E-Paper
Advertisement

Iran Inflation: ఇరాన్ ‘కోటి’ నోటు వెనుక అసలు కథ! ఒక నోటుతో కనీసం అర కిలో మటన్ కూడా రాదా?

Iran Inflation: ఇరాన్ ‘కోటి’ నోటు వెనుక అసలు కథ! ఒక నోటుతో కనీసం అర కిలో మటన్ కూడా రాదా?
Advertisement

Iran Inflation:ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఇరాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ లతో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కి వెళ్లడం, ఆర్థిక ఆంక్షలతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో.. ఏకంగా 10 మిలియన్ రియాల్ (ఒక కోటి రియాల్) విలువ గల కొత్త నోటును మార్కెట్లోకి వదిలింది.
వినడానికి ‘కోటి’ అంటే అబ్బో అనిపిస్తుంది కానీ, గ్లోబల్ మార్కెట్‌లో దీని అసలు విలువేంటో తెలిస్తే షాక్ అవుతారు!

‘కోటి’ నోటు.. కానీ విలువ మాత్రం కేవలం $7 డాలర్లే!
అవును, మీరు చదివింది నిజమే! ఇరాన్ విడుదల చేసిన ఈ పింక్ కలర్ జంబో నోటు అంతర్జాతీయ మార్కెట్‌లో కేవలం 7.60 US డాలర్లకు (మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 630 – 700) సమానం.
రికార్డు స్థాయిలో పతనం: కేవలం కొన్ని వారాల క్రితమే 5 మిలియన్ రియాల్ నోటును తెచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు అంతకంటే పెద్ద నోటును తేవాల్సి వచ్చిందంటే అక్కడి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కారణం: యుద్ధ భయంతో ప్రజలు తమ డబ్బును డిజిటల్ రూపంలో ఉంచుకోవడానికి భయపడుతున్నారు. ఒకవేళ బ్యాంకింగ్ వ్యవస్థ ఆగిపోతే ఏంటన్న ఆందోళనతో నగదు కోసం క్యూ కడుతున్నారు.

Advertisement

కిలో పిండికి ‘లక్షల’ రియాల్స్.. ఇది నరకం కాదా?
ఇక ఇరాన్‌లో ధరలు చూస్తుంటే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఒక బ్యాగ్ నిండా డబ్బులు తీసుకెళ్తే ఒక కారు వచ్చేది.. ఇప్పుడు ఒక బ్యాగ్ నిండా నోట్లు తీసుకెళ్తే కనీసం ఒక వారం సరిపడా సరుకులు కూడా రావడం లేదు.
మటన్ రేటు: ఒక కిలో మటన్ కొనాలంటే సుమారు 1.3 నుండి 2.2 కోట్ల రియాల్స్ కావాలి. అంటే మీరు జేబులో ఈ కొత్త ‘కోటి’ నోట్లు రెండు పెట్టుకెళ్లాలి!
పాలు & బియ్యం: లీటర్ పాలు దాదాపు 11 లక్షల రియాల్స్, కిలో బియ్యం 38 లక్షల రియాల్స్ పలుకుతున్నాయి.
గత 10 ఏళ్లలో ఒక సామాన్య కుటుంబం వాడే ఫుడ్ బాస్కెట్ ధర 1.2 మిలియన్ల నుండి ఏకంగా  36.6 మిలియన్లకు పెరిగింది!

సున్నాల తొలగింపు?
దీంతో ప్రజల్లో ఈ ‘కోట్ల’ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ప్రభుత్వం కొత్త నోట్ల మీద కేవలం మొదటి నాలుగు అంకెలనే బోల్డ్‌గా చూపిస్తోంది. ఉదాహరణకు, 10,000,000 రియాల్స్ మీద కేవలం 1,000 అని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తుంది. దీని ద్వారా భవిష్యత్తులో రియాల్ నుండి ‘టోమాన్’ అనే కొత్త కరెన్సీకి (10 రియాల్స్ = 1 టోమాన్)  మారే ప్లాన్‌లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

అసలు విలన్ ‘ద్రవ్యోల్బణం’.. నోట్లు పరిష్కారం కాదు!
ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే.. “పెద్ద నోట్లు ముద్రించడం అనేది గాయానికి కట్టు కట్టడం లాంటిది మాత్రమే, కానీ లోపల ఉన్న ఇన్ ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) అది తగ్గించదు.”అని

యుద్ధం vs ఎకానమీ: ఇప్పటికే  ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఆయిల్ ఎగుమతులు దెబ్బతిన్నాయి. దీంతో ఆదాయం తగ్గి, ఖర్చు పెరగడంతో డబ్బును విచ్చలవిడిగా ముద్రించడమే తప్ప మరో దారి లేకుండా పోయింది.
కోటి రియాల్స్ జేబులో ఉన్నా.. ఒక పూట కడుపు నిండా తినడం కష్టమైపోతున్న ఇరాన్ పరిస్థితి చూస్తుంటే.. ‘ఆర్థిక స్థిరత్వం’ లేని దేశంలో కరెన్సీ కేవలం కాగితం ముక్క మాత్రమే అని క్లియర్ గా  అర్థమవుతోంది.

also read :Social Media: ఒకే ఇంట్లో ఇద్దరు.. కానీ జీవితం మాత్రం ఆన్‌లైన్‌లో ? సొల్యూషన్ ఇదే..!

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×