E-Paper
Advertisement

5G vs Wi-Fi calling: అస్తమానం కాల్స్ కట్ అవుతున్నాయా? ఈ ఒక్క సెట్టింగ్‌‌తో సిగ్నల్ లేకపోయినా కాల్స్ మాట్లాడొచ్చు!

5G vs Wi-Fi calling: అస్తమానం కాల్స్ కట్ అవుతున్నాయా? ఈ ఒక్క సెట్టింగ్‌‌తో సిగ్నల్ లేకపోయినా కాల్స్ మాట్లాడొచ్చు!
Advertisement

5G vs Wi-Fi calling: 2026 నాటికి భారతదేశంలో నెట్‌వర్క్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అసలు 5G సిగ్నల్ వస్తుందా, రాదా అని ఆలోచించే పరిస్థితి నుంచి తక్కువ సమయంలోనే ఎంత వేగంగా పనిచేస్తుందో అనే స్థాయికి చేరుకున్నాం. అయితే 5G నెట్‌వర్క్ ఎంత విస్తరించినా, ఇప్పటికీ చాలామందికి Wi-Fi కాలింగ్, 5G నెట్‌వర్క్‌ల మధ్య తేడాలు తెలియడం లేదు. ఈ రెండూ ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఉపయోగపడేవే అయినా.. వీటి పనితీరులో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది.

అసలు 5G అంటే ఏమిటి?

జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు అందిస్తున్న లేటెస్ట్ మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీయే ఈ 5G. ఇది సెల్ టవర్ల ద్వారా సిగ్నల్స్ అందుకుంటూ మనకు స్పీడ్ ఇంటర్నెట్, స్పష్టమైన కాల్ క్వాలిటీని అందిస్తుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఈ 5G నెట్‌వర్క్ ఎంతో కీలకం. ప్రస్తుతం ప్రముఖ నగరాల్లో దీని కవరేజీ అద్భుతంగా ఉన్నప్పటికీ.. మారుమూల ప్రాంతాల్లో, పెద్ద పెద్ద భవనాల లోపల కొన్నిసార్లు సిగ్నల్స్ ఉండవు.

Advertisement

Alos Read: వాట్సప్ కొత్త రూల్.. ప్రతి 6 గంటలకూ లాగ్ అవుట్ అవ్వాల్సిందే, అందుకే ఇలా చేయండి!

Wi-Fi కాలింగ్ ప్రత్యేకతలేమిటి? 

Wi-Fi కాలింగ్ అనేది మొబైల్ టవర్లతో సంబంధం లేకుండా పనిచేస్తుంది. మన ఇంట్లోనో, ఆఫీసులోనో వైఫై రూటర్ ఉంటే చాలు.. మొబైల్ సిగ్నల్ అస్సలు లేకపోయినా హాయిగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. దీనికోసం వాట్సాప్ వంటి యాప్స్ ఏవీ అక్కర్లేదు. మన ఫోన్ నంబర్ నుంచే కాల్ వెళ్తుంది. అందుకే లోతైన ప్రదేశాల్లో ఉన్నా, నెట్‌వర్క్ అందని గదుల్లో ఉన్నా ఈ వైఫై కాలింగ్ భలే పనికొస్తుంది.

ఏది ఎప్పుడు వాడాలి?

Advertisement

మీరు ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేస్తున్నా లేదా బయట ఉండి సినిమాలు, క్రికెట్, యూట్యూబ్ లాంటివి చూస్తున్నా 5G నెట్‌వర్క్ బెస్ట్ ఆప్షన్. పైగా ఎమర్జెన్సీ టైమ్‌లో లొకేషన్ ట్రాక్ చేయాలన్నా 5Gనే కరెక్ట్. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కాల్స్ కట్ అవుతున్నా లేదా అవతలి వాళ్ల వాయిస్ సరిగ్గా వినిపించకపోయినా వెంటనే Wi-Fi కాలింగ్ ఆన్ చేసుకోండి. సింపుల్‌గా చెప్పాలంటే.. బయట ఉన్నప్పుడు 5Gని, ఇంట్లో ఉన్నప్పుడు వైఫై కాలింగ్‌ని వాడుకుంటే నెట్‌వర్క్ టెన్షన్ అస్సలు ఉండదు.

Alos Read: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ధర తగ్గింపు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×