E-Paper
Advertisement

కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ కొంపముంచుతోంది.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ కొంపముంచుతోంది.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
Advertisement

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను కేసీఆర్ తన స్వార్థం కోసం ఆరు ముక్కలు చేశారని కడియం ఆరోపించారు. జిల్లాను విడగొట్టవద్దని తాను ఆనాడు ఎంతగా బతిమాలినా కేసీఆర్ వినలేదని.. ఫలితంగా వరంగల్ అస్తిత్వం దెబ్బతిన్నదని మండిపడ్డారు. ప్రస్తుతం వరంగల్ అనే పేరు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో జిల్లాకు మిగిలిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిరాయింపుల అంశంపై కేసీఆర్ ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నారని కడియం ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 36 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుండి చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి రాజీనామా చేయకపోయినా మంత్రి పదవులు కట్టబెట్టిన చరిత్ర కేసీఆర్‌దేనని విమర్శించారు. ‘మీరు చేస్తే అది రాజకీయం అవుతుంది.. వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం అవుతుందా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఈ రాజకీయ విద్యను నేర్పింది కేసీఆరేనని కడియం నిలదీశారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరి.. ఆయన పనితీరు నచ్చకనే చాలామంది నాయకులు పార్టీని వీడుతున్నారని స్పష్టం చేశారు.

Advertisement

కడియం శ్రీహరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన కుమార్తె కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ.. వారు కాంగ్రెస్‌లో చేరి అక్కడి నుండే ఎంపీగా విజయం సాధించారు. పార్టీ మారిన తర్వాత కడియం ఇంత తీవ్రంగా కేసీఆర్‌ను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి. జిల్లాలో తనపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న విమర్శలు.. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పట్ల ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోంది.

వరంగల్ అభివృద్ధిని కేసీఆర్ గాలికొదిలేశారని కడియం ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం పేరుతో జిల్లాను ముక్కలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. నాయకత్వంలో లోపాలు ఉండబట్టే ఒకప్పటి సన్నిహితులు కూడా ఇప్పుడు దూరం జరుగుతున్నారని విశ్లేషించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసే ముందు గతంలో తాము చేసిన తప్పులను సరిచూసుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. ఈ సంచలన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.

Advertisement

ALSO READ: కవిత కొత్త పార్టీ పేరు రాష్ట్ర సేన కాదు.. అసలు పేరు తెలిస్తే షాక్ అవుతారు!

Related News

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

Big Stories

Advertisement
×