Samsung Galaxy A27: టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త Galaxy A27 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. గతంలో వచ్చిన Galaxy A26 ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రాబోతున్న ఈ ఫోన్, ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించి టెక్ ప్రియుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ మొబైల్‌కు సంబంధించిన ఓ సరికొత్త కలర్ వేరియంట్ నెట్టింట లీకై హల్‌చల్ చేస్తోంది.
ప్రముఖ టిప్‌స్టర్ మహ్మద్ ఖత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. గెలాక్సీ A27 మోడల్ సరికొత్త ‘ఆసమ్ మింట్’ (లేత పచ్చ) రంగులో రానుంది. ఈ ఫోన్ డిజైన్ చాలా క్లాసీగా కనిపిస్తోంది. లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఈ ఫోన్ మొత్తం నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. ఇందులో ఆసమ్ బ్లాక్, ఆసమ్ బ్లూ, ఆసమ్ పింక్‌లతో పాటు తాజాగా లీకైన ఆసమ్ మింట్ కలర్ ఉండబోతున్నాయి.
లుక్ పరంగా శాంసంగ్ తమ పాత సిగ్నేచర్ డిజైన్‌నే కొనసాగించనుంది. ఫ్లాట్ సైడ్స్, స్క్రీన్ పైభాగంలో మధ్యలో పంచ్ హోల్ కెమెరా, వెనుక వైపు నిలువుగా ఉండే మూడు కెమెరాల సెటప్‌తో ఇది రానుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. దీనిలో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉండేలా 120Hz రీఫ్రెష్ రేట్‌ను కూడా ఇందులో జోడించనున్నారు.
Also Read: పూర్తిగా డిజైన్ మార్చేసిన శాంసంగ్.. కొత్త Galaxy S26 FE లుక్ చూస్తే ఐఫోన్‌ను మర్చిపోతారు!
ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన ఫొటోలు, స్థిరమైన వీడియోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌ను ఇస్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది. మల్టీటాస్కింగ్ కోసం 8GB వరకు RAM, అలాగే 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి.
ఎక్కువ సమయం ఛార్జింగ్ రావడానికి ఇందులో 5,000mAh భారీ బ్యాటరీని అమర్చనున్నారు. దీనికి సపోర్ట్‌గా 25W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5 వెర్షన్‌తో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు శాంసంగ్ చాలా ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లను కూడా ప్రామిస్ చేయనుంది. కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: 8000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లు.. OnePlus Turbo 6X Pro వచ్చేస్తోంది, పూర్తి వివరాలివే!