. వినీశ్ శరీరంలో సుమారు 70 శాతం మేర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఐసీయూలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో భాగంగా, ప్రేమ వ్యవహారమే ఈ కఠిన నిర్ణయానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read:రాష్ట్రంలో ఫ్రీగా లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
లేడీస్ హాస్టల్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని
నిప్పంటించుకున్న మైనింగ్ ఇంజినీరింగ్ విద్యార్థి వనీశ్బాధితుడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన
మొదటి సంవత్సరం విద్యార్థిగా గుర్తింపు70 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో… pic.twitter.com/A7aMe4zfKa
— BIG TV Breaking News (@bigtvtelugu) April 27, 2026