E-Paper
Advertisement

Playstation Games Discount: పాపులర్ ప్లే స్టేషన్ గేమ్స్‌పై 50 శాతం తగ్గింపు.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే

Playstation Games Discount: పాపులర్ ప్లే స్టేషన్ గేమ్స్‌పై 50 శాతం తగ్గింపు.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే
Advertisement

Playstation Games Discount| ఇండియాలో ప్లేస్టేషన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. ఈ సూపర్ సేల్‌లో ప్లే స్టేషన్ PS5 కన్సోల్స్, కంట్రోలర్లతో పాటు అనేక పాపులర్ గేమ్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో కొత్తగా రిలీజ్ అయిన గేమ్స్ కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. బ్లాక్ ఫ్రై డే సేల్‌లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ గేమ్స్ గురించి చూద్దాం.

EA స్పోర్ట్స్ FC 26

ఈ ఫుట్ బాల్ గేమ్ EA స్పోర్ట్స్ రూపొందించింది. ఈ కొత్త వెర్షన్‌లో పాత వెర్షన్ కంటే చాలా మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో తాజాగా పాపులర్ ప్లేయర్ జ్లాటన్ ఇబ్రహిమోవిక్ కూడా ఉన్నాడు. ఇందులో ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే మీరు మీ బెస్ట్ టీమ్‌ని మీ ఇష్టానుసారంగా నిర్మించుకోవచ్చు. మీ ఫేవరెట్ ప్లేయర్లతో బలమైన టీమ్‌ని రెడీ చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర ప్లే స్టేషన్ ప్లేయర్లతో లేదా మిత్రులతో ఆడవచ్చు. వివిధ లీగ్ల ఆధారంగా మీకు నచ్చిన ఫిక్స్చర్లను ఆస్వాదించండి. దీని ధర రూ. 4,999కి ఇప్పుడు సేల్‌లో రూ. 2,499 మాత్రమే ఉంది.

మార్వెల్ స్పైడర్-మ్యాన్ 2

Advertisement

ఈ గేమ్‌లో పీటర్ పార్కర్, మైల్స్ మొరాలెస్ ఇద్దరూ కలిసి డబుల్ స్పైడర్ అడ్వెంచర్స్ రైడ్ చూపిస్తారు. న్యూయార్క్ నగరంలో అనేక టెక్ గాడ్జెట్లతో అన్వేషిస్తారు. లిజార్డ్, క్రేవెన్ ది హంటర్, వెనమ్ వంటి సూపర్ విలన్లతో పోరాడతూ మీనే ఈ థ్రిల్లింగ్ గేమ్‌ని ఆడాలి. ఈ గేమ్ అసలు ధర రూ. 4,999 కానీ ఇప్పుడు తగ్గింపుతో రూ. 2,499 ధరకే అందుబాటులో ఉంది.

మెటల్ గేర్ సాలిడ్: స్నేక్ ఈటర్

ఈ అద్భుత గేమ్ కొనామి కంపెనీ రూపొందించింది. ఈ గేమ్‌లో స్నేక్ అనే స్పెషల్ ఏజెంట్ సోవియట్ యూనియన్ అడవుల్లోకి పంపబడతాడు. ఒక రాకెట్ సైంటిస్ట్‌ని రక్షించడం, షాగోహోడ్ అనే సూపర్ వెపన్‌ని నాశనం చేయడం అతని ప్రధాన టార్గెట్. ఈ గేమ్ ధర రూ. 4,799కి కానీ ఇప్పుడు రూ. 3,359 కే లభిస్తోంది.

డెత్ స్ట్రాండింగ్ 2

Advertisement

ఈ గేమ్ సామ్ కథను ముందుకు తీసుకువెళ్తుంది. మానవాళి వినాశనం నుండి రక్షించడానికి అతను ఒక కొత్త ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇందులో ఊహకు అందని శత్రువులు, ఎన్నో టిస్టులు ఉన్నాయి. అసలు ధర రూ. 4,999 బదులుగా రూ. 3,749.

అసాసిన్స్ క్రీడ్ షాడోస్

ఈ గేమ్‌లో నింజా ఫైటర్లు, అసాసిన్ల ప్రపంచాన్ని సజీవంగా చిత్రించబడింది. ఈ గేమ్ లో మీరు ప్లేయర్‌గా అందమైన, ప్రమాదకరమైన స్థలాలను అన్వేషిస్తారు. క్లోజ్ కాంబాట్ స్టెల్త్ కిల్లింగ్ వంటి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు. అసాసిన్స్ క్రీడ్ షాడోస్ ధర రూ. 5,599 కానీ ఆఫర్ ధర రూ. 3,359.

ఇప్పుడే కొనండి.. బెస్ట్ టైమ్

ఈ డిస్కౌంట్ల ఆఫర్లు కొంత సమయం మాత్రమే అందుబాటులో ఉంటాయి. అన్ని గేమ్స్ ప్రీమియం క్వాలిటీలో ఉండి, వివిధ జాన్ర్లను కవర్ చేస్తాయి. స్పోర్ట్స్, అడ్వెంచర్, యాక్షన్ వంటి వివిధ రకాల గేమ్స్‌ను ఎంచుకోవచ్చు. బ్లాక్ ఫ్రైడే సేల్‌ ఉన్నంతవరకే ఈ డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయి. కాబట్టి.. త్వరగా నిర్ణయించి, మీ గేమింగ్ లైబ్రరీని విస్తరించుకోండి!

Also Read: చిన్న సైజులో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు.. 2025లో బెస్ట్ ఇవే..

Related News

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

Big Stories

Advertisement
×