Big Stories

YS Sharmila Comments: స్వామి చుట్టూ రోజా, ‘జబర్దస్త్’ దోపిడీ!

YS Sharmila Comments on Minister Roja: వైసీపీ ఫైర్‌బ్రాండ్ అనగానే గుర్తుకొచ్చే మొదటి పేరు రోజా. తన పదవి కంటే ప్రత్యర్థులపై బాణాలు ఎక్కుపెట్టడంలో ముందుంటారు. స్వతహాగా నటి కావడంతో ఆమె మాటలు తూటాల మాదిరిగా ప్రజల్లోకి దూసుకెళ్తాయి. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆమె కనిపించలేదు. మాట కూడా ఎక్కడా వినబడలేదు. జబర్దస్త్ రోజా ఎందుకు సైలెంట్ అయ్యినట్టు? నియోజకవర్గంలో సానుకూల సంకేతాలు లేవా? సొంత ఇంటికి చక్కబెట్టుకునే పనిలో ఆమె నిమగ్నమయ్యారా? ఇలా రకరకాల ప్రశ్నలు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి.

- Advertisement -

రోజా అంటే తెలియనివారు తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. వెండితెరకు దూరమైనా.. జబర్దస్త్ షో ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారామె. రాజకీయాల్లోకి వచ్చి సినిమాట్రిక్స్ డైలాగ్స్ చెప్పుడం లోనూ ఈమెకు తిరుగులేదంటారు ఆ పార్టీ నేతలు. ఒకప్పుడు ప్రత్యర్థులపై భారీ ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టేశారు. ఇప్పుడు ఈమెపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. మంత్రి రోజాపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

- Advertisement -

నగరి నియోజకవర్గంలో నలుగురు మంత్రులు ఉన్నారని, ఆ నలుగురు ఆమె ఫ్యామిలీ సభ్యులేనంటూ విమర్శలు మొదలుపెట్టారు వైఎస్ షర్మిల. ఇసుక, ప్రభుత్వ భూముల కబ్జాలు యథేచ్ఛగా చేస్తున్నారంటూ దుయ్య బట్టారామె. ఆదివారం రాత్రి న్యాయ యాత్రలో భాగంగా పుత్తూరు రోడ్ షోలో ప్రసంగించారు వైఎస్ షర్మిల. ఈ క్రమంలో మంత్రి రోజాపై తీవస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇసుక, మట్టి మాఫియా నుంచి దోచుకున్న డబ్బులనే ఎన్నికల్లో ఆమె పంచిబెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ లేఅవుట్లు, ఇసుక మాఫియా ద్వారా ఆమె అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోయిందన్నది షర్మిల ప్రధాన ఆరోపణ.

Also Read: సమయం లేదు మిత్రమా.. కుర్చీ మడత పెట్టేయడం ఖాయం!

మార్చిలో జరిగిన టీడీపీ ప్రజాగళం సభలో మంత్రి రోజాపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. ఆమెని జబర్దస్త్ ఎమ్మెల్యే అంటూ ప్రస్తావించిన బాబు, లంచాలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా పేర్కొన్నారు. పదవులు ఇప్పిస్తాన ని నేతల వద్ద డబ్బు వసూలు చేశారన్నారు. ఇసుక, గ్రావెల్, భూదందాలకు అడ్డు అదుపులేకుండా పోయాయని ఘాటుగా విమర్శించారు. మరో విషయం ఏంటంటే.. రోజా నియోజకవర్గం నగరిలో సొంత పార్టీ నేతలే ఆమెకి ప్రత్యర్థులుగా మారారు. వైసీపీ ఓట్లను వాళ్లు  ఎక్కడ చీల్చుతారేమోనని బెంబేలెత్తుతున్నా రు. ఈ క్రమంలో స్వామి సన్నిధిలో ఎక్కువగా కనిపిస్తున్నారు.

పదిరోజుల కిందట విశాఖ వెళ్లిన మంత్రి రోజా, శారదా పీఠానికి వెళ్లి అక్కడ స్వామి ఆశీస్సులు తీసుకు న్నారు. మరి స్వామి నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయో తెలీదుగానీ అప్పుటి నుంచి ఫుల్‌ఖుషీగా ఉన్నారు. నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు రోజా గెలిచారు. స్వతహాగా అక్కడ ఆమెకు ఎదురుగాలి రావడం సహజం. ఈసారి కూడా టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు భాను‌ప్రకాశ్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కేవలం 2 వేల 700 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. పైగా ప్రజల్లో ఆయనపై సానుభూతి బాగా పెరిగింది. కానీ ఈసారి భానును ఓడించడం చాలా కష్టమని బల్లగుద్ది అక్కడి వైసీపీ నేతలే చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News