E-Paper
Advertisement

ఏసీ + ఫ్యాన్ కాంబో.. కరెంటు బిల్లు దిగిరావాల్సిందే.. కూలింగ్ దుమ్ములేచిపోవాల్సిందే..!

ఏసీ + ఫ్యాన్ కాంబో.. కరెంటు బిల్లు దిగిరావాల్సిందే.. కూలింగ్ దుమ్ములేచిపోవాల్సిందే..!

AC Fan Combo: సాధారణంగా చాలా మంది ఏసీ ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్ ను ఆఫ్ చేస్తుంటారు. ఫ్యాన్ వేస్తే ఏసీలోని చల్లటి గాలి బయటకు పోతుందని, కూలింగ్ తగ్గుతుందని వారు భ్రమిస్తుంటారు. కానీ సైన్స్, నిపుణులు అభిప్రాయాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏసీ నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌ను కూడా ఆన్ చేయడం వల్ల కూలింగ్ పెరగడమే కాకుండా.. విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు. అది ఎలాగో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

గది మెుత్తం కూల్ కూల్..

సాధారణంగా ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి.. బరువుగా ఉండి కిందకు చేరుకుంటుంది. వేడి గాలి తేలిగ్గా ఉంటూ పైకి వెళ్లిపోతుంది. ఫలితంగా ఏసీ ఆన్ చేసి ఫ్యాన్ వేయకపోతే ఏసీకి ఎదురుగా ఉన్న ప్రాంతం మాత్రమే త్వరగా చల్లబడుతుంది. అదే సమయంలో సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో రన్ చేస్తే.. అది ఏసీ ఇచ్చే చల్లటి గాలిని గదిలోని నాలుగు మూలలకూ సమానంగా సర్క్యులేట్ చేస్తుంది. దీనివల్ల గది అంతటా ఒకేలాంటి చల్లదనం ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

టెంపరేచర్ పెంచి.. బిల్లు ఆదా

చాలామంది రూమ్ త్వరగా చల్లబడాలని ఏసీ రిమోట్‌లో టెంపరేచర్‌ను 18 – 20 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతను సెట్ చేస్తుంటారు. దీనివల్ల ఏసీ కంప్రెషర్‌పై విపరీతమైన భారం పడి పవర్ బిల్లు అమాంతం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏసీని 24 – 26 డిగ్రీల మధ్య ఉంచి.. సీలింగ్ ఫ్యాన్‌ను ఆన్ చేస్తే గది ఉష్ణోగ్రత 20 డిగ్రీల టెంపరేచర్ ను తలపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం.. ఏసీలో ప్రతి ఒక్క డిగ్రీ టెంపరేచర్ పెంచితే దాదాపు 6 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. కాబట్టి ఏసీని 18 డిగ్రీలకు బదులుగా 24 డిగ్రీల వద్ద టెంపరేచర్ సెట్ చేస్తే.. పవర్ బిల్లును 20-30 శాతం తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ కాలం మన్నిక

మనం సెట్ చేసిన టెంపరేచర్ కు గది వాతావరణాన్ని తీసుకురావడానికి ఏసీలోని కంప్రెషర్ ఎంతగానో శ్రమిస్తుంది. అదే ఫ్యాన్ సహాయంతో రూమ్ వేగంగా చల్లబడటం వల్ల ఏసీ కంప్రెషర్ త్వరగా ఆటో-కట్ అవుతుంది. దీనివల్ల ఏసీపై లోడ్ తగ్గి కరెంట్ ఆదా అవ్వడమే కాకుండా ఏసీ లైఫ్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో తరచూ వచ్చే రిపేర్ల ఖర్చు తప్పుతుందని హితవు పలుకుతున్నారు.

Also Read: ఏసీ 24°Cలో పెట్టినా కరెంటు బిల్లు బాధిస్తోందా? ఈ స్మార్ట్ ట్రిక్స్ పాటిస్తే సరి!

ఈ జాగ్రత్తలు కూడా మీ మంచికే

ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్‌ను ఫుల్ స్పీడ్ లో కాకుండా 2-3 స్పీడ్‌లో పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా పెడితేనే చల్లటి గాలి గదిలో చక్కగా తిరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఫుల్ స్పీడ్ పెడితే గదిలోని వేడి గాలి చల్లటి గాలి ఒకేసారి కలిసిపోయి ఉక్కపోతగా అనిపించవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏసీ – ఫ్యాన్ కాంబో వల్ల ఫిల్టర్లలోకి పెద్ద ఎత్తున దుమ్ము, దూళి చేరే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వారం, 10 రోజులకు ఒకసారి ఫిల్టర్లను క్లీన్ చేసుకుంటే బెటరని హితవు పలుకుతున్నారు.

Also Read: ఫ్రిడ్జ్ అక్కర్లేదు.. పైసా ఖర్చు లేదు.. పాలు, పెరుగు ఎప్పటికీ తాజాగా!

Related News

సరికొత్త ‘మింట్’ కలర్‌లో Samsung Galaxy A27.. లాంచ్‌కు ముందే లీకైన వివరాలు!

ఏసీ 24°Cలో పెట్టినా కరెంటు బిల్లు బాధిస్తోందా? ఈ స్మార్ట్ ట్రిక్స్ పాటిస్తే సరి!

పూర్తిగా డిజైన్ మార్చేసిన శాంసంగ్.. కొత్త Galaxy S26 FE లుక్ చూస్తే ఐఫోన్‌ను మర్చిపోతారు!

ఫ్రిడ్జ్ అక్కర్లేదు.. పైసా ఖర్చు లేదు.. పాలు, పెరుగు ఎప్పటికీ తాజాగా!

iPhone Fold Leaks.. యాపిల్ తొలి మడత ఫోన్ ఇలా ఉండబోతుందా? డిజైన్ చూస్తే ఆశ్చర్యపోతారు!

యూట్యూబర్స్, రైడర్స్‌కి పండగే.. మైండ్ బ్లోయింగ్ 5K యాక్షన్ కెమెరా ఎంట్రీ!

ఎండలు ఎంత దంచికొట్టినా.. ఈ Tower ACల ముందు బలాదూరే, ధర కూడా తక్కువే!

Big Stories

×