Big Stories

80% Discount on Electronics: అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. వీటిపై 80 శాతం వరకు తగ్గింపు

Amazon Mega Electronics Days Sale 2024: తక్కువ ధరలో మంచి ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను కొనుక్కోవాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ది బెస్ట్ సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో అనేక రకాలైన ప్రొడక్టులపై దాదాపు 80 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. అయితే ఏ ఏ ప్రొడక్టులపై ఎంత శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ కొత్తగా ‘మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్ ఏప్రిల్ 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భారీ తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. SBI క్రెడిట్ కార్డు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు, HDFC క్రెడిట్ / డెబిట్ కార్డుతో సహా మరికొన్ని బ్యాంక్ కార్డులపై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు.

- Advertisement -

ఈ సేల్‌లో ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌వాచెస్, హెడ్ ఫోన్స్, టాబ్లెట్స్, కెమెరా వంటి వాటిపై తగ్గింపులను అందిస్తుంది. అలాగే గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు తగ్గింపు, స్పీకర్స్‌పై 65 శాతం వరకు తగ్గింపు, కంప్యూటర్ యాక్ససరీస్‌పై 70 శాతం వరకు తగ్గింపు, సెక్యూరిటీ కెమెరాపై 80 శాతం, స్టోరేజీ డివైజెస్‌పై 65 శాతం, వైఫై రూటర్స్‌పై 60 శాతం, ప్రింటర్స్‌పై 40 శాతం, కాంపోనెంట్స్‌పై 60 శాతం, మోనిటర్స్‌పై 60 శాతం, మ్యూజికల్ ఇన్‌స్ట్రూమెంట్స్‌పై 75 శాతం, డెస్క్‌టాప్‌పై 60 శాతం, అలాగే ఆఫీస్ ప్రొడక్ట్స్ ‌పై 65 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.

Also Read: ఇదేం ఆఫర్రా బాబు మతిపోతుంది.. రూ.29వేల ల్యాప్‌టాప్‌ కేవలం రూ.990లకే!

వీటిపై SBI క్రెడిట్ కార్డు లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఈఎంఐ ఆప్షన్లలో కొంటే 10 శాతం తగ్గింపు పొందొచ్చు. అలాగే HDFC బ్యాంక్ కస్టమర్లు సుమారు రూ.5000 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. అందువల్ల అత్యంత భారీ డిస్కౌంట్స్‌తో తక్కువ ధరలో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులను కొనుక్కోవాలని ప్లాన్ చేసే వారికి ఇదొక చక్కటి అవకాశమనే చెప్పాలి. ఈ సేల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు.. మీకు ఏ ప్రొడక్ట్ కావాలో ఆ ప్రొడక్స్ ధర వివరాలు తెలియాలంటే ఓ సారి అమెజాన్‌‌లో చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News