E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అద్దెకు ఏసీలు, కూలర్లు.. సమ్మర్‌లో వాడి ఇచ్చేస్తే చాలు.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

అద్దెకు ఏసీలు, కూలర్లు.. సమ్మర్‌లో వాడి ఇచ్చేస్తే చాలు.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Advertisement

Rent AC: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తట్టుకోలేక చాలా మంది ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే వేల రూపాయలు ఖర్చు చేసే ఆర్థిక స్తోమత, తరుచూ ఇళ్లు మారుతున్న వారు దీనికి ప్రత్యామ్నయం ఆలోచిస్తున్నారు. అద్దెకు ఏసీలు, కూలర్లను ఇచ్చే వ్యాపారులను సంప్రదిస్తున్నారు. సమ్మర్ వరకూ వాటిని వాడుకొని.. తిరిగి ఇచ్చేయాలని భావిస్తున్నారు. అయితే అద్దెకు ఏసీ లేదా కూలర్ ను తీసుకోవాలని భావిస్తే.. వాటిని ఎంచుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

దేనిని ఎంచుకోవాలి?

వేసవిలో సౌకర్యానికి అనుగుణంగా ఏసీ లేదా కూలర్ ను ఎంచుకోవచ్చు. అయితే ఉండే ప్రాంతం, అక్కడి వాతావరణాన్ని బట్టి ఏసీ, కూలర్ లో ఏది బెస్టో నిర్ణయించుకోవచ్చు. కూలర్ తీసుకుంటే గాలి పొడిగా ఉండే హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మెరుగైన కూలింగ్ ను పొందొచ్చు. మార్చి – మే నెలల్లో ఇవి బాగా పనికొస్తాయి. పైగా ఏసీతో పోలిస్తే వీటికి అద్దె కూడా తక్కువే. నెలకు రూ.500-800 మధ్య కూలర్ రెంటుకు లభిస్తుంది. అదే తీర ప్రాంతాల్లో ఉండే వారు అయితే ఏసీని ఎంచుకుంటే బెస్ట్. తేమ అధికంగా ఉండే ఆ ప్రాంతాల్లో ఇవి మెరుగైన కూలింగ్ ను అందిస్తాయి. అయితే కూలర్ తో పోలిస్తే ఏసీ అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు అధిక పవర్ బిల్లు భారం కూడా వినియోగదారుడిపై పడుతుంది.

ఇవి చెక్ చేయండి!

Advertisement

కొందరు వ్యాపారులు ఏసీ లేదా కూలర్ ను అద్దెకు ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్ పై సంతకం చేయాలని సూచిస్తుంటారు. కాబట్టి దానిపై సంతకం చేసేముందు కొన్ని విషయాలపై కచ్చితంగా క్లారిటీ తెచ్చుకోండి. ఒకవేళ అద్దెకు తీసుకున్న తర్వాత ఏసీ పాడైతే రిపేరు ఖర్చు ఎవరు భరించాలో ముందే నిర్దారణకు వస్తే బెటర్. అలాగే అద్దెకు తీసుకునేముందు డిపాజిట్ మనీ ఎంత? రిఫండ్ చేసే సమయంలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోండి. మరోవైపు ఏసీని తీసుకునేట్లు అయితే 3 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఉన్నవాటిని తీసుకుంటే బెస్ట్. తక్కువ రేటింగ్ ఏసీలు తీసుకుంటే విద్యుత్ బిల్లు భారం పెరుగుతుంది.

గది పరిమాణానికి తగ్గట్టుగా..

సాధారణంగా గది విస్తీర్ణంపై కూలింగ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి పెద్ద గదులకు తక్కువ సామర్థ్యమున్న ఏసీని తీసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి 120 చదరపు అడుగుల లోపు గదికి 1 టన్, 120-180 చ.అ గదికి 1.5 ఏసీ సరిగ్గా సరిపోతుంది. అలా కాకుండా కూలర్ తీసుకోవాలని భావిస్తే.. ట్యాంక్ సామర్థ్యాన్ని చెక్ చేయండి. రాత్రంతా చల్లగా ఉండాలని భావిస్తే కనీసం 60 లీటర్ల ట్యాంక్ ఉన్న డెసర్ట్ కూలర్ అవసరం.

Advertisement

Also Read: Best AC Brands 2026: కొత్త ఏసీ కావాలా? అత్యంత నమ్మకమైన బ్రాండ్స్ ఇవే.. గత కొన్నేళ్లుగా సూపర్ సక్సెస్!

మరికొన్ని జాగ్రత్తలు

ఒకవేళ కూలర్ ను అద్దెకు తీసుకున్నట్లైతే కిటికీలు పూర్తిగా అస్సలు మూయకూడదు. గాలి వచ్చి, పోయేందుకు వీలుగా క్రాస్ వెంటిలేషన్ తప్పనిసరిగా ఉంచాలి. అయితే ఏసీ తీసుకుంటే మాత్రం చల్లటి గాలి బయటకు పోకుండా తలుపులు, కిటికీలు అన్ని మూసివేస్తే బెటర్. మరోవైపు ఏసీలు, కూలర్లను అద్దెకు ఇచ్చేవారే.. ఇన్ స్టాలేషన్ కూడా చేస్తారు. కాబట్టి ఇన్ స్టాలేషన్, ట్రాన్స్ పోర్ట్ ఖర్చుల గురించి అగ్రిమెంట్ సమయంలోనే మాట్లాడుకొని కొంత అమౌంట్ ను ఫిక్స్ అయితే మంచిది.

Also Read: No Cost EMIలో వస్తువులు కొంటున్నారా? దీని వెనుకున్న మోసం తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ ధైర్యం చేయరు!

Related News

రూ.20 వేల లోపే వన్‌ప్లస్ 5G మొబైల్.. మిలిటరీ గ్రేడ్ బాడీ, భారీ బ్యాటరీతో లాంచ్!

లగ్జరీ లుక్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. Samsung Flip Phoneపై అస్సలు మిస్ అవ్వకూడని క్రేజీ ఆఫర్!

భారీగా పడిపోయిన iPhone 17 సిరీస్ ధరలు.. ఇంత తక్కువకు అస్సలు ఊహించి ఉండరు!

బయట వర్షం.. ఇంట్లో ఏసీ లీకేజీ.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

ధరలు పెరుగుతున్న వేళ.. Lava Agni 4పై ఊహించని డిస్కౌంట్.. ఆఫర్ కొద్దిరోజులే!

సూర్యుడితో స్నేహం.. మొబైల్‌కు ప్రాణం.. అదరగొడుతున్న స్మార్ట్ బెంచీలు!

యాపిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. మార్కెట్లోకి ఫస్ట్ Foldable iPhone, డిజైన్ చూస్తే ఫ్లాట్ అయిపోతారు!

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ షేక్.. ఏకంగా మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వన్‌ప్లస్ N6 లాంచ్!

Big Stories

×